Nidhan
టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరిపై సన్‌రైజర్స్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె మీద భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరిపై సన్‌రైజర్స్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె మీద భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఐపీఎల్-2024 మొదలవడానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద ఎవరికీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. సొంత అభిమానులు కూడా ఎస్ఆర్హెచ్ ఈసారి వండర్స్ చేస్తుందని ఆశలు పెట్టుకోలేదు. గత కొన్ని సీజన్లుగా టీమ్ దారుణంగా పెర్ఫార్మ్ చేస్తుండటమే దీనికి కారణం. అయితే కొత్త కెప్టెన్ కమిన్స్ రాకతో ఆరెంజ్ ఆర్మీ రాత మారిపోయింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్రమ్ లాంటి డేంజరస్ ప్లేయర్ల అండతో ఎస్ఆర్హెచ్కు వరుస విజయాలు అందించాడు కమిన్స్. గత రెండు మ్యాచుల్లో ఆర్సీబీ, సీఎస్కే చేతుల్లో ఓడిపోయినా టీమ్ కాంబినేషన్ బాగుంది, కొండంత అండ లాంటి కెప్టెన్ ఉన్నాడు కాబట్టి ఈసారి ఐపీఎల్ కప్పు మనదేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ టైమ్‌లో టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
టాలీవుడ్ భామ చాందినీ చౌదరిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సీరియస్‌గా ఉన్నారు. ఆమె మీద ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చాందినీని ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఓ మూవీ ఫంక్షన్లో ఎస్ఆర్హెచ్ను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్. ‘మ్యూజిక్షాప్ మూర్తి’ అనే కొత్త సినిమాతో ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యారు చాందినీ. అయితే ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీశాయి. ఓ యాంకర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ సీజన్ నడుస్తోంది, మెగా లీగ్‌లో మీకు ఏ టీమ్ అంటే ఇష్టం? అని చాందినీని అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ.. తనకు జీవితంలో ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో చూడాలని ఉందన్నారు.
స్టేడియంలో లైవ్‌గా మ్యాచ్ చూశాక ఫేవరెట్ టీమ్ ఏది అనేది సెలెక్ట్ చేసుకుంటానని చాందినీ చెప్పారు. ‘జీవితంలో ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో చూడాలని ఉంది. మ్యాచ్ చూసి అప్పుడు సెలెక్ట్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మాది ఆంధ్రా కదా, ఆంధ్రాకు టీమ్ లేదు’ అని చాందినీ స్పష్టం చేశారు. అయితే తెలుగు టీమ్‌గా సన్‌రైజర్స్ ఉంది కదా అని యాంకర్ ఆమెను అడగ్గా.. ఆమె మళ్లీ అదే ఆన్సర్ ఇచ్చారు. తనది ఆంధ్రా అని, ఆంధ్రాకు టీమ్ లేదన్నారు. చాందినీ వ్యాఖ్యలపై ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అలా ఎలా అంటారని.. సన్‌రైజర్స్ రెండు రాష్ట్రాల జట్టు కదా, అది తెలుగువాళ్ల టీమ్ అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఆరెంజ్ ఆర్మీకి సపోర్ట్ చేయకపోయినా ఫర్వాలేదని, కానీ ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు. మరి.. ఎస్ఆర్హెచ్పై చాందినీ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Sanju Samson: సంజూ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. దీని కోసమే ఏళ్లుగా ఎదురుచూశారు!
She indirectly triggered whole batthayi army lol🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/CmaJeS9jWW
— Sai Vamshi 💛 (@me_Nobitha) April 28, 2024