iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ ముందు అన్ని జట్లకు డేంజర్ బెల్స్.. ఫామ్​లోకి వస్తున్న రాక్షసులు!

  • Published May 20, 2024 | 3:17 PMUpdated May 20, 2024 | 3:17 PM

టీ20 ప్రపంచ కప్​కు ముందు అన్ని జట్లకు ఇది డేంజర్ సిగ్నల్ అనే చెప్పాలి. ఆ టీమ్​లోని రాక్షసులు ఒక్కొక్కరుగా ఫామ్​లోకి వస్తున్నారు.

టీ20 ప్రపంచ కప్​కు ముందు అన్ని జట్లకు ఇది డేంజర్ సిగ్నల్ అనే చెప్పాలి. ఆ టీమ్​లోని రాక్షసులు ఒక్కొక్కరుగా ఫామ్​లోకి వస్తున్నారు.

  • Published May 20, 2024 | 3:17 PMUpdated May 20, 2024 | 3:17 PM
వరల్డ్ కప్ ముందు అన్ని జట్లకు డేంజర్ బెల్స్.. ఫామ్​లోకి వస్తున్న రాక్షసులు!

టీ20 ప్రపంచ కప్​-2024కు టైమ్ దగ్గర పడుతోంది. మెగా టోర్నీ స్టార్ట్ అవడానికి ఇంకో రెండు వారాల సమయం కూడా లేదు. పొట్టి కప్పు సన్నాహాల్లో అన్ని జట్లు బిజీగా మారిపోయాయి. పాకిస్థాన్, ఇంగ్లండ్ లాంటి పలు జట్లు ద్వైపాక్షిక టీ20 టోర్నీలు ఆడుతూ వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవుతున్నాయి. న్యూజిలాండ్, టీమిండియా, ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం ఐపీఎల్​నే పొట్టి కప్పు కోసం ప్రాక్టీస్​గా వాడుకుంటున్నారు. ఈ లీగ్​లో రాణిస్తే అదే మూమెంటమ్, ఫామ్​ను అమెరికాలోనూ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ఫామ్​లోని లేనివారు తిరిగి రిథమ్​ను అందుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో అన్ని టీమ్స్​కు డేంజర్ బెల్స్​ మోగుతున్నాయి. కారణం ఆ జట్టులోని రాక్షసులు ఫామ్​లోకి రావడమే.

వరల్డ్ కప్ అంటే అన్ని టీమ్స్​కు ముందుగా గుర్తుకొచ్చేది ఆస్ట్రేలియానే. మెగా టోర్నీలో ఎన్నోసార్లు ఆ జట్టు విజేతగా నిలిచింది. ప్రపంచ కప్ కొట్టడం అంటే కంగారూలకు ఓ ఆనవాయితీగా మారింది. గతేడాది భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్​ను కూడా వాళ్లే ఎగరేసుకుపోయారు. ఇప్పుడు టీ20 కప్పు మీద కూడా కన్నేశారు. అయితే ఆ టీమ్​లోని పలువురు స్టార్లు ఫామ్​ లేక ఇబ్బంది పడుతూ వచ్చారు. దీంతో ఆసీస్ పనైపోయింది, ఈసారి వరల్డ్ కప్​లో ఆ జట్టు హవా నడవడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ సరిగ్గా మెగా టోర్నీ ఆరంభానికి ముందు కంగారూ టీమ్​లోని ఒక్కో రాక్షసుడు ఫామ్​ను అందుకుంటున్నాడు. తాజాగా చూసుకుంటే.. స్పిన్ ఆల్​రౌండర్ గ్లెన్ మాక్స్​వెల్, పేస్ ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్ ఊపందుకున్నారు.

ఐపీఎల్-2024లో భాగంగా ప్లేఆఫ్స్ చేరాలంటే కీలకంగా మారిన మ్యాచ్​లో చెన్నైని చిత్తు చేసింది ఆర్సీబీ. ఈ నాకౌట్ మ్యాచ్​లో మాక్స్​వెల్, గ్రీన్ బ్యాట్, బంతితో రఫ్ఫాడించి టీమ్​ను గట్టెక్కించారు. తొలుత బ్యాటింగ్ టైమ్​లో గ్రీన్ 17 బంతుల్లో 38 పరుగులతో అదరగొట్టాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో మ్యాక్సీ 5 బంతుల్లో 16 పరుగులతో సత్తా చాటాడు. అనంతరం అతడు సీఎస్​కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్​ను ఔట్ చేసి ఆ టీమ్ వెన్ను విరిచాడు. కీలక సమయంలో శివమ్ దూబేను పెవిలియన్​కు పంపి మ్యాచ్​ను మలుపు తిప్పాడు గ్రీన్. ఈ విధ్వంసకారులు ఫీల్డింగ్​లోనూ ఆకట్టుకున్నారు. గ్రీన్ గత కొన్ని మ్యాచులుగా ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో అదరగొడుతున్నాడు. సీజన్ మొత్తం ఫెయిలైన మ్యాక్సీ.. కరెక్ట్ వరల్డ్ కప్ ముందు ఊపందుకున్నాడు. దీంతో పొట్టి కప్పులో ఈ రాక్షసులను తట్టుకోవడం కష్టమేనని.. ఈసారి ఆసీస్​ను ఆపడం ఎవరి వల్లా కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి