Nidhan
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఆ టీమ్ లీగ్ స్టేజ్ నుంచే బయటకు వెళ్లిపోయింది. దీంతో రోహిత్ శర్మ జట్టును వీడాడు. ఈ తరుణంలో అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఆ టీమ్ లీగ్ స్టేజ్ నుంచే బయటకు వెళ్లిపోయింది. దీంతో రోహిత్ శర్మ జట్టును వీడాడు. ఈ తరుణంలో అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ జర్నీ పూర్తయింది. ఆ టీమ్ లీగ్ స్టేజ్ నుంచే బయటకు వెళ్లిపోయింది. దీంతో రోహిత్ శర్మ జట్టును వీడి వెళ్లిపోయాడు. ఈ సీజన్లో ఫర్వాలేదనిపించాడు హిట్‌మ్యాన్. ఆడిన 14 మ్యాచుల్లో కలిపి 150 స్ట్రైక్ రేట్‌తో 417 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. తనదైన శైలిలో విధ్వంసక ఇన్నింగ్స్‌లు పెద్దగా ఆడలేదు. కానీ కుదిరినప్పుడు తన బ్యాట్ పవర్ చూపించాడు. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్ మీద 28 బంతుల్లో 68 పరుగులు చేసి ఫామ్‌ను అందుకున్నాడు. ముంబై తరఫున ఈ సీజన్లో అత్యధిక పరుగులు, బౌండరీలు కొట్టిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఇది టీమిండియాకు సూపర్బ్ న్యూస్ అనే చెప్పాలి.
ఐపీఎల్లో ముంబై ప్రయాణం ముగిసిపోవడంతో టీమ్‌ను వదిలి వెళ్లిపోయాడు రోహిత్. అయితే వెళ్తూ వెళ్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏం మాట్లాడాలన్నా కష్టంగానే ఉందని, తమను కావాలనే టార్గెట్ చేస్తున్నారని అన్నాడు. తమకు ప్రైవసీ లేకుండా పోతోందని వాపోయాడు. ఈ సీజన్లో కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు ఆ టీమ్ కోచింగ్ స్టాఫ్‌లో భాగమైన అభిషేక్ నాయర్‌తో సరదాగా కాసేపు ముచ్చటించాడు హిట్‌మ్యాన్. ముంబై జట్టును తాను బిల్డ్ చేశానని, కానీ ఇప్పుడు దాంతో తనకు సంబంధం లేదని, అంతా ముగిసిందని అన్నాడు. వాళ్ల సంభాషణకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలోకి రావడంతో సంచలనంగా మారింది. ముంబైని రోహిత్ వీడటం పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. దీంతో చాలా బాధపడ్డాడీ ముంబైకర్.
లక్నోతో ఆఖరి మ్యాచ్ టైమ్‌లో ధవల్ కులకర్ణితో మాట్లాడుతూ కనిపించాడు రోహిత్. అదే టైమ్‌లో కెమెరామెన్ రావడంతో వాయిస్ మ్యూట్ చేయాలంటూ దండం పెట్టాడు. ఈ విషయాలపై తాజాగా హిట్‌మ్యాన్ ఓ ట్వీట్ చేశాడు. ‘క్రికెటర్ల జీవితాలు ఇప్పుడు సున్నితంగా మారిపోయాయి. మా చుట్టూ కెమెరాలు తిరుగుతూనే ఉన్నాయి. అడుగడుగునా మమ్మల్ని కవర్ చేస్తున్నాయి. మ్యాచ్ డేస్‌లో లేదా ప్రాక్టీస్ సెషన్‌లోనో ఫ్రెండ్స్, కొలీగ్స్‌తో మాట్లాడేందుకు కూడా మాకు ఛాన్స్ ఉండట్లేదు. క్రికెటర్లకు ప్రైవసీ లేకుండా పోయింది. ఏం మాట్లాడాలన్నా కష్టంగానే ఉంది. నా కన్వర్జేషన్‌ను రికార్డు చేయడమే గాక టెలికాస్ట్ కూడా చేశారు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. వ్యూస్ కోసం మాకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఫ్యాన్స్, క్రికెటర్లు, క్రికెట్ మధ్య ఉన్న నమ్మకాన్ని వీళ్లు తెంపేస్తారు’ అంటూ రోహిత్ సీరియస్ అయ్యాడు. మరి.. తమను టార్గెట్ చేస్తున్నారంటూ హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
The lives of cricketers have become so intrusive that cameras are now recording every step and conversation we are having in privacy with our friends and colleagues, at training or on match days.
Despite asking Star Sports to not record my conversation, it was and was also then…
— Rohit Sharma (@ImRo45) May 19, 2024