Nidhan
స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మరోమారు విరుచుకుపడ్డాడు. లైవ్ టెలికాస్ట్‌లోనే కింగ్‌ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేశాడు.
స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మరోమారు విరుచుకుపడ్డాడు. లైవ్ టెలికాస్ట్‌లోనే కింగ్‌ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేశాడు.
Nidhan
రాయల్ ఛాలెంజర్స్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్లో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో కలిపి 542 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది. ఆర్సీబీ కోసం కాకుండా విరాట్ బ్యాటింగ్‌ను చూసేందుకే అభిమానులు భారీగా స్టేడియాలకు తరలుతున్నారు. టికెట్ల కోసం వాళ్లు పెట్టిన డబ్బులకు కింగ్ న్యాయం చేస్తున్నాడు. అలాంటి కోహ్లీని టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంత బాగా ఆడుతున్నప్పటికీ విరాట్‌ను గవాస్కర్ క్రిటిసైజ్ చేయడానికి అతడి స్ట్రైక్ రేటే కారణం. వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌తో మొదలైంది.
కోహ్లీ-గవాస్కర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరి మీద ఒకరు కౌంటర్లకు దిగుతున్నారు. గత నెల 25వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో విరాట్ 43 బంతుల్లో 51 రన్స్ చేశాడు. మొదట్లో వేగంగానే ఆడినా మధ్యలో వికెట్లు పడటంతో అతడు నెమ్మదించాడు. 118.60 స్ట్రైక్ రేట్‌తో స్లోగా బ్యాటింగ్ చేయడంతో కింగ్ మీద విమర్శలు వచ్చాయి. ఇదేం బ్యాటింగ్, టాప్ ప్లేయర్ అయ్యుండి ఇలా సింగిల్స్‌కే పరిమితవడం కరెక్ట్ కాదంటూ గవాస్కర్ సీరియస్ అయ్యాడు. దీనిపై అదే నెల 28వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం విరాట్ రియాక్ట్ అయ్యాడు. మ్యాచ్ సిచ్యువేషన్స్ తెలియకుండా కామెంట్రీ బాక్స్‌లో కూర్చొని మాట్లాడటం కరెక్ట్ కాదన్నాడు. ఈ కౌంటర్‌ను సీరియస్‌గా తీసుకున్న గవాస్కర్ నిన్న గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్ తర్వాత నేరుగా లైవ్‌లోనే కోహ్లీపై విరుచుకుపడ్డాడు.
‘కోహ్లీ స్ట్రైక్ రేట్ 118గా ఉన్నప్పుడు మాత్రమే కామెంటేటర్లు క్వశ్చన్ చేశారు. నేను ఎక్కువగా మ్యాచ్‌లు చూడను. కాబట్టి ఇతర కామెంటేటర్లు ఏమన్నారో నాకు తెలియదు. కానీ ఓపెనర్‌గా వచ్చిన ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసే ప్లేయర్ ఇలా 118 స్ట్రైక్ రేట్‌తో ఆడితే ఏమనాలి? అది కూడా 14, 15వ ఓవర్ వరకు క్రీజులో ఉండి ఈ స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ ఔట్ అయితే చప్పట్లు కొట్టమంటారా? బయటి నుంచి వచ్చే విమర్శల్ని తాము పట్టించుకోమంటూ బిల్డప్ ఇస్తారు. అలాంటప్పుడు ఎందుకు ఈ కామెంట్స్‌కు రిప్లయ్ ఇస్తున్నారు? మేమంతా అంతో ఇంతో క్రికెట్ ఆడాం. మాకు ఎలాంటి అజెండాలు లేవు. ఏం జరుగుతోందో దాని గురించే మాట్లాడతాం. ఎవరి గురించి కూడా కావాలని ఏమీ కామెంట్ చేయం’ అని గవాస్కర్ స్పష్టం చేశాడు. కోహ్లీ-గవాస్కర్ డైలాగ్ వార్‌పై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కొందరు విరాట్‌కు మద్దతుగా నిలిస్తే, ఇంకొందరు గవాస్కర్‌కు సపోర్ట్‌గా ఉంటున్నారు. కోహ్లీ తన స్ట్రైక్ రేట్‌ను మరింత మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. అదే టైమ్‌లో గవాస్కర్ కూడా సీనియర్ కాబట్టి ఏదైనా ఉంటే ప్లేయర్లతో డైరెక్ట్‌గా మాట్లాడి సజెషన్స్ ఇస్తే బాగుంటుందని.. ఇలా లైవ్‌లో విరుచుకుపడటం సరికాదని అంటున్నారు. మరి.. కోహ్లీ-గవాస్కర్ వార్ పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Angry Sunil Gavaskar hits back at Virat Kohli 👀😳#SunilGavaskar #IPL2024 #CricketTwitter pic.twitter.com/C7AaFUQaw4
— Sportskeeda (@Sportskeeda) May 5, 2024
Sunil Gavaskar’s brutal thrashing of Virat Kohli.. 🔥🔥
Chokli deserved it for behaving like a sore loser attacking commentators and questioning their cricketing knowledge. This is the reason why Kohli is not respected as much as Dhoni or Sachin pic.twitter.com/i9kZDWTxJb— mvrkguy (@mvrkguy) May 4, 2024