iDreamPost

Gautam Gambhir: గంభీర్​కు ఫ్యాన్ స్వీట్ వార్నింగ్.. తన ప్రేమను నిలబెట్టమంటూ..!

  • Published May 15, 2024 | 3:35 PMUpdated May 15, 2024 | 3:35 PM

కోల్​కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్​కు ఓ లేడీ ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. తన ప్రేమను నిలబెట్టమని కోరింది.

కోల్​కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్​కు ఓ లేడీ ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. తన ప్రేమను నిలబెట్టమని కోరింది.

  • Published May 15, 2024 | 3:35 PMUpdated May 15, 2024 | 3:35 PM
Gautam Gambhir: గంభీర్​కు ఫ్యాన్ స్వీట్ వార్నింగ్.. తన ప్రేమను నిలబెట్టమంటూ..!

గౌతం గంభీర్.. ఈ పేరు చెప్పగానే అందరికీ అతడి అద్భుతమైన బ్యాటింగ్ గుర్తుకొస్తుంది. టీమిండియా వన్డే వరల్డ్ కప్-2011ను కైవసం చేసుకోవడంలో అతడిది కీలక పాత్ర. మెగా టోర్నీ అనే కాదు.. ఎన్నో సిరీస్​ల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాలను అందించాడు గంభీర్. ఇంటర్నేషనల్ క్రికెట్​తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్​లోనూ సక్సెస్ అయ్యాడు. కెప్టెన్​గా ఉంటూ కోల్​కతా నైట్ రైడర్స్​కు టైటిల్​ను అందించాడు. అలాంటోడు క్రికెట్​కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత పాలిటిక్స్​లో బిజీ అయిపోయాడు. కొద్ది గ్యాప్ తర్వాత ఐపీఎల్​లో లక్నో సూపర్ జియాంట్స్​కు మెంటార్​గా పని చేశాడు. ఈ సీజన్​లో కేకేఆర్​కు మెంటార్​గా వచ్చి ఆ టీమ్ రాత మార్చేశాడు. ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా కోల్​కతా నిలిచింది.

కేకేఆర్ వరుస విజయాలతో గంభీర్ సంతోషంగా ఉన్నాడు. అతడి ఫ్యాన్స్ కూడా గౌతీ అంటే ఇదీ అని అంటున్నారు. తమ ఫేవరెట్ క్రికెటర్ సక్సెస్​ను చూసి మురిసిపోతున్నారు. అయితే ఓ లేడీ ఫ్యాన్ మాత్రం గంభీర్​కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. తన ప్రేమను నిలబెట్టమంటూ అతడ్ని అభ్యర్థించింది. ఐపీఎల్​లోని ఓ మ్యాచ్​కు అటెండ్ అయిన ఒక మహిళా అభిమాని తన చేతుల్లో ప్లకార్డ్​ను పట్టుకొని కనిపించింది. దీని మీద గౌతీ సీరియస్​గా ఉన్న ఫొటో ఉంది. ‘గంభీర్ నవ్వేంత వరకు నేను ఇష్టపడిన అబ్బాయికి ప్రపోజ్ చేయను’ అని దాని మీద రాసి ఉంది. మ్యాచ్ టైమ్​లో కెమెరామెన్ దీన్ని పట్టేడయంతో ఈ లేడీ ఫ్యాన్ ఫొటో కాస్తా నెట్టింట వైరల్​గా మారింది.

లేడీ ఫ్యాన్ రిక్వెస్ట్ ఆ నోటా ఈ నోటా పడి చివరకు గంభీర్ చెవికి చేరింది. దీంతో సోషల్ మీడియాలో దీనికి రిప్లయ్ ఇచ్చాడు గౌతీ. ఆమె పోస్ట్​కు తాను నవ్వుతున్న ఓ ఫొటోను అతడు సమాధానంగా పంపాడు. లేడీ ఫ్యాన్ రిక్వెస్ట్​కు గంభీర్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అభిమానులకు అతడు విలువ ఇస్తాడని.. దీనికి ఇదే ఎగ్జాంపుల్ అని గౌతీ ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే, గత సీజన్లలో కంటే ఈసారి కేకేఆర్ కొత్తగా కనిపిస్తోంది. నరైన్​ను ఓపెనర్​గా దించడంతో పాటు హర్షిత్ రాణా వంటి యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా టీమ్​ను విజయాల బాట పట్టించాడు గౌతీ. ఇప్పుడు జట్టు నిండా ఆల్​రౌండర్లు ఉండటం, వాళ్లందరూ తోపు ఫామ్​లో ఉండటంతో కేకేఆర్​ అన్​స్టాపబుల్​గా కనిపిస్తోంది. ఆ టీమ్ ఇలాగే ఆడితే ఈసారి టైటిల్ వాళ్లదేనని నెటిజన్స్ అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి