iDreamPost
android-app
ios-app

Mohammed Siraj: ప్లేఆఫ్స్​ గురించి టెన్షన్ లేదు.. RCB టార్గెట్ అదే: మహ్మద్ సిరాజ్

  • Published May 13, 2024 | 5:56 PM Updated Updated May 13, 2024 | 5:56 PM

వరుసగా 5 విజయాలతో ప్లేఆఫ్స్ రేసులో జెట్ స్పీడ్​తో దూసుకెళ్తోంది ఆర్సీబీ. ఈ నేపథ్యంలో ఆ టీమ్ పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వరుసగా 5 విజయాలతో ప్లేఆఫ్స్ రేసులో జెట్ స్పీడ్​తో దూసుకెళ్తోంది ఆర్సీబీ. ఈ నేపథ్యంలో ఆ టీమ్ పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published May 13, 2024 | 5:56 PMUpdated May 13, 2024 | 5:56 PM
Mohammed Siraj: ప్లేఆఫ్స్​ గురించి టెన్షన్ లేదు.. RCB టార్గెట్ అదే: మహ్మద్ సిరాజ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఊహకు అందని రీతిలో ఆడుతోంది. ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో ఈ టీమ్ గెలుపు అంటే ఏంటో తెలియని విధంగా ఆడింది. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి తీవ్రంగా విమర్శల పాలైంది. విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్​లు తప్ప టీమ్​లో ఎవరూ రాణించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే సెకండాఫ్​లో అందరు ప్లేయర్లు సమిష్టిగా రాణిస్తుండటంతో ఆ టీమ్ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. వరుసగా 5 విజయాలతో ప్లేఆఫ్స్ రేసులో జెట్ స్పీడ్​తో దూసుకెళ్తోంది ఆర్సీబీ. ఈ నేపథ్యంలో ఆ టీమ్ పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్లేఆఫ్స్ గురించి తమకు టెన్షన్ లేదన్నాడు.

ప్లేఆఫ్స్ గురించి ఆందోళన చెందడం లేదన్నాడు సిరాజ్. క్వాలిఫికేషన్ కంటే కూడా టీమ్​కు ఇంకో టార్గెట్ ఉందని తెలిపాడు. ఈ సీజన్​లో వరుస ఓటముల తర్వాత ఆర్సీబీ కమ్​బ్యాక్ అదిరిపోయిందన్నాడు. ప్రత్యర్థి జట్లపై అటాకింగ్​కు దిగి భయపెట్టడమే తమ టార్గెట్ అన్నాడు. ‘ఒక్కో మ్యాచ్​ మీద ఫోకస్ చేస్తూ ఈ స్థాయికి చేరుకున్నాం. ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్ గురించి టెన్షన్ లేదు. ఎందుకంటే అది మా చేతుల్లో లేని విషయం. ప్లేయర్ల కంట్రోల్​లో ఉన్నది ఒకటే.. గ్రౌండ్​లోకి దిగాలి అదరగొట్టాలి. బౌలర్లు, బ్యాటర్లు అందరూ కలసి అటాక్ చేయాలి. ఇదే మా ఫార్ములా. ఈ క్రమంలో క్వాలిఫై అయితే మంచిది. ఇప్పుడు ఆడుతున్న తీరును ఇలాగే కంటిన్యూ చేయాలని భావిస్తున్నాం. గేమ్​ను చాలా ఎంజాయ్ చేస్తున్నాం’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్​లో సిరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ టైమ్​లో ఈ హైదరాబాదీ పేసర్​ పక్కన విరాట్ కోహ్లీ, కర్ణ్ శర్మలు కూడా ఉన్నారు. సిరాజ్​పై కర్ణ్​, కోహ్లీ సెటైర్స్ వేశారు. అలా అనొద్దని, స్టంప్స్ కనిపిస్తే పడగొట్టడమే తమ టార్గెట్ అని చెప్పాలంటూ జోక్ చేశారు. ఆ తర్వాత సిరాజ్ కూడా ఇంకో జోక్ వేయడంతో విరాట్ నవ్వు ఆపుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఆర్సీబీ తన ఆఖరి మ్యాచ్​లో సీఎస్​కేతో తలపడనుంది. ఈ మ్యాచ్​లో భారీ తేడాతో నెగ్గాలి బెంగళూరు. అప్పుడు మాత్రమే ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అవుతుంది. చెన్నైతో మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేస్తే.. 18 పరుగుల తేడాతో నెగ్గాలి. ఒకవేళ ఛేజింగ్​కు దిగితే 18.1 ఓవర్లలో మ్యాచ్​ను ముగించాలి.