Nidhan
ఐపీఎల్-2024 ముగింపు దశకు చేరుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్-2తో ప్లేఆఫ్స్ దశ పూర్తవుతుంది.
ఐపీఎల్-2024 ముగింపు దశకు చేరుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్-2తో ప్లేఆఫ్స్ దశ పూర్తవుతుంది.
Nidhan
ఐపీఎల్-2024 ముగింపు దశకు చేరుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్-2తో ప్లేఆఫ్స్ దశ పూర్తవుతుంది. ప్లేఆఫ్స్‌లో భాగంగా జరిగిన క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఎలిమినేటర్‌లో ఆర్సీబీకి షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. ఫైనల్స్‌లో మరో బెర్త్ కోసం రాజస్థాన్, సన్‌రైజర్స్ పోటీపడుతున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య శుక్రవారం క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్ ఫైట్‌లో కేకేఆర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే లక్ కలిసొస్తే ఈ మ్యాచ్ ఆడకుండానే ఎస్ఆర్హెచ్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మే 24వ తేదీన సన్‌రైజర్స్-రాజస్థాన్ మధ్య క్వాలిఫయర్-2 జరగనుంది. ఈ మ్యాచ్‌తో ప్లేఆఫ్స్ దశ ముగుస్తుంది. ఇందులో నెగ్గిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన టీమ్ ఇంటిదారి పడుతుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. శుక్రవారం చెన్నైలో వాన కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన ప్రకటన క్రికెట్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. రాబోయే 48 గంటల పాటు చెన్నైలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తమిళనాడు వెదర్‌మ్యాన్ చెప్పారు. చెన్నైలో వాన తప్పదనే వార్తల నేపథ్యంలో అభిమానుల మెదళ్లను ఓ ప్రశ్న తొలచివేస్తోంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? రాజస్థాన్, సన్‌రైజర్స్‌లో ఎవరు ఫైనల్స్‌కు వెళ్తారు? అయితే దీనికి ఐపీఎల్ నిర్వాహకులు ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
క్వాలిఫయర్-2కు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ వర్షం వల్ల రేపు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే శనివారం పెడతారు. ఆ రోజు కూడా వాన కురిసి మ్యాచ్ రద్దయితే మాత్రం ఆరెంజ్ ఆర్మీ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అయితే ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డుపడితే మాత్రం పాయింట్స్ టేబుల్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఏ టీమ్కైతే ఎక్కువ పాయింట్లు ఉన్నాయో ఆ టీమ్‌ను విన్నర్‌గా అనౌన్స్ చేస్తారు. ఆ లెక్కన క్వాలిఫయర్-2 వర్షం వల్ల రద్దయితే.. పాయింట్స్ టేబుల్లో రాజస్థాన్ కంటే ముందంజలో ఉన్న ఎస్ఆర్హెచ్ ఫైనల్‌కు చేరుతుంది. కాబట్టి మ్యాచ్ జరిగితే బాగా ఆడి రాజస్థాన్‌ను ఓడించి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించాలి. ఒకవేళ వాన పడి రద్దయితే మాత్రం లక్ ఫ్యాక్టర్‌తో కమిన్స్ సేన ఫైనల్ చేరడం పక్కా.