Nidhan
ఆర్సీబీ సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అందరి ఫోకస్‌ను తనవైపు తిప్పుకున్నాడు.
ఆర్సీబీ సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అందరి ఫోకస్‌ను తనవైపు తిప్పుకున్నాడు.
Nidhan
ఆర్సీబీ సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అందరి ఫోకస్‌ను తనవైపు తిప్పుకుంటున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచుల్లో కలిపి 226 పరుగులు చేశాడు డీకే. అతడి స్ట్రయిక్ రేట్ 205గా ఉండటం విశేషం. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఈ సీజన్లో బెంగళూరుకు హార్ట్ బీట్‌గా మారాడు డీకే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే 83 పరుగులు చేసి తనలో ఇంకా సత్తా తగ్గలేదని ప్రూవ్ చేశాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ మీద 23 బంతుల్లో 53 పరుగులతో అరదగొట్టాడు. ఇలా వరుసగా సూపర్బ్ నాక్స్‌తో రెచ్చిపోతున్న డీకే టీ20 వరల్డ్ కప్-2024లో ఆడటం పక్కా అని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా ఈ విషయంపై అతడు రియాక్ట్ అయ్యాడు.
భీకర ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్‌ను పొట్టి ప్రపంచ కప్‌కు వెళ్లే భారత జట్టులో సెలక్ట్ చేస్తారని అంతా అనుకుంటున్నారు. అయితే వయసు 38 కావడంతో అతడ్ని సెలక్ట్ చేయడం కష్టమనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు ముంబై-ఆర్సీబీ మ్యాచ్‌లో రోహిత్ డీకేను టీజ్ చేశాడు. వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవుతున్నాడంటూ ఎగతాళి చేశాడు. దీంతో కార్తీక్ ప్రపంచ కప్ దారులు మూసుకుపోయాయని భావిస్తున్నారు. ఈ తరుణంలో డీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని అన్నాడు. అందుకోసం ఏం చేయడానికైనా తాను రెడీ అని స్పష్టం చేశాడు. ‘ఈ సమయంలో నేను టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తే దాన్ని మించిన గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. అందుకు నేను 100 శాతం రెడీగా ఉన్నా. టీ20 వరల్డ్ కప్ ఫ్లైట్ ఎక్కేందుకు అవసరమైన ప్రతిదీ నేను చేస్తా’ అని డీకే చెప్పుకొచ్చాడు.
వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకునేందుకు ఏం చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానంటూ డీకే చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. అతడి నుంచి ఇలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు. కార్తీక్‌ను ప్రపంచ కప్‌కు పంపించాలని బీసీసీఐని కోరుతున్నారు. వయసు మీద పడుతున్నా అతడి ఫామ్, ఫిట్నెస్, పరుగులు చేయాలనే కసి సూపర్బ్ అని.. కాబట్టి అతడ్ని వెస్టిండీస్ ఫ్లైట్ ఎక్కించాలని కామెంట్స్ చేస్తున్నారు. రాణించాలనే తపన ఉన్న డీకే కంటే బెస్ట్ ఫినిషర్ టీమిండియాకు దొరకడని చెబుతున్నారు. నెటిజన్స్, అభిమానుల డిమాండ్లు పక్కనబెడితే భారత జట్టులో ఫినిషర్ రోల్ కోసం ఆల్రెడీ హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, రింకూ సింగ్ రూపంలో పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లను కాదని.. డీకేకు జట్టులో చోటు లభించడం కష్టమని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి.. వరల్డ్ కప్‌లో ఆడాలని ఉందంటూ కార్తీక్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Dinesh Karthik said “At this stage in my life, it would be the greatest feeling to represent India – I am 100% ready. I will do everything I can to be on that flight to the T20 WC”. [PTI] pic.twitter.com/xx1IJO8tIL
— Johns. (@CricCrazyJohns) April 20, 2024