Nidhan
లక్నో సూపర్ జియాంట్స్ ఓనర్‌పై కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్ సెటైర్స్ వేశాడు. ఓ రేంజ్లో ఇచ్చిపడేశాడు గౌతీ. ఆయన్ను చూసి నేర్చుకోమని సూచించాడు.
లక్నో సూపర్ జియాంట్స్ ఓనర్‌పై కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్ సెటైర్స్ వేశాడు. ఓ రేంజ్లో ఇచ్చిపడేశాడు గౌతీ. ఆయన్ను చూసి నేర్చుకోమని సూచించాడు.
Nidhan
ఐపీఎల్ లాంటి లీగ్స్‌లో కెప్టెన్‌గా ఉండటం అంత ఈజీ కాదు. తీవ్రమైన పోటీ, ఒత్తిడి మధ్య జట్టును నడిపించడం ఎంతటోడికైనా కష్టమే. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో కూడుకున్న కెప్టెన్సీ రోల్లో రాణించాలన్నా, టీమ్‌కు విజయాలు అందించాలన్నా, కప్పులు కొట్టాలన్నా టీమ్ మేనేజ్మెంట్, ఫ్రాంచైజీ యాజమాన్యం నుంచి ఎంతో సపోర్ట్ ఉండాలి. అప్పుడు గానీ సారథిగా సక్సెస్ కాలేరు. దీన్ని బట్టి జట్టు రాణింపులో కెప్టెన్‌తో పాటు యాజమాన్యం రోల్ ఎంత కీలకమో అర్థమై ఉంటుంది. కానీ కేఎల్ రాహుల్ విషయంలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఇలా వ్యవహరించలేదు. టీమ్ ఓటమికి రాహుల్‌ను టార్గెట్ చేసుకొని అందరి ముందే సీరియస్ అయ్యాడు. రాహుల్ ఎంత వివరిస్తున్నా వినకుండా విరుచుకుపడ్డాడు.
కేఎల్ రాహుల్ మీద లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా సీరియస్ అవడం, అసహనం వెళ్లగక్కడం వైరల్‌గా మారింది. స్టార్ ప్లేయర్, భారత జట్టు సభ్యుడు, టీమ్ కెప్టెన్ అయిన రాహుల్‌తో వేలాది మంది ఆడియెన్స్ నడుమ గ్రౌండ్లో ఇలా వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది. ఇది కరెక్ట్ కాదంటూ అందరూ ఎల్ఎస్జీ యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. ఈ అంశం మీద తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ స్పందించాడు. లక్నో ఓనర్‌పై గౌతీ సెటైర్స్ వేశాడు. అసలైన యజమాని ఎలా ఉండాలో కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు. తాను చూసిన, పని చేసిన ఓనర్స్‌లో కింగ్ ఖాన్ బెస్ట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు గంభీర్.
‘నేను పని చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్‌లో షారుఖ్ ఖాన్ అందరి కంటే బెస్ట్. కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌కు సంబంధించిన క్రికెటింగ్ వ్యవహారాల్లో ఆయన తలదూర్చడు. ఆయన నన్ను బాగా నమ్ముతాడు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతుగా నిలుస్తాడు’ అని గంభీర్ స్పష్టం చేశాడు. టీమ్ ఓనర్ ఎలా ఉండాలనే దానిపై గౌతీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గంభీర్ చేసిన కామెంట్స్ లక్నో ఓనర్స్‌ను ఉద్దేశించి అన్నట్లుగా నెట్టింట అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సంజీవ్ గోయెంకాకు గౌతీ ఇన్‌డైరెక్ట్‌గా చురకలు అంటించాడని అంటున్నారు. కాగా, లాస్ట్ సీజన్ వరకు గంభీర్ ఎల్ఎస్జీకి మెంటార్‌గా ఉన్నాడు. ఈసారి షారుఖ్ ఆహ్వానించడంతో కేకేఆర్‌కు మారాడు. మరి.. గంభీర్ సెటైర్స్పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Gautam Gambhir said, “Shah Rukh Khan is the best owner I’ve ever worked with. He never interferes in cricketing matters in the KKR team. He trusts me and backs my decisions”. (SportsKeeda). pic.twitter.com/CL0MXhHIxc
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024