iDreamPost

వీడియో: యువ క్రికెటర్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లీ! మ్యాచ్‌లో హైఓల్టేజ్‌ సీన్‌

  • Published Mar 23, 2024 | 12:22 PMUpdated Mar 23, 2024 | 5:47 PM

Virat Kohli, Rachin Ravindra, IPL 2024: ఐపీఎల్‌ 2024లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఊహించని సీన్లు చోటు చేసుకున్నాయి. అది కూడా విరాట్‌ కోహ్లీ ఇన్‌వాల్వ్‌ అయిన సంఘటనలు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Rachin Ravindra, IPL 2024: ఐపీఎల్‌ 2024లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఊహించని సీన్లు చోటు చేసుకున్నాయి. అది కూడా విరాట్‌ కోహ్లీ ఇన్‌వాల్వ్‌ అయిన సంఘటనలు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 23, 2024 | 12:22 PMUpdated Mar 23, 2024 | 5:47 PM
వీడియో: యువ క్రికెటర్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లీ! మ్యాచ్‌లో హైఓల్టేజ్‌ సీన్‌

ఐపీఎల్‌ 2024 సీజన్‌ మొదలైంది. శుక్రవారం చెన్నైలోని చెపాక్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌తో ఈ మెగా టోర్ని అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే.. ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. టోర్నిని సక్సెస్‌ఫుల్‌గా మొదలుపెట్టింది. విరాట్‌ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ లాంటి స్టార్లు విఫలమైనా.. యువ క్రికెటర్‌ అనుజ్‌ రావత్‌, సీనియర్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ బాగా ఆడినా.. సీఎస్‌కే ముందు వాళ్లు పెట్టిన టార్గెట్‌ సరిపోలేదు. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఓ యువ క్రికెటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బయటికి వెళ్లిపో అంటూ ఊగిపోయాడు. ఈ ఘటన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సీఎస్‌కే ముందు 174 పరుగుల టార్గెట్‌ పెట్టింది ఆర్సీబీ. ఈ టార్గెట్‌ను ఛేజ్‌ చేసేందుకు కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్ర బరిలోకి దిగాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న రచిన్‌.. సూపర్‌ బ్యాటింగ్‌తో ఆర్సీబీ బౌలర్లను చాలా ఈజీగా ఎదుర్కొన్నాడు. ఫోర్లు సిక్సులతో ఒక రకంగా చెప్పాలంటే.. ఆర్సీబీ బౌలర్లను పిచ్చికొట్టుడు కొట్టాడు. ఇక్కడే కోహ్లీకి కోపం వచ్చింది. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఓ కుర్రాడు తన టీమ్‌పై ఈ విధంగా రెచ్చిపోతుండటం కోహ్లీకి అస్సలు మింగుడు పడలేదు. అతను ఎప్పుడు అవుట్‌ అవుతాడా అని కోహ్లీ కాచుకుని కూర్చున్నాడు. ఎట్టకేలకు కరణ్‌ శర్మ వేసిన ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ చివరి బంతికి రజత్‌ పాటిదార్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఆ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లీ.. చాలా అగ్రెసివ్‌గా రియాక్ట్‌ అవుతూ.. రచిన్‌ రవీంద్రను బయటికి వెళ్లిపోవాల్సిందగా చేత్తో సైగలు చేస్తూ కనిపించాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫీల్డ్‌లో కోహ్లీ ఇలాగే అగ్రెసివ్‌గా ఉంటాడని, బాగా ఆడుతున్న ఆటగాడు అవుట్‌ అయితే సాధారణంగా ఏ ప్లేయర్‌ అయినా సెలబ్రేట్‌ చేసుకుంటారని, కానీ, కోహ్లీ కాస్త ఓవర్‌ అగ్రెసివ్‌ ప్లేయర్‌ కాబట్టి అలా రియాక్ట్‌ అయి ఉంటాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 20 బంతుల్లో 21 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. 42 పరుగులకే మూడు కీలక వికెట్లు పడిపోవడంతో కోహ్లీ కాస్త స్లోగా ఆడాడు. కానీ, భారీ షాట్‌కు ప్రయత్నించి.. అంజిక్యా రహానె సూపర్‌ ఫీల్డింగ్‌తో కోహ్లీ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. మరి ఈ మ్యాచ్‌లో రచిన్‌ రవీంద్ర విషయంలో కోహ్లీ అగ్రెసివ్‌గా రియాక్ట్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి