IPL రిటెన్షన్ పై ఫ్రాంచైజీల అసంతృప్తి.. ముగ్గురు సరిపోరు అంటూ..!

IPL Franchises Not Happy With Retention Policy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జట్ల యాజమాన్యాలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్లేయర్ రిటెన్షన్ పాలసీకి సంబంధించి అసతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

IPL Franchises Not Happy With Retention Policy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జట్ల యాజమాన్యాలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్లేయర్ రిటెన్షన్ పాలసీకి సంబంధించి అసతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

క్యాష్ రిచ్ లీగ్ ఈ సీజన్ కూడా ఎంతో అద్భుతంగా, ఉత్కంఠగా సాగిపోతోంది. వరల్డ్ వైడ్ గా ఐపీఎల్ కి ఉన్న డిమాండ్, క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ ధనా ధన్ లీగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఐపీఎల్ ఇంత సజావుగా, ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతోంది అంటే.. ఆ క్రెడిట్ ని బీసీసీఐకి ఇవ్వాల్సిందే. వాళ్లు కొన్ని షరతులు, నియమాలు పెట్టి పకడ్బందీగా ఈ లీగ్ ని నిర్వహిస్తున్నారు. ప్రతి అంశానికి సంబంధించి కచ్చితమైన రూల్స్ ఉన్నాయి. అయితే ఈ రూల్స్ విషయంలో ఫ్రాంచైజీలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్లేయర్స్ రిటెన్ష్ రూల్స్ పై ఫ్రాంచైజీలు అంత సంతృప్తిగా లేవని తెలుస్తోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి విషయానికి సంబంధించి కొన్ని పర్టిక్యులర్ రూల్స్ ఉంటాయి. వాటి ఆధారంగానే ఈ లీగ్ సజావుగా సాగుతోంది. ఆ రూల్స్ లో ఒకటే ప్లేయర్ రిటెన్షన్ పాలసీ. అంటే మీ టీమ్ లో మీకు నచ్చిన ఆటగాళ్లను వేలంలోకి వెళ్లకుండా రిటైన్ చేసుకోవచ్చు. అయితే ఈ రిటైన్ పాలసీకి సంబంధించి ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు సంతోషంగా లేవని తెలుస్తోంది. 2025 మెగా వేలానికి ముందు జట్టులో కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలి అనడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీసీసీఐ ఏప్రిల్ 16న ఫ్రాంచైజీల ఓనర్లతో సమావేశం నిర్వహించింది. ఇప్పటికే అన్ని యాజమాన్యాలకు ఆహ్వానాలు కూడా పంపింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్లేయర్స్ రిటెన్షన్, పర్స్ వ్యాల్యు పెంచడం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఈ ప్లేయర్ రిటెన్షన్ పాలసీతో సంతృప్తిగా లేరని తెలుస్తోంది. జట్ల యాజమాన్యాలు ఈసారి మెగా వేలానికి ముందు ఈ ప్లేయర్స్ రిటెన్షన్ పాలసీని మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఫ్రాంచైజీ పర్స్ వాల్యూని కూడా రూ.100 కోట్లకు పెంచాలని డిమాండ్ చేయబోతున్నారని చెబుతున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న దానికంటే రూ.10 కోట్ల వరకు పర్స్ వ్యాల్యూని పెంచాల్సి ఉంటుంది. మరి.. ఫ్రాంచైజీల డిమాండ్లకు బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుంది.

అసలు మెగా వేలానికి ముందు నిజంగానే రిటైన్ పాలసీ మారుతుందా? పర్స్ వ్యాల్యు పెరుగుతుందా? అంటే క్లారిటీ రావడానికి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మూడేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మెగా వేలంలో జట్లకు ఒక మంచి అవకాశం దక్కుతుంది. తమ జట్టును సమూలంగా మార్చుకునేందుకు.. ఒక మంచి టీమ్ ని సిద్ధం చేసుకోవడానికి మంచి అవకాశం. అయితే ఏ జట్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఎవరు ఎలాంటి మార్పులు చేస్తారు? అంటే మెగా వేలం జరిగే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి.. రిటెన్షన్ పాలసీపై ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments