Nidhan
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ త్వరగా ఔట్ అయ్యాడు. ఓ కళ్లుచెదిరే క్యాచ్‌కు అతడు పెవిలియన్‌కు చేరుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ త్వరగా ఔట్ అయ్యాడు. ఓ కళ్లుచెదిరే క్యాచ్‌కు అతడు పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Nidhan
ఐపీఎల్-2024లో అదరగొడుతున్నాడు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్. ఓపెనింగ్‌లో విరాట్ కోహ్లీతో కలసి అతడు విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతుండటం వల్లే బెంగళూరు వరుస విజయాలు సాధించింది. అయితే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాత్రం డుప్లెసిస్ ఫెయిలయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు 14 బంతుల్లో 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. మంచి స్టార్ట్ దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఓ కళ్లుచెదిరే క్యాచ్‌కు అతడు పెవిలియన్‌కు చేరుకున్నాడు.
రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు డుప్లెసిస్. హార్డ్ లెంగ్త్‌లో పడిన బంతిని మిడ్ వికెట్ మీదుగా బిగ్ షాట్ కొడదామని ప్రయత్నించాడు. అయితే సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో అక్కడే కాచుకొని ఉన్న రొమన్ పావెల్ ముందు వైపు డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. పావెల్ స్టన్నింగ్ క్యాచ్ చూసి డుప్లెసిస్ బిత్తరపోయాడు. అలా ఎలా పట్టుకున్నాడంటూ షాకయ్యాడు. నిరాశతో అతడు క్రీజును వీడాడు. మరి.. పావెల్ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rovman Powell, you beauty!
(via @IPL ) #RRvRCB pic.twitter.com/oRTkVduWUD
— ESPNcricinfo (@ESPNcricinfo) May 22, 2024