Nidhan
కోల్‌కతా నైట్ రైడర్స్ బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకెళ్తోంది. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్కు చేరుకుంది. ఈసారి ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు చేరిన ఫస్ట్ టీమ్‌గా నిలిచింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకెళ్తోంది. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్కు చేరుకుంది. ఈసారి ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు చేరిన ఫస్ట్ టీమ్‌గా నిలిచింది.
Nidhan
ఒక్క సీజన్ గ్యాప్‌లో ఎంత మార్పు. కప్పు కొట్టడం పక్కనబెడితే ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేక తీవ్రంగా ఇబ్బందులు పడిందా జట్టు. పాయింట్స్ టేబుల్లో దిగువన ఉన్న టీమ్స్‌తో పోటీపడుతూ పరువు పోగొట్టుకుంది. అభిమానుల ఆశల్ని నిలబెట్టుకోవడంలో టోటల్ ఫెయిలైంది. అలాంటిది సీజన్ గ్యాప్‌లో ఊహించని విధంగా ఆడుతూ ఈ ఏడాది ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్‌గా నిలిచింది. అదే కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ సీజన్లో కేకేఆర్ బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకెళ్తోంది. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్కు చేరుకుంది. ఈసారి ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు చేరిన ఫస్ట్ టీమ్‌గా నిలిచింది. ఇంత కసిగా ఆడటానికి సీజన్ సెకండాఫ్‌లో ఎదురైన ఓ ఓటమే కారణమని ఆ టీమ్ బ్యాటర్ నితీష్ రాణా అంటున్నాడు.
ఈ సీజన్ సెకండాఫ్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 8 వికెట్ల భారీ తేడాతో చిత్తయింది కేకేఆర్. టాప్ టీమ్స్‌ను కూడా చిత్తు చేస్తూ సాగిపోయిన అయ్యర్ సేన.. పంజాబ్ ముందు మోకరిల్లింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ సంధించిన 261 పరుగుల స్కోరును ఇంకో 8 బంతులు ఉండగానే పంజాబ్ ఛేజ్ చేసేసింది. జానీ బెయిర్‌స్టో (108 నాటౌట్), శశాంక్ సింగ్ (68 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో మెరిశారు. అంత భారీ స్కోరు బాదినా ఓడిపోవడంతో కేకేఆర్ ఆటగాళ్లు నిరాశలో కూరుకుపోయారట. ఈ ఓటమిని తట్టుకోలేక టీమ్‌లోని చాలా మంది ప్లేయర్లు భోజనం కూడా చేయలేదట. దీంతో పాటు ఈ సీజన్లో కేకేఆర్ జర్నీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు ఆ టీమ్ బ్యాటర్ నితీష్ రాణా.
‘పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓటమిని మేం జీర్ణించుకోలేకపోయాం. ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ కూడా చాలా బాధపడ్డారు. గెలవాల్సిన మ్యాచ్‌లో దారుణ ఓటమితో అందరూ నిరాశలో కూరుకుపోయారు. మ్యాచ్ తర్వాత ఆటగాళ్లు ఎవరూ ముద్ద కూడా ముట్టలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వారిలో ముగ్గురు, నలుగురు మాత్రమే డిన్నర్ చేశారు. మా టీమ్‌లో అలాంటి వాతావరణం ఉంది. మేం ఓడినా, గెలిచినా ఒకే జట్టుగా కలసిమెలసి ఉంటాం. గెలుపోటములను అందరం ఒకేలా తీసుకుంటాం. కోచ్ చంద్రశేఖర్ పండిట్, మెంటార్ గౌతం గంభీర్ కలసి గెలవగలమనే నమ్మకాన్ని, కసిని కేకేఆర్ గ్రూప్‌లో తీసుకొచ్చారు’ అని నితీష్ రాణా చెప్పుకొచ్చాడు. మరి.. ఈ సీజన్లో కేకేఆర్ ఆడుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Nitish Rana said, “we felt really bad after the losing against PBKS. I witnessed that only 3-4 people in the dressing room had dinner after that defeat. We have that environment in our team that we’ll win as a team and we’ll lose as a team”. pic.twitter.com/i1Bs4tTXrm
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2024