Nidhan
లెజెండ్ కుమార సంగక్కర ఎప్పుడూ కూల్‌గా ఉంటాడనేది తెలిసిందే. అలాంటోడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అంపైర్లతో గొడవకు దిగాడు.
లెజెండ్ కుమార సంగక్కర ఎప్పుడూ కూల్‌గా ఉంటాడనేది తెలిసిందే. అలాంటోడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అంపైర్లతో గొడవకు దిగాడు.
Nidhan
శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర ఎప్పుడూ కూల్‌గా ఉంటాడనేది తెలిసిందే. ఇంటర్నేషనల్ కెరీర్లో ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లోనూ అతడు సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చాడు. అపోజిషన్ టీమ్ ప్లేయర్లు రెచ్చగొట్టినా అతడు మాత్రం చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు. అలాంటోడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అంపైర్లతో గొడవకు దిగాడు. రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగక్కర.. ఆరెంజ్ ఆర్మీతో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చాలా సీరియస్‌గా కనిపించాడు. దీనికి కారణం ఓ రనౌట్.
ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (58) ఔట్ విషయంలో సంగక్కర సీరియస్ అయ్యాడు. 15వ ఓవర్లో ఆవేశ్ ఖాన్ వేసిన బాల్ వికెట్లకు దూరంగా పడి వెళ్తుండగా దాన్ని వెంటాడి మరీ బాదేందుకు ప్రయత్నించాడు హెడ్. అయినా బంతిని టచ్ చేయలేకపోయాడు. అయితే షాట్ ఆడాక క్రీజులో బ్యాట్‌ను ఉంచడంలో అతడు కాస్త ఆలస్యం చేశాడు. అంతే కీపర్ సంజూ శాంసన్ బాల్‌తో స్టంప్స్‌ను హిట్ చేశాడు. అతడు ఔట్ అని అందరూ అనుకున్నారు. అయితే బాల్ వికెట్లను తాకిన టైమ్‌లోనే హెడ్ బ్యాట్‌ను క్రీజులో పెట్టడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ డిసిషన్‌తో అసంతృప్తికి గురైన సంగక్కర సీరియస్ అయ్యాడు. డగౌట్లో నుంచి లేచి వచ్చి అంపైర్లతో గొడవకు దిగాడు. నాటౌట్ ఎలా ఇస్తారంటూ వాదనకు దిగాడు. అయితే తర్వాతి బంతికే హెడ్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు ఆవేశ్. దీంతో ఈ ఫైట్ కాస్తా సద్దుమణిగింది.
A CONTROVERSIAL DECISION FROM THE 3RD UMPIRE.
Travis Head given Not Out saying bat grounded, Sanga was unhappy then Avesh Khan gets him next ball. pic.twitter.com/T0vjGRX8l6
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 2, 2024
Travis Head was given not-out, Sangakkara was unhappy, asking questions to the umpire near dug-out and next ball Head got out. pic.twitter.com/AmzjXP5w8z
— Johns. (@CricCrazyJohns) May 2, 2024