Nidhan
ఐపీఎల్లో అంపైర్లు అక్కర్లేదని అంటున్నాడో టీమిండియా మాజీ క్రికెటర్. వాళ్లను తీసేయడమే కరెక్ట్ అని చెబుతున్నాడు. ఎవరా ప్లేయర్? ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్లో అంపైర్లు అక్కర్లేదని అంటున్నాడో టీమిండియా మాజీ క్రికెటర్. వాళ్లను తీసేయడమే కరెక్ట్ అని చెబుతున్నాడు. ఎవరా ప్లేయర్? ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఐపీఎల్-2024లోని దాదాపుగా ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతూ అభిమానులకు మస్తు వినోదాన్ని పంచుతోంది. గత సీజన్ల కంటే ఈసారి హైస్కోరింగ్ మ్యాచులు ఎక్కువగా జరగడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. ఆటగాళ్లు తమ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్‌తో ఆడుతూ ఆడియెన్స్‌ను ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే క్యాష్ రిచ్ లీగ్‌లో ఈసారి అంపైరింగ్ మిస్టేక్స్ గురించి ఎక్కువగా డిస్కషన్ నడుస్తోంది. మొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఇది మరింత శృతి మించింది. సునీల్ నరైన్ వేసిన నో బాల్‌ను అంపైర్లు గుర్తించలేదు. సుయాష్ ప్రభుదేశాయ్ కొట్టిన సిక్స్‌ను బౌండరీగా ఇచ్చారు. విరాట్ కోహ్లీ ఔట్ విషయం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఓ భారత మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు.
కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్ ఔట్ల విషయంలో తప్పిదాలు, సుయాష్ సిక్స్‌ను బౌండరీగా ఇవ్వడం వల్ల ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయింది. విరాట్ ఔట్ అయిన బాల్ బీమర్. అతడు క్రీజులో నుంచి బయటకు వచ్చి ఆడినప్పుడు అతడి నడుము కంటే ఎత్తులో బాల్ ఉంది. అయినా కింగ్‌ను ఔట్‌గా ప్రకటించారు. ఈ విషయంపై టీమిండియా వెటరన్ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సింగ్ సిద్ధు స్పందించాడు. ఫీల్డ్ అంపైర్లు చాలా తప్పిదాలు చేస్తున్నారని అతడు ఫైర్ అయ్యాడు. ప్రతిదానికీ థర్డ్ అంపైర్‌నే సంప్రదిస్తున్నారని.. అలాంటప్పుడు ఫీల్డ్ అంపైర్లు అక్కర్లేదని, వాళ్లను తీసిపారేయాలని సీరియస్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ నాటౌట్ అని, బీమర్ వేసి ఔట్ అని ఎలా అంటారని క్వశ్చన్ చేశాడు. బీమర్ వేశాక బౌలర్ సారీ చెప్పకపోగా.. ఔట్ అంటూ సంబురాలు చేసుకున్నాడని చెప్పాడు. థర్డ్ అంపైర్ కూడా దాన్ని ఔట్‌గా డిక్లేర్ చేశాడని.. ఇది స్పోర్ట్స్ స్పిరిట్‌కు విరుద్ధమని సిద్ధు స్పష్టం చేశాడు.
ఫీల్డ్ అంపైర్లు తమ విచక్షణను వినియోగించి సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అది గేమ్‌కు మంచి చేస్తుందన్నాడు సిద్ధు. ప్రతి విషయాన్ని థర్డ్ అంపైర్ తీసుకోవాలంటే ఇంక ఫీల్డ్ అంపైర్ అవసరం ఏం ఉందని ప్రశ్నించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో బీమర్‌ను నోబాల్‌గా ఇవ్వాలని విరాట్ కోహ్లీ అప్పీల్ చేశాడు. కానీ థర్డ్ అంపైన్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఆగ్రహానికి గురైన విరాట్.. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్లు సర్దిచెప్పినా కూల్ అవ్వని కింగ్.. ఆగ్రహంగా గ్రౌండ్‌ను వీడాడు. ఈ నేపథ్యంలోనే నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు పైవిధంగా రియాక్ట్ అయ్యాడు. 90 శాతం నిర్ణయాలు థర్డ్ అంపైర్లు తీసుకుంటుంటే.. ఫీల్డ్ అంపైర్లు దిష్టిబొమ్మల్లా మారారని ఫైర్ అయ్యాడు. మరి.. ఐపీఎల్లో నుంచి ఫీల్డ్ అంపైర్లను తీసేయండంటూ సిద్ధు చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Navjot Singh Sidhu said, “now the on field umpire’s job is not to stand in the stadium when 3rd umpire technology is being used for 90% of the decisions shown all on screen”. (Star Sports). pic.twitter.com/uLmWRboLMZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2024