Nidhan
ఎలాంటి ఆశల్లేని స్థితి నుంచి వరుస విజయాలతో రాయల్‌గా ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆర్సీబీ. అయితే నాలుగేళ్లుగా పగతో రగిలిపోతున్న ఆ జట్టుకు.. రివేంజ్ తీర్చుకోవడానికి సరైన సమయం వచ్చేసింది.
ఎలాంటి ఆశల్లేని స్థితి నుంచి వరుస విజయాలతో రాయల్‌గా ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆర్సీబీ. అయితే నాలుగేళ్లుగా పగతో రగిలిపోతున్న ఆ జట్టుకు.. రివేంజ్ తీర్చుకోవడానికి సరైన సమయం వచ్చేసింది.
Nidhan
ఎలాంటి ఆశల్లేని స్థితి నుంచి వరుస విజయాలతో రాయల్‌గా ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆర్సీబీ. ఒక సమయంలో ఆ జట్టు ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్ అవకాశాలు కేవలం ఒక్క శాతమే. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప బెంగళూరు క్వాలిఫై అవడం అసాధ్యంగా కనిపించింది. క్రికెట్ లవర్స్ ఆ టీమ్‌ను పట్టించుకోవడం మానేశారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టైమ్‌లో తప్ప మిగతా సమయంలో ఆర్సీబీ మ్యాచులను స్కిప్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ కొన్ని వారాల్లోనే సీన్ మొత్తం మారిపోయింది. ఒక్కో మ్యాచ్‌ను నాకౌట్‌గా భావిస్తూ తమ రియల్ టాలెంట్‌ను బయటపెట్టారు బెంగళూరు ఆటగాళ్లు. అటాకింగ్ అప్రోచ్‌ను నమ్ముకొని సక్సెస్ బాట పట్టారు. గత ఆరు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యారు. అయితే ఆర్సీబీ అసలైన కథను ఇప్పుడే మొదలుపెట్టనుంది.
ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పు కొట్టని ఆర్సీబీ.. ఈసారి దాన్ని సాధించడం పక్కా అని అభిమానులు నమ్ముతున్నారు. ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరడం, మంచి ఊపు మీద ఉండటంతో కప్‌తో తిరిగిస్తుందని భావిస్తున్నారు. అయితే బెంగళూరు జట్టు టైటిల్‌ను కొట్టడంతో పాటు రివేంజ్ తీర్చుకోవడం మీద కూడా ఫోకస్ పెడుతోందని తెలుస్తోంది. నాలుగేళ్లుగా మూడు జట్లపై పగతో రగిలిపోతోంది ఆర్సీబీ. దానికి ఈసారి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. డుప్లెసిస్ సేన రివేంజ్ స్టోరీలో మూడు జట్లు టార్గెట్‌గా ఉన్నాయి. అవే ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్. ఈ మూడు జట్ల మీద పగతో రగిలిపోతోంది బెంగళూరు.
ఐపీఎల్-2020లో ప్లేఆఫ్స్‌లో ఆర్సీబీని ఓడించింది సన్‌రైజర్స్. కప్ కొడదామనుకున్న బెంగళూరు ఆశలపై నీళ్లు పోసింది ఎస్ఆర్హెచ్. ఆ మరుసటి ఏడాది కూడా ప్లేఆఫ్స్‌లోనే ఆర్సీబీ కథ ముగిసింది. కేకేఆర్ వల్ల ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగింది. రెండేళ్ల కింద ఐపీఎల్-2022లో రాజస్థాన్ రాయల్స్ వల్ల ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది ఆర్సీబీ. ఇలా మూడు సార్లు కప్పు వేటలో ఆఖరు వరకు వచ్చి ఆగిపోయింది. దీంతో ఈ మూడు టీమ్స్ మీద డుప్లెసిస్ సేన కోపంతో ఊగిపోతోంది. ఈసారి కూడా కప్పు నెగ్గాలంటే ఈ మూడింటినీ బెంగళూరు ఓడించాలి. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ను ఓడిస్తే.. క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది.
కేకేఆర్-ఎస్ఆర్హెచ్లో ఓ జట్టును క్వాలిఫయర్-2లో ఎదుర్కొంటుంది ఆర్సీబీ. ఒకవేళ అందులోనూ నెగ్గితే ఫైనల్స్‌లో ఈ రెండింట్లో నుంచే ఒక జట్టును ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్లేఆఫ్స్ చేరిన మిగతా మూడు టీమ్స్‌ను ఓడించి డుప్లెసిస్ సేన విజేతగా ఆవిర్భవిస్తే మాత్రం అది ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది చూసిన ఫ్యాన్స్.. దీన్ని దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అంటున్నారు. తన కథ ముగించిన మూడు టీమ్స్‌ను ఓడించి కప్పు గెలిచేందుకు ఆర్సీబీ కోసం ఆయన రాసిన రివేంజ్ స్టోరీ ఇదని కామెంట్స్ చేస్తున్నారు. ఈసాలా కప్ నమ్దే అంటూ టీమ్ గెలుపు మీద ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఆర్సీబీ రివేంజ్ స్టోరీ ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.