iDreamPost
android-app
ios-app

కీలక మ్యాచ్ లో RCBని ముంచిన మ్యాక్స్​వెల్.. చెత్త రికార్డు నమోదు!

RR vs RCB Eliminator Match- Maxwell: ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును గ్లెన్ మ్యాక్స్ వెల్ నిండా ముంచేశాడు. అంతేకాకుండా ఒక చెత్త రికార్డును తన పేరిట నమోదు చేశాడు.

RR vs RCB Eliminator Match- Maxwell: ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును గ్లెన్ మ్యాక్స్ వెల్ నిండా ముంచేశాడు. అంతేకాకుండా ఒక చెత్త రికార్డును తన పేరిట నమోదు చేశాడు.

కీలక మ్యాచ్ లో RCBని ముంచిన మ్యాక్స్​వెల్.. చెత్త రికార్డు నమోదు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్ రాజస్థాన్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎలిమినేటర్లో మెజారిటీ క్రికెట్ అభిమానులు ఆర్సీబీ గెలవాలి అని గట్టిగానే పూజలు చేశారు. అయితే వారి పూజలకు భిన్నంగా ఆర్సీబీ ప్రదర్శన ఉండటం వారిని కాస్త కంగారు పెడుతోంది. అయితే ఈ మ్యాచ్ లో పక్కగా క్లిక్ అవుతారు అనుకున్న ప్లేయర్లే హ్యాండ్ ఇవ్వడం ఆర్సీబీ ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్లని ఉతికి ఆరేస్తాడు అని ఎదురుచూసిన మ్యాక్స్ వెల్ తొలి బంతికే గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా.. మ్యాక్సీ ఒక చెత్త రికార్డును కూడా నమోదు చేశాడు.

ఐపీఎల్ 2024లో ఆర్సీబీ జట్టుకు సంబంధించి రెండు అద్భుతాలు జరిగాయి. ఒకటి తొలుత 6 మ్యాచులు వరుసగా ఓడిపోయి.. ఆ తర్వాత వరుసగా 6 మ్యాచులు గెలిచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కి వచ్చింది. రెండోది ఈ సీజన్లో వరుసగా మ్యాక్స్ వెల్ విఫలమవుతూనే ఉన్నాడు. అంతేకాకుండా.. ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేస్తూనే ఉన్నాడు. మరోసారి కీలక మ్యాచ్ లో కూడా మ్యాక్స్ వెల్ అదే తరహా ప్రదర్శన చేయడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్లీగా వికెట్స్ కోల్పోయి.. జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న సమయంలో కూడా మ్యాక్స్ వెల్ టైమింగ్ లేకుండా.. ఒక పిచ్చి షాట్ ఆడి తొలి బంతికే అవుట్ అందరినీ నిరాశ పరిచాడు.

ఈ సీజన్లో మ్యాక్స్ వెల్ ఆడతాడు.. ఆడతాడు అని ఎదురు చూసిన ప్రతి ఆర్సీబియన్ ఇప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ కీలక మ్యాచ్ లో కెప్టెన్ డుప్లెసిస్(17), విరాట్ కోహ్లీ(33), కామెరూన్ గ్రీన్(27), పటిదార్(34) ఇలా టాపార్డర్ తక్కువ స్కోర్ కే కుప్పకూలితే.. తర్వాత వచ్చే మ్యాక్స్ వెల్ రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తాడు అనుకుంటే.. గోల్డెన్ డక్ గా తలవంచుకుని పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతిని రాంగ్ షాట్ ఆడి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో డకౌట్ అయ్యి ఒక చెత్త రికార్డును కూడా నమోదు చేశాడు.

అదేంటంటే.. ఇప్పటివరకు ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన రికార్డు ధినేశ్ కార్తీక పేరిట ఉండేది. తాజాగా మ్యాక్సీ డకౌట్ అయ్యి.. 18 సార్లు ఐపీఎల్లో డకౌట్ అయిన ఘనతను నమోదు చేశాడు. ధినేశ్ కార్తీక్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. మ్యాక్స్ వెల్ ఐపీఎల్ అంటేనే సీరయస్ గా తీసుకోడు.. ఆస్ట్రేలియా తరఫున ఒంటికాలుతో మ్యాచ్ గెలిపిస్తాడు అంటూ చేసే ఆరోపణలు, విమర్శలకు మరోసారి మ్యాక్స్ వెల్ ఊతం ఇచ్చినట్లు అయ్యింది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్లు.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడతారు. మరి.. మ్యాక్స్ వెల్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.