Nidhan
ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతోంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్లకు రేపు చాలా ముఖ్యమైన రోజు. రేపటి మ్యాచుల్ని ఆడియెన్స్ అస్సలు మిస్సవ్వొద్దు.
ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతోంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్లకు రేపు చాలా ముఖ్యమైన రోజు. రేపటి మ్యాచుల్ని ఆడియెన్స్ అస్సలు మిస్సవ్వొద్దు.
Nidhan
గత కొన్ని వారాలుగా క్రికెట్ ఆడియెన్స్‌కు మస్తు ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది ఐపీఎల్-2024. భారీ స్కోర్లు, అద్భుత సెంచరీలు, సంచలన బౌలింగ్ ప్రదర్శనలు, మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలతో ఫ్యాన్స్ మనసులు దోచారు ప్లేయర్లు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా సాగుతూ లీగ్‌పై ఇంట్రెస్ట్‌ను ఇంకా పెంచేశాయి. క్యాష్ రిచ్ లీగ్‌లో ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతోంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్లకు రేపు చాలా ముఖ్యమైన రోజు. రేపటి మ్యాచుల్ని ఆడియెన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ నేపథ్యంలో రేపు ఏయే టీమ్స్ తలపడబోతున్నాయి? ఈ మ్యాచులతో ప్లేఆఫ్స్‌పై ఎలా క్లారిటీ రానుందో ఇప్పుడు తెలుసుకుందాం..
పాయింట్స్ టేబుల్లో టాప్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాయి. పాయింట్స్ టేబుల్లో దిగువన ఉన్న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. ఇక, మిగిలిన రెండు పొజిషన్ల కోసం ఏకంగా 6 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జియాంట్స్, ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలని భావిస్తున్నాయి. వీటిల్లో సీఎస్కే, ఆర్సీబీ, డీసీలు రేపు మ్యాచ్ ఆడనున్నాయి. రాజస్థాన్‌తో చెన్నై తలపడనుండగా.. ఆర్సీబీ-డీసీ చావోరేవో తేల్చుకోనున్నాయి.
ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నై, ఢిల్లీ, ఆర్సీబీ రేపటి మ్యాచ్‌లో తప్పనిసరిగా నెగ్గాలి. ఏ టీమ్ ఓడిపోతే అది ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో రేపటి రెండు మ్యాచులతో ఈ మూడు జట్ల భవితవ్యం ఏంటో తేలిపోతుంది. సన్‌రైజర్స్, గుజరాత్, లక్నో ప్లేఆఫ్స్ అవకాశాల మీద కూడా రేపటి మ్యాచ్‌ల రిజల్ట్ ప్రభావం చూపనుంది. సీఎస్కే, డీసీ, ఆర్సీబీలు ఇప్పటిదాకా చెరో 12 మ్యాచ్‌లు ఆడాయి. రేపటి మ్యాచుల్లో గెలిచే జట్టు ప్లేఆఫ్స్ ఛాన్సులు పెరుగుతాయి. రేపు నెగ్గి, ఆఖరి మ్యాచ్‌లోనూ నెగ్గితే ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖాయమైనట్లే. అందుకే ఈ సీజన్ ఐపీఎల్లో ఈ సండే మోస్ట్ ఇంపార్టెంట్ డే కానుంది. మరి.. రేపటి మ్యాచ్‌లు చూసేందుకు మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.