Nidhan
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సూపర్బ్ నాక్‌తో చెలరేగిపోయాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కింగ్.. టీ20 వరల్డ్ కప్‌లో ఆడటంపై క్లారిటీ ఇచ్చేశాడు.
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సూపర్బ్ నాక్‌తో చెలరేగిపోయాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కింగ్.. టీ20 వరల్డ్ కప్‌లో ఆడటంపై క్లారిటీ ఇచ్చేశాడు.
Nidhan
టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉంటూ వచ్చాడు. భార్య అనుష్క శర్మకు డెలివరీ అవడంతో లండన్‌లో ఉండిపోయిన కింగ్.. ఐపీఎల్-2024 కోసం స్వదేశానికి తిరిగొచ్చాడు. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్లో మంచి ఊపు మీద ఉన్నాడు కింగ్. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించిన విరాట్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయాడు. పరుగులు చేయాలనే కసి మీద ఉన్న రన్ మెషీన్ 49 బంతుల్లో 77 రన్స్ చేశాడు. 11 బౌండరీలు బాదిన కోహ్లీ.. 2 భారీ సిక్సులు కొట్టాడు. అతడితో పాటు దినేష్ కార్తీక్ (10 బంతుల్లో 28 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో అలరించడంతో ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ సీజన్లో బెంగళూరుకు ఇదే తొలి విజయం. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విరాట్.. మ్యాచ్ అనంతరం షాకింగ్ కామెంట్స్ చేశాడు.
టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ దూరం అంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న కరీబియన్ దీవుల్లో విరాట్‌కు మంచి స్ట్రైక్ రేట్ లేదని.. అతడి ప్లేసులో యంగ్‌స్టర్స్‌ను టీమ్‌లోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. స్వయంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయాన్ని కింగ్‌తో డిస్కస్ చేయనున్నట్లు టాక్ వచ్చింది. ఈ గాసిప్స్ కోహ్లీ వరకు చేరినట్లు ఉన్నాయి. అందుకే పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత దీని మీద రియాక్ట్ అయ్యాడు విరాట్. జట్టులో తనకు చోటు లేదంటూ విమర్శించిన వారికి ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికీ వరల్డ్‌వైడ్‌గా టీ20 క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు తన పేరునే వాడుకుంటున్నారని తెలిపాడు. పొట్టి ఫార్మాట్ మీద తాను ఇంకా పట్టు కోల్పోలేదని చెప్పకనే చెప్పాడు. టీ20 ప్రపంచ కప్‌లో ఆడటం పక్కా అని క్లారిటీ ఇచ్చాడు.
‘ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు నా పేరును మాత్రమే వాడుకుంటున్నారని నాకు తెలుసు. నాలో ఇంకా ఆట మిగిలే ఉంది. ఎప్పుడూ బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. అయితే వికెట్లు పడితే మాత్రం సిచ్యువేషన్‌ను అంచనా వేసి ఆడాల్సి ఉంటుంది. గేమ్‌ను ఫినిష్ చేయనందుకు నిరాశగా ఉంది. ఇది నార్మల్ ఫ్లాట్ పిచ్ కాదు. నేను కవర్ డ్రైవ్ బాగా ఆడతానని అందరికీ తెలుసు. అందుకే గ్యాప్‌లో బాల్‌ను తరలించకుండా నన్ను ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో ఎప్పటికప్పుడు నా స్ట్రాటజీని మార్చాల్సి వచ్చింది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. విరాట్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. తాను లేకుండా భారత టీమ్ వరల్డ్ కప్‌కు వెళ్లదని కోహ్లీ చెప్పకనే చెప్పేశాడని అంటున్నారు. ప్రపంచ క్రికెట్‌కే తాను బ్రాండ్ అంబాసిడర్‌నని.. తనకే టీమ్‌లో చోటు లేదని ఎలా అంటారని క్రిటిక్స్‌కు విరాట్ ఇన్‌డైరెక్ట్ కౌంటర్ వేశాడని చెబుతున్నారు. మరి.. కోహ్లీని టీ20 ప్రపంచ కప్‌లో చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Hardik Pandya: నువ్వేమైనా ధోనివా? పాండ్యా పరువుతీసిన మహ్మద్ షమీ!
ONE OF THE GREATEST POST MATCH INTERVIEW OF THE KING…!!! 👑
The way he made clear, he’s still got it and can take any role. He’s eyeing the T20 World Cup spot! 👊pic.twitter.com/x9s8irt9ox
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2024