iDreamPost

RCB vs RR: కోహ్లీ క్రేజీ రికార్డ్.. IPL హిస్టరీలో ఏకైక మొనగాడిగా అరుదైన ఘనత!

  • Published May 22, 2024 | 8:21 PMUpdated May 22, 2024 | 8:21 PM

రాజస్థాన్​ రాయల్స్​తో జరుగుతున్న ఎలిమినేటర్​లో అరుదైన ఘనతను అందుకున్నాడు కింగ్ కోహ్లీ. ఐపీఎల్ హిస్టరీలో ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైక మొనగాడిగా నిలిచాడు.

ఐపీఎల్-2024లో భీకర ఫామ్​లో ఉన్నాడు కింగ్ కోహ్లీ. అతడు కంటిన్యూస్​గా రన్స్ చేయడం వల్లే ఆర్సీబీ వరుస విజయాలు సాధిస్తోంది. అదే ఫామ్​ను రాజస్థాన్​ రాయల్స్​తో జరుగుతున్న ఎలిమినేటర్​లోనూ కొనసాగిస్తున్నాడు విరాట్. ఈ మ్యాచ్​లో బెంగళూరు బ్యాటింగ్​ను లీడ్ చేస్తున్నాడు కోహ్లీ. ఇప్పటిదాకా ఆడిన 22 బంతుల్లో 3 బౌండరీలు, ఓ సిక్స్ సాయంతో 33 పరుగులతో నాటౌట్​గా ఉన్నాడు. రాజస్థాన్​తో మ్యాచ్​తో అరుదైన ఘనతను అందుకున్నాడు కింగ్.

రాజస్థాన్ మ్యాచ్​తో 8 వేల పరుగుల క్లబ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు కోహ్లీ. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైక మొనగాడిగా నిలిచాడు. 8 వేల పరుగులు పూర్తి చేయడానికి విరాట్​కు 252 మ్యాచులు పట్టింది. క్యాష్​ రిచ్ లీగ్​లో అత్యధిక పరుగులు బాదిన వారిలో అతడే ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. కోహ్లీ తర్వాత స్థానాల్లో శిఖర్ ధావన్ (6769), రోహిత్ శర్మ (6628), డేవిడ్ వార్నర్ (6565), సురేష్ రైనా (5528) ఉన్నారు. మరి.. కోహ్లీ క్రేజీ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి