LSG vs KKR: వీడియో: ఈ కుర్రాడు చేసిన పనికి జాంటీ రోడ్స్ సహా అందరూ ఫిదా!

కేకేఆర్-ఎల్​ఎస్​జీ మ్యాచ్​లో ఓ బాల్ బాయ్ అందరి అటెన్షన్​ను తన వైపునకు తిప్పుకున్నాడు. అతడు చేసిన పనికి ఫీల్డింగ్ గ్రేట్ జాంటీ రోడ్స్ సహా అందరూ ఫిదా అయ్యారు.

కేకేఆర్-ఎల్​ఎస్​జీ మ్యాచ్​లో ఓ బాల్ బాయ్ అందరి అటెన్షన్​ను తన వైపునకు తిప్పుకున్నాడు. అతడు చేసిన పనికి ఫీల్డింగ్ గ్రేట్ జాంటీ రోడ్స్ సహా అందరూ ఫిదా అయ్యారు.

ఐపీఎల్-2024లో కోల్​కతా నైట్ రైడర్స్​ హవా నడుస్తోంది. బ్రేకుల్లేని బుల్డోజర్​లా ఎదురొచ్చిన ప్రతి జట్టును పడగొడుతూ పోతోంది అయ్యర్ సేన. నిన్న లక్నో సూపర్ జియాంట్స్​ను కూడా ఇలాగే చిత్తు చేసింది. ఆ జట్టుతో జరిగిన మ్యాచ్​లో ఏకంగా 98 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన కేకేఆర్ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాహుల్ సేన.. 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్​లో టాప్ ప్లేస్​కు చేరుకుంది కేకేఆర్. అయితే ఈ మ్యాచ్​లో ఓ బాల్ బాయ్ చేసిన పని వైరల్ అవుతోంది.

ఎల్​ఎస్​జీ-కేకేఆర్ మ్యాచ్​లో ఓ బాల్ బాయ్ అందరి అటెన్షన్​ను తన వైపునకు తిప్పుకున్నాడు. అతడు చేసిన పనికి ఫీల్డింగ్ గ్రేట్ జాంటీ రోడ్స్ సహా అందరూ ఫిదా అయ్యారు. లక్నో ఇన్నింగ్స్ సమయంలో హర్షిత్ రాణా ఓవర్​లో మార్కస్ స్టొయినిస్ కళ్లుచెదిరే రీతిలో ఓ సిక్స్ కొట్టాడు. ఆఫ్ స్టంప్​కు బయటపడిన బౌన్సర్​ను అద్భుతమైన రీతిలో సిక్సర్​గా మలిచాడు స్టొయినిస్. అయితే ఆ బాల్ వెళ్తున్న దిశలో ఏ ఫీల్డర్ కూడా లేడు. దీంతో గ్రౌండ్​కు బయట ఉన్న బాల్ బాయ్ దాన్ని గమనించాడు. క్యాచ్ పట్టాలని ఫిక్స్ అయ్యాడు. బాల్ వస్తున్న వేగం, దిశను బట్టి తన శరీరాన్ని కిందకు వంచి క్యాచ్​ను అందుకున్నాడు. క్యాచ్ పట్టిన తర్వాత దాని వంకే చూస్తూ మురిసిపోయాడు.

బాల్ బాయ్ క్యాచ్ అందుకున్న తీరుకు లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ఫిదా అయ్యాడు. ఆ కుర్రాడి వంక చూస్తూ చప్పట్లు కొట్టాడు. శభాష్​.. సూపర్ క్యాచ్ అంటూ అతడ్ని మెచ్చుకున్నాడు. రోడ్స్​తో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు, కామెంటేటర్స్ కూడా బాల్ బాయ్ ఎఫర్ట్​ను ప్రశంసించారు. ఇక, ఈ మ్యాచ్​లో కోల్​కతా ఆల్​రౌండ్​గా అన్ని విభాగాల్లోనూ దుమ్మురేపింది. బ్యాటింగ్​లో ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 32), సునీల్ నరైన్ (39 బంతుల్లో 81), అంగ్క్రిష్ రఘువంశీ (26 బంతుల్లో 32) అదరగొట్టారు. బౌలింగ్​లో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లతో ప్రత్యర్థి వెన్ను విరిచారు. అయితే 81 పరుగులు చేయడమే గాక బౌలింగ్​లోనూ 1 వికెట్​తో అలరించిన నరైన్​ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. మరి.. బాల్ బాయ్ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments