iDreamPost
android-app
ios-app

IPLలో అంపైర్లు అక్కర్లేదు, తీసిపారేయండి.. టీమిండియా మాజీ క్రికెటర్ కామెంట్స్!

  • Published Apr 25, 2024 | 5:07 PM Updated Updated Apr 25, 2024 | 5:07 PM

ఐపీఎల్​లో అంపైర్లు అక్కర్లేదని అంటున్నాడో టీమిండియా మాజీ క్రికెటర్. వాళ్లను తీసేయడమే కరెక్ట్ అని చెబుతున్నాడు. ఎవరా ప్లేయర్? ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్​లో అంపైర్లు అక్కర్లేదని అంటున్నాడో టీమిండియా మాజీ క్రికెటర్. వాళ్లను తీసేయడమే కరెక్ట్ అని చెబుతున్నాడు. ఎవరా ప్లేయర్? ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 25, 2024 | 5:07 PMUpdated Apr 25, 2024 | 5:07 PM
IPLలో అంపైర్లు అక్కర్లేదు, తీసిపారేయండి.. టీమిండియా మాజీ క్రికెటర్ కామెంట్స్!

ఐపీఎల్-2024లోని దాదాపుగా ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతూ అభిమానులకు మస్తు వినోదాన్ని పంచుతోంది. గత సీజన్ల కంటే ఈసారి హైస్కోరింగ్ మ్యాచులు ఎక్కువగా జరగడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. ఆటగాళ్లు తమ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్​తో ఆడుతూ ఆడియెన్స్​ను ఫుల్​గా ఎంటర్​టైన్ చేస్తున్నారు. అయితే క్యాష్ రిచ్ లీగ్​లో ఈసారి అంపైరింగ్ మిస్టేక్స్ గురించి ఎక్కువగా డిస్కషన్ నడుస్తోంది. మొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్​కతా నైట్ రైడర్స్ మ్యాచ్​లో ఇది మరింత శృతి మించింది. సునీల్ నరైన్ వేసిన నో బాల్​ను అంపైర్లు గుర్తించలేదు. సుయాష్ ప్రభుదేశాయ్ కొట్టిన సిక్స్​ను బౌండరీగా ఇచ్చారు. విరాట్ కోహ్లీ ఔట్ విషయం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఓ భారత మాజీ క్రికెటర్ రియాక్ట్ అయ్యాడు.

కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్ ఔట్ల విషయంలో తప్పిదాలు, సుయాష్ సిక్స్​ను బౌండరీగా ఇవ్వడం వల్ల ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయింది. విరాట్​ ఔట్ అయిన బాల్ బీమర్. అతడు క్రీజులో నుంచి బయటకు వచ్చి ఆడినప్పుడు అతడి నడుము కంటే ఎత్తులో బాల్ ఉంది. అయినా కింగ్​ను ఔట్​గా ప్రకటించారు. ఈ విషయంపై టీమిండియా వెటరన్ క్రికెటర్ నవ్​జ్యోత్ సింగ్ సింగ్ సిద్ధు స్పందించాడు. ఫీల్డ్ అంపైర్లు చాలా తప్పిదాలు చేస్తున్నారని అతడు ఫైర్ అయ్యాడు. ప్రతిదానికీ థర్డ్ అంపైర్​నే సంప్రదిస్తున్నారని.. అలాంటప్పుడు ఫీల్డ్ అంపైర్లు అక్కర్లేదని, వాళ్లను తీసిపారేయాలని సీరియస్ అయ్యాడు. ఆ మ్యాచ్​లో కోహ్లీ నాటౌట్ అని, బీమర్ వేసి ఔట్ అని ఎలా అంటారని క్వశ్చన్ చేశాడు. బీమర్ వేశాక బౌలర్ సారీ చెప్పకపోగా.. ఔట్ అంటూ సంబురాలు చేసుకున్నాడని చెప్పాడు. థర్డ్ అంపైర్ కూడా దాన్ని ఔట్​గా డిక్లేర్ చేశాడని.. ఇది స్పోర్ట్స్ స్పిరిట్​కు విరుద్ధమని సిద్ధు స్పష్టం చేశాడు.

ఫీల్డ్ అంపైర్లు తమ విచక్షణను వినియోగించి సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అది గేమ్​కు మంచి చేస్తుందన్నాడు సిద్ధు. ప్రతి విషయాన్ని థర్డ్ అంపైర్ తీసుకోవాలంటే ఇంక ఫీల్డ్ అంపైర్ అవసరం ఏం ఉందని ప్రశ్నించాడు. కేకేఆర్​తో మ్యాచ్​లో బీమర్​ను నోబాల్​గా ఇవ్వాలని విరాట్ కోహ్లీ అప్పీల్ చేశాడు. కానీ థర్డ్ అంపైన్ ఔట్​గా ప్రకటించాడు. దీంతో ఆగ్రహానికి గురైన విరాట్.. ఫీల్డ్ అంపైర్​తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్లు సర్దిచెప్పినా కూల్​ అవ్వని కింగ్.. ఆగ్రహంగా గ్రౌండ్​ను వీడాడు. ఈ నేపథ్యంలోనే నవ్​జ్యోత్ సింగ్ సిద్ధు పైవిధంగా రియాక్ట్ అయ్యాడు. 90 శాతం నిర్ణయాలు థర్డ్ అంపైర్లు తీసుకుంటుంటే.. ఫీల్డ్ అంపైర్లు దిష్టిబొమ్మల్లా మారారని ఫైర్ అయ్యాడు. మరి.. ఐపీఎల్​లో నుంచి ఫీల్డ్ అంపైర్లను తీసేయండంటూ సిద్ధు చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.