Rohit Sharma: రోహిత్​కు కలసిరాని బర్త్​డే.. ఎప్పటిలాగే ఈసారి కూడా..!

రోహిత్ శర్మకు బర్త్ డే కలసిరాదనే విషయం చాలా మందికి తెలియదు. ఎప్పటిలాగే ఈసారి కూడా పుట్టిన రోజు నాడు అతడికి మళ్లీ అదే జరిగింది.

రోహిత్ శర్మకు బర్త్ డే కలసిరాదనే విషయం చాలా మందికి తెలియదు. ఎప్పటిలాగే ఈసారి కూడా పుట్టిన రోజు నాడు అతడికి మళ్లీ అదే జరిగింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అతడి బర్త్ డే కావడంతో అభిమానులు గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హిట్​మ్యాన్ పేరు, ఫొటోలతో ఉన్న కేకులు కట్ చేయడం, హ్యాపీ బర్త్ డే రోహిత్ అంటూ బ్యానర్లు పెట్టి తెగ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అతడికి విషెస్ చెబుతున్నారు. ఐపీఎల్ హడావుడిలో ఉన్న రోహిత్ తన టీమ్​మేట్స్​తో కలసి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ మేనేజ్​మెంట్ ఈ ఈవెంట్​ను గ్రాండ్​గా ప్లాన్ చేసింది. అతడి భార్య రితికాతో పాటు ఎంఐ ప్లేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా రోహిత్​కు బర్త్ డే కలసిరాలేదు.

రోహిత్​ బర్త్ డేను అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముంబై టీమ్ ప్లేయర్లు కూడా తమ మాజీ కెప్టెన్ పుట్టిన రోజు వేడుకల్ని వైభవంగా జరిపారు. అయితే హిట్​మ్యాన్​ మాత్రం సంతోషంగా లేడు. దీనికి కారణం బర్త్ డే నాడు ఏదైతే జరగకూడదని అతడు అనుకున్నాడో మళ్లీ అదే రిపీట్ అయింది. రోహిత్ పుట్టిన రోజు సమయంలో ప్రతి ఏడాది ఐపీఎల్ జరగడం సాధారణంగా మారింది. క్యాష్ రిచ్ లీగ్ షెడ్యూల్ సరిగ్గా అదే టైమ్​లో ఉండటంతో అతడి బర్త్ డే సెలబ్రేషన్స్ సహచర ఆటగాళ్లతో కలసి చేసుకుంటాడు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా పుట్టిన రోజు హిట్​మ్యాన్​కు ఏమాత్రం కలసిరావడం లేదు. ఆ రోజు ఆడిన మ్యాచుల్లో అతడు బ్యాటర్​గా అట్టర్​ ఫ్లాప్ అవుతున్నాడు. ఇవాళ కూడా అదే రిపీట్ అయింది.

ఐపీఎల్-2014లో తన పుట్టిన రోజు నాడు సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో రోహిత్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. ఐపీఎల్-2022లో రాజస్థాన్​ రాయల్స్​తో మ్యాచ్​లో 2 పరుగులు, ఐపీఎల్-2023లో మళ్లీ అదే టీమ్ మీద 3 పరుగులు చేసి క్రీజును వీడాడు. దీంతో బ్యాడ్ డేగా మారిన అతడి బర్త్ డే విషయంలో ఈసారైనా ఏమైనా మార్పు జరుగుతుందా అని అంతా ఎదురుచూశారు. కానీ ఇవాళ లక్నో సూపర్ జియాంట్స్​తో మ్యాచ్​లో బరిలోకి దిగిన హిట్​మ్యాన్ 4 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో బర్త్ డే కలసిరాదనే సెంటిమెంట్ మరింత బలపడింది. ఔట్ అవగానే నిరాశతో క్రీజును వీడాడు రోహిత్. అతడ్ని సపోర్ట్ చేస్తూ గ్రౌండ్​లో సందడి చేసిన ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా సైలైంట్ అయిపోయారు.

Show comments