Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. త్వరలో వరల్డ్ కప్ కోసం యూఎస్ వెళ్లనున్నాడు. కప్పు కొట్టి కెరీర్‌కు గుడ్‌బై చెప్పే ప్లాన్‌లో హిట్‌మ్యాన్ ఉన్నాడని తెలుస్తోంది. అయితే అతడు ఇంకో పదేళ్లు ఆడతాడని ఓ స్టార్ క్రికెటర్ తండ్రి అంటున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. త్వరలో వరల్డ్ కప్ కోసం యూఎస్ వెళ్లనున్నాడు. కప్పు కొట్టి కెరీర్‌కు గుడ్‌బై చెప్పే ప్లాన్‌లో హిట్‌మ్యాన్ ఉన్నాడని తెలుస్తోంది. అయితే అతడు ఇంకో పదేళ్లు ఆడతాడని ఓ స్టార్ క్రికెటర్ తండ్రి అంటున్నాడు.
Nidhan
రోహిత్ శర్మ.. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చి దశాబ్దంన్నరకు పైనే అయింది. ఒంటిచేత్తో జట్టుకు ఎన్నో మ్యాచుల్లో విజయాలు అందించాడు. ఇప్పుడు కెప్టెన్‌గానూ మారి టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో సక్సెస్‌లు చూసిన హిట్‌మ్యాన్.. చిరకాల కోరిక వరల్డ్ కప్‌ను నెరవేర్చుకునే పనిలో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్-2007 నెగ్గిన టీమ్‌లో అతడూ ఉన్నాడు. అయితే అప్పుడు అతడు జట్టులో జూనియర్. కానీ ఇప్పుడు సీనియర్ బ్యాటర్, కెప్టెన్ కూడా. జట్టులో రోహిత్ ఎంత చెబితే అంత అనేలా ఉంది. కాబట్టి ఈ టైమ్‌లో మరో కప్పు కొట్టి కెరీర్‌కు గుడ్‌బై చెబుదామని అతడు అనుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే హిట్‌మ్యాన్ ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించొద్దని ఓ స్టార్ క్రికెటర్ తండ్రి అంటున్నాడు.
రోహిత్ గురించి లెజెండ్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిట్‌మ్యాన్ ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ అవ్వాల్సిన పనిలేదన్నాడు. అతడు ఇంకొన్నాళ్లు క్రికెట్లో కంటిన్యూ అవ్వాలన్నాడు యోగ్రాజ్. రోహిత్ ఫిట్‌గా ఉన్నాడని అతడు మరికొన్నేళ్ల పాటు టీమిండియాను ముందుండి నడిపించగలడని తెలిపాడు. ‘అందరూ క్రికెటర్ల ఏజ్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తుంటారు. అసలు వయసు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం ఉందో నాకు అర్థం కాదు. 40 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్న ఆటగాళ్లు బాగా రాణిస్తే ఏమైనా ఇబ్బందా? ఏజ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడటం ఆపేయాలి. రోహిత్ శర్మ గ్రేట్ ప్లేయర్’ అని యోగ్రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఫిట్నెస్, ట్రైనింగ్ లాంటి అంశాలను రోహిత్ అంతగా సీరియస్‌గా తీసుకోడని యోగ్రాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఒకవేళ ఫిట్నెస్ను గనుక అతడు పట్టించుకుంటే ఈజీగా 50 ఏళ్ల వయసు వరకు ఆడతాడని అన్నాడు. కాగా, 37 ఏళ్ల రోహిత్ టీ20 ప్రపంచ కప్ తర్వాత వన్డేలు, టెస్టులకు పరిమితం అవుతాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు వన్డేలకు గుడ్‌బై చెప్పి కేవలం టెస్టుల్లోనే ఆడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ కూడా ఉందని పుకార్లు వస్తున్నాయి. ఈ తరుణంలో హిట్‌మ్యాన్ ఇంకో పదేళ్లు ఆడతాడంటూ యోగ్రాజ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. మరి.. రోహిత్ ఎప్పటి వరకు ఆడతాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Yograj Singh said, “I’ve never understood the talk about age. What is wrong if you are fit and performing at 40-45. The age factor should be scrapped, Rohit Sharma is a great player who never thought about fitness and training. If he does, he can play till he is 50”. (News18). pic.twitter.com/6j92VwtI9A
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 13, 2024