iDreamPost
android-app
ios-app

వీడియో: కోహ్లీ-జడేజా మధ్య సీన్ ఫన్నీ కాదా? నిన్న మ్యాచ్ లో గమనించని సీన్!

  • Published Mar 23, 2024 | 2:05 PM Updated Updated Mar 23, 2024 | 2:05 PM

చెన్నై-ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జడేజా-విరాట్ మధ్యలో జరిగిన ఫన్నీ సీన్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?

చెన్నై-ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జడేజా-విరాట్ మధ్యలో జరిగిన ఫన్నీ సీన్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?

వీడియో: కోహ్లీ-జడేజా మధ్య సీన్ ఫన్నీ కాదా? నిన్న మ్యాచ్ లో గమనించని సీన్!

విరాట్ కోహ్లీ.. గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో, అంతే ఫన్నీగా కూడా ఉంటాడు. ప్రత్యర్థి జట్టు ప్లేయర్ కవ్విస్తే.. అంతే ఘాటుగా కౌంటర్స్ ఇస్తుంటాడు. ఇక సరదాగా ఉంటే, తనకంటే ఫన్నీగా ఎవ్వరూ ఉండరు అంటూ కామెడీ చేస్తుంటాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సైతం తన హాస్య చతురతను బయటపెట్టాడు. జడేజా-విరాట్ మధ్యలో జరిగిన ఫన్నీ సీన్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో తొలి మ్యాచ్ చెన్నై వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై టీమ్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించి.. సీజన్ లో ఫస్ట్ విన్ ను తన ఖాతాలో వేసుకుంది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా-విరాట్ కోహ్లీ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే? ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేయడానికి వచ్చాడు రవీంద్ర జడేజా. ఈ టైమ్ లో కామెరూన్ గ్రీన్-విరాట్ కోహ్లీలు క్రీజ్ లో ఉన్నారు. స్ట్రైకింగ్ ఎండ్ లో గ్రీన్ ఉండగా.. నాన్ స్ట్రైకింగ్ లో కోహ్లీ ఉన్నాడు. ఈ ఓవర్లో రెండో బంతిని గ్రీన్ బౌలర్ వైపు కొట్టగా.. జడేజా బాల్ అందుకుని కోహ్లీ మీదికి సరదా విసిరేసినట్లు చేశాడు. మరి కోహ్లీ ఊరుకుంటాడా? తన బ్యాట్ ను జడ్డూపైకి నవ్వుతూ ఊపాడు.

ఈ క్రమంలో కోహ్లీ ఓ మాటన్నాడు. “జడ్డూ భాయ్ జర గ్రీన్ ను ఊపిరి పీల్చుకోనివ్వు” అంటూ నవ్వుతూ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా జడేజా బంతులను చాలా ఫాస్ట్ గా వేస్తూ ఉంటాడు. దీంతో బ్యాటర్ కు గాలి పీల్చుకోనిచ్చే గ్యాప్ కూడా ఇవ్వడు. ప్రపంచంలో మరే బౌలర్ ఇలా త్వరగా బంతులు సంధించడు.. ఇది జడ్డూ భాయ్ స్ట్రెంత్. విరాట్ కోహ్లీకి ఇది తెలుసు కాబట్టి ఇలా వ్యాఖ్యానించాడు. బ్యాటర్లను ఇలా ఉక్కిరి బిక్కిరి చేసి ఒత్తిడిలోకి నెట్టి.. పెవిలియన్ కు పంపడంలో జడేజా గొప్ప నేర్పరి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. అనంతరం 174 పరుగుల టార్గెట్ ను 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి విరాట్-జడేజా మధ్య జరిగిన ఈ ఫన్నీ సీన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: యువ క్రికెటర్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లీ! మ్యాచ్‌లో హైఓల్టేజ్‌ సీన్‌