Nidhan
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్‌కు టైమ్ దగ్గర పడుతోంది. జూన్‌లో మెగా టోర్నీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ మాజీ క్రికెటర్ ఒక సలహా ఇచ్చాడు.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్‌కు టైమ్ దగ్గర పడుతోంది. జూన్‌లో మెగా టోర్నీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ మాజీ క్రికెటర్ ఒక సలహా ఇచ్చాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతోంది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకో నెలన్నర టైమ్ కూడా లేదు. దాదాపుగా అన్ని జట్లు ప్రపంచ కప్ ప్రిపరేషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాయి. భారత జట్టు ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్లో తలమునకలైపోయారు. టీమిండియా స్క్వాడ్ సెలక్షన్ కూడా క్యాష్ రిచ్ లీగ్‌లో ఎవరు బాగా ఆడారనే దాని ప్రాతిపదికన జరుగుతోందని సమాచారం. సెలక్టర్లు ఐపీఎల్ మ్యాచుల్ని నిశితంగా పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ వెంటనే ఫోన్ తీసుకొని ఆ ప్లేయర్‌కు కాల్ చేసి మాట్లాడాలని అన్నాడు. ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు రోహిత్ కాల్ చేసి మాట్లాడాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. ‘జైస్వాల్ బ్యాటింగ్ అనే నాకు చాలా ఇష్టం. అయితే ఐపీఎల్లో అతడి పెర్ఫార్మెన్స్ తీవ్రంగా నిరాశపరుస్తోంది. అతడితో రాజస్థాన్ కోచ్ కుమార సంగక్కర మాట్లాడాలి. రోహిత్ శర్మతోనూ మాట్లాడించాలి. హిట్‌మ్యాన్ వెంటనే ఫోన్ తీసుకొని అతడికి కాల్ చేయాలి. నువ్వు వరల్డ్ కప్‌కు వెళ్లాలి.. కాబట్టి ఈ ఫామ్ పనికిరాదు, కాస్త జాగ్రత్తగా ఆడాలని జైస్వాల్‌కు రోహిత్ చెప్పాలి’ అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఒక ఓవర్లో సిక్స్, బౌండరీ కొట్టాక తర్వాతి బాల్‌ను కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించడం వల్లే జైస్వాల్ తరచూ ఔట్ అవుతున్నాడని తెలిపాడు.
జైస్వాల్ విషయంలో ఆకాశ్ చోప్రా చేసిన కామెంట్స్‌లో తప్పు లేదు. ఈ మధ్య కాలంలో టీమిండియా విజయాల్లో కీలకంగా మారాడు యశస్వి. ప్రతి ఫార్మాట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతూ తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. రీసెంట్గా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బ్యాట్‌తో వీరంగం సృష్టించాడు. ఐదు టెస్టుల్లో కలిపి ఏకంగా 712 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 89గా ఉంది. దీన్ని బట్టే అతడు ఎలా చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత ఫామ్‌లో ఉన్నోడు తీరా ఐపీఎల్‌కు వచ్చేసరికి ఫెయిల్ అయ్యాడు. ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచుల్లో కలిపి కేవలం 121 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే అతడితో రోహిత్ మాట్లాడి.. ఫామ్ అందుకునేలా చూడాలనే ఉద్దేశంతోనే ఆకాశ్ చోప్రా పైకామెంట్స్ చేశాడు. మరి.. జైస్వాల్ బ్యాటింగ్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Aakash Chopra comments on Yashasvi Jaiswal’s approach in IPL 2024. pic.twitter.com/gQOeBNM8aa
— CricTracker (@Cricketracker) April 17, 2024