iDreamPost

ఆ ఓటమి తర్వాత ఆటగాళ్లు ముద్ద కూడా ముట్టలేదు.. నితీష్​ రాణా కామెంట్స్!

  • Published May 12, 2024 | 12:10 PMUpdated May 12, 2024 | 12:10 PM

కోల్​కతా నైట్ రైడర్స్ బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తోంది. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్​లో టాప్​కు చేరుకుంది. ఈసారి ఐపీఎల్​లో ప్లేఆఫ్స్​కు చేరిన ఫస్ట్ టీమ్​గా నిలిచింది.

కోల్​కతా నైట్ రైడర్స్ బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తోంది. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్​లో టాప్​కు చేరుకుంది. ఈసారి ఐపీఎల్​లో ప్లేఆఫ్స్​కు చేరిన ఫస్ట్ టీమ్​గా నిలిచింది.

  • Published May 12, 2024 | 12:10 PMUpdated May 12, 2024 | 12:10 PM
ఆ ఓటమి తర్వాత ఆటగాళ్లు ముద్ద కూడా ముట్టలేదు.. నితీష్​ రాణా కామెంట్స్!

ఒక్క సీజన్​ గ్యాప్​లో ఎంత మార్పు. కప్పు కొట్టడం పక్కనబెడితే ప్లేఆఫ్స్​కు కూడా చేరలేక తీవ్రంగా ఇబ్బందులు పడిందా జట్టు. పాయింట్స్ టేబుల్​లో దిగువన ఉన్న టీమ్స్​తో పోటీపడుతూ పరువు పోగొట్టుకుంది. అభిమానుల ఆశల్ని నిలబెట్టుకోవడంలో టోటల్ ఫెయిలైంది. అలాంటిది సీజన్ గ్యాప్​లో ఊహించని విధంగా ఆడుతూ ఈ ఏడాది ఐపీఎల్​లో ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్​గా నిలిచింది. అదే కోల్​కతా నైట్ రైడర్స్. ఈ సీజన్​లో కేకేఆర్ బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తోంది. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్​లో టాప్​కు చేరుకుంది. ఈసారి ఐపీఎల్​లో ప్లేఆఫ్స్​కు చేరిన ఫస్ట్ టీమ్​గా నిలిచింది. ఇంత కసిగా ఆడటానికి సీజన్ సెకండాఫ్​లో ఎదురైన ఓ ఓటమే కారణమని ఆ టీమ్ బ్యాటర్ నితీష్ రాణా అంటున్నాడు.

ఈ సీజన్ సెకండాఫ్​లో పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో 8 వికెట్ల భారీ తేడాతో చిత్తయింది కేకేఆర్. టాప్ టీమ్స్​ను కూడా చిత్తు చేస్తూ సాగిపోయిన అయ్యర్ సేన.. పంజాబ్​ ముందు మోకరిల్లింది. ఈ మ్యాచ్​లో కేకేఆర్ సంధించిన 261 పరుగుల స్కోరును ఇంకో 8 బంతులు ఉండగానే పంజాబ్ ఛేజ్ చేసేసింది. జానీ బెయిర్​స్టో (108 నాటౌట్), శశాంక్ సింగ్ (68 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్​లతో మెరిశారు. అంత భారీ స్కోరు బాదినా ఓడిపోవడంతో కేకేఆర్ ఆటగాళ్లు నిరాశలో కూరుకుపోయారట. ఈ ఓటమిని తట్టుకోలేక టీమ్​లోని చాలా మంది ప్లేయర్లు భోజనం కూడా చేయలేదట. దీంతో పాటు ఈ సీజన్​లో కేకేఆర్ జర్నీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు ఆ టీమ్ బ్యాటర్ నితీష్​ రాణా.

‘పంజాబ్ కింగ్స్​ చేతుల్లో ఓటమిని మేం జీర్ణించుకోలేకపోయాం. ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ కూడా చాలా బాధపడ్డారు. గెలవాల్సిన మ్యాచ్​లో దారుణ ఓటమితో అందరూ నిరాశలో కూరుకుపోయారు. మ్యాచ్ తర్వాత ఆటగాళ్లు ఎవరూ ముద్ద కూడా ముట్టలేదు. డ్రెస్సింగ్ రూమ్​లో ఉన్న వారిలో ముగ్గురు, నలుగురు మాత్రమే డిన్నర్​ చేశారు. మా టీమ్​లో అలాంటి వాతావరణం ఉంది. మేం ఓడినా, గెలిచినా ఒకే జట్టుగా కలసిమెలసి ఉంటాం. గెలుపోటములను అందరం ఒకేలా తీసుకుంటాం. కోచ్ చంద్రశేఖర్ పండిట్, మెంటార్ గౌతం గంభీర్ కలసి గెలవగలమనే నమ్మకాన్ని, కసిని కేకేఆర్ గ్రూప్​లో తీసుకొచ్చారు’ అని నితీష్​ రాణా చెప్పుకొచ్చాడు. మరి.. ఈ సీజన్​లో కేకేఆర్ ఆడుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి