Nidhan
ఐపీఎల్-2024లో ముంబై-గుజరాత్ మధ్య మ్యాచ్‌లో ఓ వార్ హైలైట్‌గా నిలిచింది. రోహిత్-పాండ్యాను మించిన గొడవ ఇది. ఈ ఫైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్-2024లో ముంబై-గుజరాత్ మధ్య మ్యాచ్‌లో ఓ వార్ హైలైట్‌గా నిలిచింది. రోహిత్-పాండ్యాను మించిన గొడవ ఇది. ఈ ఫైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
క్రికెట్లో కొన్ని వార్స్ మీద అందరికీ ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లేయర్ల మధ్య, టీమ్స్ మధ్య గొడవలు కామనే. ఆయా ఆటగాళ్లు లేదా జట్లు మళ్లీ తలపడినప్పుడు చూద్దామని అభిమానులు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఒకే జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు, అలాగే ఒక టీమ్ కెప్టెన్‌కు, ఇంకో టీమ్ కోచ్‌కు మధ్య వార్‌ను మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ ఈసారి ఐపీఎల్-2024లో ఇదే హైలైట్ అవుతోంది. ముంబై ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ నడుమ జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా వార్ మీద అందరూ ఫోకస్ చేశారు. హిట్‌మ్యాన్‌ను అవమానిస్తూ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయమని ఆదేశించాడు పాండ్యా. దీంతో రోహిత్ ఫ్యాన్స్ హార్దిక్ మీద సీరియస్ అవడం, కుక్క.. కుక్క అంటూ అతడ్ని గేలి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే మ్యాచ్‌లో జీటీ కోచ్ ఆశిష్ నెహ్రా-పాండ్యాకు మధ్య వార్ కూడా హైలైట్‌గా నిలిచింది.
ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఆశిష్ నెహ్రా గట్టిగా బుద్ధి చెప్పాడు. తమ జట్టును మధ్యలోనే వదిలేసి వెళ్లిన పాండ్యాకు తన సత్తా ఏంటో చూపించాడు నెహ్రా. రెండేళ్ల కింద ముంబై ఇండియన్స్‌లో ఉన్న హార్దిక్ పాండ్యాకు బెస్ట్ ప్రైజ్ ఇచ్చి మరీ తెచ్చుకుంది గుజరాత్ టైటాన్స్. అతడికి కెప్టెన్సీ ఇచ్చి ఎంకరేజ్ చేసింది. సారథ్యంలో ఓనమాలు తెలియని పాండ్యాకు అన్నీ తానై నేర్పించాడు కోచ్ ఆశిష్ నెహ్రా. హార్దిక్ గ్రౌండ్లో ఉండి టీమ్‌ను చూసుకుంటే.. బౌండరీ లైన్‌కు ఆవల నిలబడి అసలు కథ అంతా నెహ్రా నడిపించాడు. మ్యాచ్ సిచ్యువేషన్స్‌కు తగ్గట్లు ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు వేస్తూ జీటీని గెలిపించాడు. ఈ క్రమంలో ఒక ఏడాది కప్పును కొట్టిన గుజరాత్, మరుసటి ఏడాది రన్నరప్‌గా నిలిచింది. అయినా మళ్లీ ముంబై నుంచి భారీ ఆఫర్ రావడంతో జీటీని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు పాండ్యా.
కెప్టెన్సీ ఇచ్చి ఎంకరేజ్ చేసినా హార్దిక్ మధ్యలోనే టీమ్‌ను వదిలేసి వెళ్లిపోవడంతో గుజరాత్ మేనేజ్మెంట్తో పాటు నెహ్రా కూడా కోపంగా ఉన్నాడు. ఆ అగ్రెషన్‌ను, కసిని ముంబైతో మ్యాచ్‌లో చూపించాడు. హార్దిక్ జట్టును ఎలాగైనా ఓడించాలని ఫిక్స్ అయ్యాడు నెహ్రా. పాండ్యా కెప్టెన్సీ వల్ల కాదు, తన కోచింగ్ వల్లే జీటీ ఇన్నాళ్లూ నెగ్గుకుంటూ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలియజేయాలని అనుకున్నాడు. ఎంఐతో మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నెహ్రా.. లాస్ట్ బాల్ పూర్తయ్యే వరకు బౌండరీ లైన్ బయటే నిలబడ్డాడు. ఎప్పటికప్పుడు కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు బౌలర్లకు అవసరమైన సూచనలు ఇచ్చాడు. ఈజీగా నెగ్గాల్సిన ముంబైని ఓడించి పాండ్యాకు గట్టిగా బుద్ధి చెప్పాడు నెహ్రా. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కెప్టెన్సీలో హార్దిక్ జీరో అని నెహ్రా ప్రూవ్ చేశాడని అంటున్నారు. పాండ్యాకు ఏదీ చేతకాదని.. ఓవరాక్షన్ చేయడం తప్ప అని కామెంట్స్ చేస్తున్నారు. అటు రోహిత్, ఇటు నెహ్రాతో ఫైట్‌లో అతడు ఓడిపోయాడని.. బ్యాటర్‌గా, బౌలర్‌గా, కెప్టెన్‌గానూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని చెబుతున్నారు. మరి.. హార్దిక్-నెహ్రా ఫైట్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MI vs GT: పాండ్యాను తిడుతున్నవారు ఇది తెలుసుకోండి! అతని తప్పు లేదు!
We thought it was Hardik Pandya’s captaincy that was working well for Gujarat in the first two seasons when it was just Ashish Nehra with a coconut in his hand pic.twitter.com/iBeY8MoVff
— Daksh (@82MCG_) March 24, 2024
One thing that people has realized is it was Nehra’s coaching who was winning matches to GT not Pandya’s captaincy pic.twitter.com/5pJb2qqhxE
— Aryan 🇮🇳 (@Iconic_Hitman) March 25, 2024