Tirupathi Rao
SRH vs PBKS- Unadkat: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలిపించినా కూడా ఉనద్కట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ మ్యాచ్ లో ఉనద్కట్ హీరో అని తెలుసుకోండి.
SRH vs PBKS- Unadkat: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలిపించినా కూడా ఉనద్కట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ మ్యాచ్ లో ఉనద్కట్ హీరో అని తెలుసుకోండి.
Tirupathi Rao
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతూనే ఉంది. ఉగాది రోజు పంజాబ్ కింగ్స్ పై హైదరాబాద్ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కేవలం రెండే రెండు పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అనూహ్య విజయాన్ని తెలుగు ఫ్యాన్స్ కి అందించింది. ఈ మ్యాచ్ లో చాలానే అద్భుతాలు జరిగాయి. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తన బ్యాట్ తో మ్యాచ్ మొత్తాన్ని తిప్పేశాడు. ఉగాది రోజు తెలుగు ప్రజలకు నితీశ్ ఒక మంచి విజయాన్ని బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్ వల్ల ఉనద్కట్ తెలుగు ఫ్యాన్స్ ముందు విలన్ గా మారాడు. కానీ, నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ మీద విజయం సాధించింది అంటే అందుకు ఉనద్కట్ కూడా కారణం అని తెలుసా?
సన్ రైజర్స్ హైదరాబాద్ – పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ నిజంగా ప్రతి ఫ్యాన్ ని కుర్చీ అంచుకు తీసుకొచ్చేసింది. ఈ మ్యాచ్ లో అసలు హైదరాబాద్ జట్టు గెలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. నిజానికి హైదరాబాద్ జట్టు కూడా ఒక్క క్షణం ఈ విజయాన్ని నమ్మలేకపోయింది. ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ వరకు అందరూ హైదరాబాద్ జట్టుదే విజయం అనుకున్నారు. కానీ, ఆఖరి ఓవర్ జరుగుతున్నప్పుడు ఆ ఆశలు వదులుకున్నారు. ఎందుకంటే ఉనద్కట్ ఓవర్ అంత దారుణంగా నడిచింది. అప్పటికే సిక్సులు పడుతుంటే వాటికి అదనంగా ఉనద్కట్ వైడ్లు కూడా వేశాడు. ఒకే ఓవర్లో 3 సిక్సులు పడ్డాయి. ఉనాద్కట్ వాటికి అదనంగా 3 వైడ్లు కూడా వేశాడు.
మొత్తానికి ఆఖరి ఓవర్ కి 29 పరుగులు కావాల్సి ఉండగా.. ఉనద్కట్ ఏకంగా 26 పరుగులు ఇచ్చేసి ఓటమి అంచుల దాకా తీసుకెళ్లాడు. ఆ ఓవర్ తో హైదరాబాద్ ఫ్యాన్స్ అందరికీ ఉనద్కట్ మాత్రం విలన్ అయ్యాడు. మ్యాచ్ అయినప్పటి నుంచి గెలిచామనే సంగతి పక్కన పెట్టేసి ఉనద్కట్ ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఉనద్కట్ కి డెత్ ఓవర్స్ ఇవ్వదంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. అయితే ఉనద్కట్ వల్లే హైదరాబాద్ జట్టు ఈ విజయం నమోదు చేయగలిగింది. ఈ విజయంలో అతను బౌలింగ్ తోనే కాకుండా.. బ్యాటింగ్ తో కూడా తన వంతు కృషి జట్టు కోసం చేశాడు.
ఆఖరి ఓవర్ కి 29 పరుగులు కొట్టాలంటే భువనేశ్వర్, కమ్మిన్స్ బౌలింగ్ చేసినా కూడా సిక్సులు కొడతారు. అతని బౌలింగ్ లో మూడు బంతులు సిక్సులు పోతే.. మిగిలిన 3 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగారు. అంటే అతను అద్భుతంగా బౌలింగ్ చేసినట్లే. ఇంక బౌలింగ్ సంగతి పక్కన పెడితే ఉనద్కట్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ తో జట్టును గెలిపిచాడు. అతను ఎదుర్కొన్న ఒకే ఒక్క బాల్ ని సిక్సర్ గా మలిచాడు. అదే సిక్స్ గనుక లేకుపోయుంటే.. హైదరాబాద్ కి ఈ విజయం దక్కేది కాదేమో? అందుకే గెలిపించిన ఉనద్కట్ ని తిట్టడం ఆపేయండి. అతని వల్లే హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఆ విషయాన్ని టీమ్ కోచ్ అయితే ఒప్పుకున్నారు. అందరి ముందు నీ సిక్స్ వల్లే గెలిచా అంటూ ప్రశంసలు కురిపించారు. మరి.. ఉనద్కట్ మీ దృష్టిలో హీరోనా విలనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Post win reactions, awards & more! ✨
Joyous vibes only from the Risers dressing room 🧡 pic.twitter.com/VZgCB6aLqT
— SunRisers Hyderabad (@SunRisers) April 10, 2024