iDreamPost
android-app
ios-app

మయాంక్ వెనుక అదృశ్య శక్తి.. శిష్యుడి సక్సెస్​తో గురువు హ్యాపీ!

  • Published Apr 03, 2024 | 12:34 PM Updated Updated Apr 03, 2024 | 5:09 PM

లక్నో ఎక్స్​ప్రెస్ మయాంక్ యాదవ్ ఓవర్​నైట్ స్టార్ అయిపోయాడు. రెండు మ్యాచులతోనే అందరి నోళ్లలోనూ అతడి పేరు నానుతోంది. అయితే మయాంక్ వెనుక ఓ అదృశ్య శక్తి ఉందనేది ఎవరికీ తెలియదు.

లక్నో ఎక్స్​ప్రెస్ మయాంక్ యాదవ్ ఓవర్​నైట్ స్టార్ అయిపోయాడు. రెండు మ్యాచులతోనే అందరి నోళ్లలోనూ అతడి పేరు నానుతోంది. అయితే మయాంక్ వెనుక ఓ అదృశ్య శక్తి ఉందనేది ఎవరికీ తెలియదు.

  • Published Apr 03, 2024 | 12:34 PMUpdated Apr 03, 2024 | 5:09 PM
మయాంక్ వెనుక అదృశ్య శక్తి.. శిష్యుడి సక్సెస్​తో గురువు హ్యాపీ!

ఐపీఎల్​లో ఆడితే చాలని ఎంతో మంది కుర్ర క్రికెటర్లు కోరుకుంటారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలు ప్రూవ్ చేసుకోవాలని ఎదురు చూస్తుంటారు. అయితే అవకాశాలు వచ్చినా వాటిని అందిపుచ్చుకొని రాణించిన వారు తక్కువే. తీవ్ర పోటీ ఉండే క్యాష్ రిచ్ లీగ్​లో పెర్ఫార్మ్ చేయడం అంత ఈజీ కాదు. టాలెంట్ ఉన్నా ప్రెజర్​ను తట్టుకుంటూ రాణించడం అంటే మాటలు కాదు. కానీ అది నీళ్లు తాగినంత ఈజీ అని నిరూపించాడో క్రికెటర్. అతడే మయాంక్ యాదవ్‌. మనలో సత్తా ఉంటే ప్రపంచం దాసోహం అనాల్సిందే అనేలా అద్భుతమైన ఆటతీరుతో అందరి ఫోకస్​ను తన వైపునకు తిప్పుకున్నాడు మయాంక్. బుల్లెట్ స్పీడ్​తో బంతులు వేస్తూ బ్యాటర్లకు కునుకు లేకుండా చేస్తున్నాడు. అయితే ఓవర్​నైట్ స్టార్​గా మారిపోయిన మయాంక్ వెనుక ఓ అదృశ్య శక్తి ఉందని చాలా మందికి తెలియదు.

మయాంక్ యాదవ్ రెండు మ్యాచులతో స్టార్ అయిపోయాడు. అతడి బౌలింగ్ వీడియోలను ఒకటే పనిగా చూస్తున్నారు ఆడియెన్స్. మయాంక్ కోసమైనా లక్నో మ్యాచులు చూడాలని అనుకుంటున్నారు. త్వరలో అతడు భారత జట్టులోకి రావాలని కోరుకుంటున్నారు. అవకాశం వస్తే మయాంక్​తో సెల్ఫీలు దిగాలని, అతడి ఆటోగ్రాఫ్​ తీసుకోవాలని ఎదురు చూస్తున్న వారికి లెక్కే లేదు. అయితే రెండు మ్యాచుల్లో సూపర్బ్​గా బౌలింగ్ చేయడంతోనే మయాంక్ అంటే ఏంటో అందరికీ తెలిసొచ్చింది. కానీ అతడిలోని టాలెంట్​ను ఏడాది కిందే పసిగట్టాడు సౌతాఫ్రికా లెజెండ్ మోర్నీ మోర్కెల్. లక్నో సూపర్ జియాంట్స్​కు బౌలింగ్​ కోచ్​గా సేవలు అందిస్తున్న ఆయన.. మయాంక్​ను గుర్తించి టీమ్​లోకి తీసుకొచ్చాడు. ఏడాది కాలం నుంచి అతడ్ని సానబెడుతున్నాడు మోర్కెల్. లక్నో ఎక్స్​ప్రెస్ సక్సెస్​లో ఆయన పాత్ర ఎంతగానో ఉంది.

భీకరమైన వేగంతో బంతులు సంధించే సత్తా మయాంక్ సొంతం. కానీ లైన్ అండ్ లెంగ్త్ విషయంలో అతడు మరింత మెరుగుపడాలని మోర్కెల్ భావించాడు. అందుకే నిరంతరం ప్రాక్టీస్ చేయించాడు. మయాంక్ అంత వేగంతోనూ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్​లో బంతులు వేస్తున్నాడంటే దానికి మోర్కెల్ ఇచ్చిన ట్రెయినింగే కారణం. ఎలాంటి సిచ్యువేషన్​లో అయినా బేసిక్స్​కు కట్టుబడి, తన బలాన్ని నమ్ముకొని ఎలా బౌలింగ్ చేయాలో నేర్పించాడు మోర్కెల్. అందుకే వైడ్లు, నో బాల్స్ లేకుండా క్రమశిక్షణతో బంతులు సంధిస్తున్నాడు మయాంక్​. ఆయన ఇచ్చిన శిక్షణ వల్లే డెడ్లీ బౌన్సర్లతో బ్యాటర్లను పోయిస్తున్నాడు. మయాంక్ వెనుక కనిపించని శక్తిగా ఉన్న మోర్కెల్.. శిష్యుడి సక్సెస్​పై ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. కాగా, గత సీజన్​లోనే మయాంక్ ఐపీఎల్​లో ఎంట్రీ ఇవ్వాల్సింది. అయితే గాయం కారణంగా అతడు దూరమయ్యాడు. అయినా అతడ్ని వదలకుండా టీమ్​కు ప్రధాన ఆయుధంగా తయారు చేస్తూ వచ్చాడు మోర్కెల్. మరి.. మయాంక్​ను మోర్కెల్ వెనుక నుంచి నడిపించడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IPL సంచలనం మయాంక్‌ యాదవ్‌ లైఫ్ స్టోరీ! ఆకలితో ఎదిగిన ఒక స్పీడ్ స్టార్ కథ!