iDreamPost
android-app
ios-app

T20 వరల్డ్ కప్​కు ముందు టీమిండియాకు వేకప్ కాల్! మారకపోతే ఇక అంతే!

  • Published Apr 08, 2024 | 8:22 PM Updated Updated Apr 08, 2024 | 8:22 PM

టీ20 వరల్డ్ కప్​కు టైమ్ దగ్గర పడుతోంది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు. ఈ తరుణంలో టీమిండియాకు వేకప్ కాల్.

టీ20 వరల్డ్ కప్​కు టైమ్ దగ్గర పడుతోంది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు. ఈ తరుణంలో టీమిండియాకు వేకప్ కాల్.

  • Published Apr 08, 2024 | 8:22 PMUpdated Apr 08, 2024 | 8:22 PM
T20 వరల్డ్ కప్​కు ముందు టీమిండియాకు వేకప్ కాల్! మారకపోతే ఇక అంతే!

ఇప్పుడు అంతా ఐపీఎల్ జోరు నడుస్తోంది. క్రికెట్ అభిమానులతో పాటు ఆటగాళ్లు, సీనియర్ ప్లేయర్లు అంతా క్యాష్ రిచ్ లీగ్ హడావుడిలోనే ఉన్నారు. ఏయే టీమ్స్ ఎలా ఆడుతున్నాయి? ఎవరు ప్లేఆఫ్స్​కు వెళ్తారు? ఏ క్రికెటర్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాడు? లాంటి వాటి మీదే అంతా ఫోకస్ చేస్తున్నారు. అయితే మరోవైపు టీ20 వరల్డ్ కప్​కు టైమ్ దగ్గర పడుతోంది. మిగతా జట్లు మెగా టోర్నీ కోసం సిద్ధమవుతున్నాయి. టీ20 టోర్నీలు ఆడుతూ ప్రిపరేషన్స్​లో బిజీగా ఉన్నాయి. భారత ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్​లో ఆడుతున్నారు. మన టీమ్​కు ఇంకో జట్టుతో మ్యాచ్​లు ఆడే అవకాశం లేదు. లీగ్ ముగియగానే వరల్డ్ కప్​కు వెళ్లాలి. అయితే మెగా టోర్నీకి ముందు టీమిండియాకు ఇది వేకప్ కాల్ లాంటిది. ఇప్పుడు మారకపోతే ఇంక అంతే సంగతులు అని చెప్పక తప్పదు.

ఈ ఏడాది జూన్​లో వరల్డ్ కప్ జరగనుండటంతో అన్ని టీమ్స్ ప్రిపరేషన్స్​లో బిజీగా ఉన్నాయి. భారత జట్టు ఆటగాళ్లు ఐపీఎల్​లో ఆడుతున్నారు. అయితే లీగ్​లో టీమిండియా ప్లేయర్లు ఆటతీరు బాగోలేదు. ముఖ్యంగా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. స్ట్రయిక్ రేట్ ఇప్పుడు పెద్ద వర్రీగా మారింది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శివమ్ దూబె తప్ప ఎవరూ వేగంగా పరుగులు చేయడం లేదు. ఆరెంజ్ క్యాప్​ హోల్డర్ విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్, శుబ్​మన్ గిల్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ల స్ట్రయిక్ రేట్ 150 లోపే ఉంది. ఐపీఎల్​లో ఇంకా ఫస్ట్ స్టేజ్ మాత్రమే ముగిసింది. ఇప్పుడే మనోళ్లు ఇలా ఆడితే ఇవే పిచ్​లు సెకండాఫ్​లో ఇంకా స్లో అవుతాయి. ప్లేఆఫ్స్, ఫైనల్స్​కు మరింత నెమ్మదిస్తాయి. అప్పుడు ఎలా బ్యాటింగ్ చేస్తారు? అనేది అర్థం కావడం లేదు.

ఇదే గేమ్​ను టీ20 వరల్డ్ కప్​లో కంటిన్యూ చేస్తే భారత్​కు కష్టాలు తప్పవు. ఫార్మాట్​కు తగ్గట్లు దూకుడుగా ఆడకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందరికంటే ఎక్కువగా కోహ్లీ స్ట్రయిక్ రేట్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓపెనర్​గా వస్తున్న విరాట్ ఆఖరి వరకు ఆడుతున్నాడు. అయినా అతడి స్ట్రయిక్ రేట్ 146గానే ఉంది. క్రీజులో కాస్త కుదురుకున్నాక వేగం పెంచి, ఆఖర్లో మరింత దూకుడుగా ఇన్నింగ్స్​ను ముగించాల్సిన విరాట్ ఆశించినట్లు ఆడట్లేదు. యంగ్​స్టర్ గిల్, మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ కూడా ఇదే విధంగా ఆడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఈ ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ గెలవడం కష్టమని.. వీళ్లు గేర్లు మార్చి ఐపీఎల్ ముగిసేసరికి టాప్ స్పీడ్​లో దూసుకెళ్లాలని కోరుకుంటున్నారు. మరి.. భారత బ్యాటర్ల స్ట్రయిక్ రేట్ అంశం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: క్రికెట్ చరిత్ర​లో విచిత్రమైన ఔట్.. ఇంతకంటే అన్​లక్కీ బ్యాటర్ ఉండడు!