iDreamPost
android-app
ios-app

వీడియో: RCBని ధోని అవమానించాడా? ఈ ఫుటేజ్ చూస్తే తప్పెవరిదో తెలుస్తుంది!

  • Published May 20, 2024 | 11:26 AM Updated Updated May 20, 2024 | 11:26 AM

నాకౌట్ మ్యాచ్​లో తమ మీద నెగ్గిన ఆర్సీబీని చెన్నై మాజీ సారథి ధోని అవమానించాడనే విమర్శలు వస్తున్నాయి. అయితే మ్యాచ్​కు సంబంధించి తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వివాదంలో అసలు తప్పు ఎవరిదో దీంతో తేలిపోయింది.

నాకౌట్ మ్యాచ్​లో తమ మీద నెగ్గిన ఆర్సీబీని చెన్నై మాజీ సారథి ధోని అవమానించాడనే విమర్శలు వస్తున్నాయి. అయితే మ్యాచ్​కు సంబంధించి తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వివాదంలో అసలు తప్పు ఎవరిదో దీంతో తేలిపోయింది.

  • Published May 20, 2024 | 11:26 AMUpdated May 20, 2024 | 11:26 AM
వీడియో: RCBని ధోని అవమానించాడా? ఈ ఫుటేజ్ చూస్తే తప్పెవరిదో తెలుస్తుంది!

సాధారణంగా క్రికెట్​లో మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు హ్యాండ్​షేక్స్ ఇచ్చుకోవడం కామన్. అలాగే మొన్న ఆర్సీబీ-సీఎస్​కే నాకౌట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు టీమ్స్ ప్లేయర్లు హ్యాండ్​షేక్స్ ఇచ్చుకున్నారు. అయితే ఆ టైమ్​లో గ్రౌండ్​ లోపలకు వచ్చిన లెజెండ్ ఎంఎస్ ధోని బెంగళూరు ఆటగాళ్లను కలవకుండానే మధ్యలో నుంచి వెళ్లిపోయాడు. సీఎస్​కే జట్టును లీడ్ చేస్తూ అందరికంటే ముందు నిల్చున్న మాహీ.. అటు నుంచి ఆర్సీబీ ఆటగాళ్లు వచ్చే లోపు వైదొలిగాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో కొద్దిసేపటి తర్వాత విరాట్ కోహ్లీ సీఎస్​కే డ్రెస్సింగ్ రూమ్​కు వెళ్లి మరీ మాహీని కలిసొచ్చాడు. ధోని అలా మధ్యలోనే వెళ్లిపోవడం బిగ్ కాంట్రవర్సీగా మారింది.

చెన్నైని బెంగళూరు చిత్తుగా ఓడించింది కాబట్టే ధోని కోపంతో వెళ్లిపోయాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కలవకపోవడం మర్యాద కాదని.. మాహీ అంతటి దిగ్గజం ఇలా ప్రవర్తించడం ఏంటని, దీని నుంచి యంగ్​స్టర్స్​ ఏం నేర్చుకోవాలని నిలదీస్తున్నారు. అయితే మ్యాచ్ టైమ్​లోని ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది చూస్తే అసలు తప్పెవరిదో ఈజీగా తెలిసిపోతుంది. నెట్టింట వైరల్​గా మారిన ఈ వీడియోలో ధోని సీఎస్​కేను లీడ్ చేస్తూ గ్రౌండ్​లో ముందు నిలుచుకున్నాడు. ఆర్సీబీ ఆటగాళ్లు వస్తే కలసి షేక్​హ్యాండ్ ఇద్దామని వెయిట్ చేస్తూ కనిపించాడు. కానీ ఎంతకీ వాళ్లు రాకపోవడంతో అతడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయిన ఆనందంతో ఆర్సీబీ ఆటగాళ్లు పిచ్ నుంచి పక్కకు జరగలేదు. దూరంగా చెన్నై ప్లేయర్లు తమ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్లు మాత్రం సెలబ్రేషన్స్​లో మునిగిపోయారు.

ఎదురు చూసి విసుగొచ్చిన ధోని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ మధ్యలో కలసిన ఆర్సీబీ కోచింగ్ బృందం, ఇతర ఆటగాళ్లను కలసి షేక్​హ్యాండ్స్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్.. ఇందులో ధోని తప్పేమీ లేదని అంటున్నారు. ఆర్సీబీని ధోని అవమానించడం కాదు, మాహీనే బెంగళూరు ప్లేయర్లు అవమానించారని కామెంట్స్ చేస్తున్నారు. అవతలి జట్టు అక్కడ ఎదురుచూస్తున్నా వచ్చి కలవకుండా అతిగా సెలబ్రేట్ చేసుకోవడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. ధోని ప్లేస్​లో ఎవరు ఉన్నా ఇదే పని చేస్తారని చెబుతున్నారు. తప్పంతా ఆర్సీబీదేనని.. ఇంత జరుగుతున్నా, ఈ విషయంలో మాహీని అందరూ విమర్శిస్తున్నా ఇదీ నిజం అంటూ అటు వైపు నుంచి ఓ ప్రకటన కూడా చేయకపోవడం కరెక్ట్ కాదని సీరియస్ అవుతన్నారు. మరి.. ఈ వివాదంలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.