iDreamPost
android-app
ios-app

KKRని వణికించిన భువనేశ్వర్.. పవర్ ప్లేలో ముప్పతిప్పలు పెట్టేశాడు..

KKR vs SRH- Bhuvaneswar Kumar: ఐపీఎల్ 2024లో కేకేఆర్ జట్టు విజృంభించింది. పవర్ ప్లేలో మాత్రం భువనేశ్వర్ కుమార్ కేకేఆర్ కు కళ్లెం వేశాడు. పవర్ ప్లేలో భువీ స్పెల్ చూస్తే ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

KKR vs SRH- Bhuvaneswar Kumar: ఐపీఎల్ 2024లో కేకేఆర్ జట్టు విజృంభించింది. పవర్ ప్లేలో మాత్రం భువనేశ్వర్ కుమార్ కేకేఆర్ కు కళ్లెం వేశాడు. పవర్ ప్లేలో భువీ స్పెల్ చూస్తే ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

KKRని వణికించిన భువనేశ్వర్.. పవర్ ప్లేలో ముప్పతిప్పలు పెట్టేశాడు..

ధనాధన్ లీగ్ మజా మొదలైపోయింది. ఇప్పటికే రెండు మ్యాచులు పూర్తై పోయాయి. ప్రతి మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను అందిస్తూ సాగాయి. మూడో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్- కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు మొదటి నుంచి కేకేఆర్ ని ఇబ్బంది పెడుతూ వచ్చింది. ముఖ్యంగా పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ తన బంతుల్లో ఇంకా పదును తగ్గలేదని నిరూపించాడు. కేకేఆర్ కు ఏమాత్రం అవకాశం లేకుండా భువీ వేసిన స్పెల్ ఇప్పుడు అందరి నుంచి ప్రశంసలు దక్కేలా చేస్తోంది. ప్రస్తుతం అందరూ భువీ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అసలే హోమ్ గ్రౌండ్, ఫుల్ ఫ్యాన్ సపోర్ట్ ఉంది. కేకేఆర్ మొదటి నుంచి హైదరాబాద్ మీద ఒత్తిడి పెంచాలనే చూసింది. కానీ, పవర్ ప్లేలో మొదటి బంతి నుంచి భువనేశ్వర్ కుమార్ కేకేఆర్ ని కట్టడి చేశాడు. కేకేఆర్ బ్యాటర్లకు ఎక్కడా ఆస్కారం లేకుండా చేశాడు. చాలామంది భువనేశ్వర్ గురించి తక్కువ అంచనా వేసేవాళ్లు, భువీ పని అయిపోయింది అనుకునే వాళ్లకు ఈ 2 ఓవర్లు ఒక బెస్ట్ ఉదాహరణ అని చెప్పాలి. ఎందుకంటే పవర్ ప్లేలో భువనేశ్వర్ వేసిన స్పెల్ అలాంటిది మరి. మొదటి ఓవర్లో భువనేశ్వర్ కుమార్.. 1, వైడ్, 0, 0, 1, 0, 0 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ లో 3వ ఓవర్ వేశాడు. 1, 0, 0, 1, 0, 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సాధారణంగా ధనా ధన్ లీగ్ అంటే తొలి బంతి నుంచి దూకుడుగా ఆడతారు. కానీ, కేకేఆర్ దూకుడుకు భువీ పవర్ ప్లేలో కళ్లెం వేశాడు.

కానీ, ఆ తర్వాత మాత్రం కేకేఆర్ ని ఆపే పరిస్థితి కనిపించలేదు. కాసేపు స్కోర్ బోర్డ్ కంట్రోల్ లోనే ఉంది అనుకున్నారు అందరూ. నరైన్ నుంచి నితిష్ రానా వరకు ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన రమన్ దీప్ సింగ్(35), రింకూ సింగ్(23), రస్సెల్() మాత్రం హైదరాబాద్ బౌలర్లకు పీడకలలా మారిపోయారు. ఎవరూ వీళ్లని కట్టడి చేయలేకపోయారు. ఆఖరికి భువనేశ్వర్ కూడా రస్సెల్, రింకూలని నిలువరించలేకపోయాడు. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 51 పరుగులు ఇచ్చాడు. వాటిలో 2 వైడ్లు, ఒక నోబాల్ కూడా ఉంది. మొత్తానికి కేకేఆర్ బ్యాటర్లు 150లోపే ఆలౌట్ అవుతారు అనుకునే పరిస్థితి నుంచి స్కోర్ బోర్డుని 208కి చేర్చారు. మొత్తానికి కోల్ కతా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే హైదరాబాద్ జట్టు కచ్చితంగా తొలి బంతి నుంచే బౌండిరీలు బాదాల్సి ఉంటుంది. రస్సెల్ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.