iDreamPost
android-app
ios-app

SRHతో మ్యాచ్​కు ముందు కోహ్లీ ఎమోషనల్.. ఇంతకీ విరాట్ ఏమన్నాడంటే..!

  • Published Apr 25, 2024 | 6:35 PM Updated Updated Apr 25, 2024 | 6:35 PM

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మ్యాచ్​కు ముందు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. ఫ్యాన్స్​ను ఉద్దేశించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మ్యాచ్​కు ముందు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. ఫ్యాన్స్​ను ఉద్దేశించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Apr 25, 2024 | 6:35 PMUpdated Apr 25, 2024 | 6:35 PM
SRHతో మ్యాచ్​కు ముందు కోహ్లీ ఎమోషనల్.. ఇంతకీ విరాట్ ఏమన్నాడంటే..!

ఫేవరెట్స్​గా టోర్నమెంట్​ను స్టార్ట్ చేసి హాఫ్ సీజన్ అయిపోయేసరికి పాయింట్స్ టేబుల్​లో అందరికంటే కింద ఉన్న జట్టు ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా సీజన్​ను ఆరంభించి వరుస విజయాలతో ప్రత్యర్థులను భయపెడుతూ ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్లున్న టీమ్ ఇంకొకటి. అందులో మొదటిది ఆర్సీబీ కాగా.. రెండోది సన్​రైజర్స్ హైదరాబాద్. వీటి మధ్య సిసలైన పోరుకు ఉప్పల్‌ స్టేడియం వేదిక కానుంది. ఇవాళే ఈ కొదమసింహాలు తలపడనున్నాయి. ఇందులో కమిన్స్ సేన ఫేవరెట్స్​గా బరిలోకి దిగనుంది. ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్న బెంగళూరు ఆరెంజ్ ఆర్మీకి షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ మ్యాచ్​కు ముందు విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.

ఈ సీజన్​లో ఎన్నో ఎక్స్​పెక్టేషన్స్​తో బరిలోకి దిగిన ఆర్సీబీ వాటిని అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో ఏడింట ఓడి ప్లేఆఫ్స్​ రేసు నుంచి తప్పుకుంది. అయినా ఆ టీమ్​ను ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్​రైజర్స్​తో మ్యాచ్​కు ముందు కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. బెంగళూరు జట్టుపై అభిమానులు చూపిస్తున్న ఆదరాభిమానాలు, ప్రేమ, మద్దతుకు తాను ముగ్ధుడ్ని అయ్యానని విరాట్ అన్నాడు. ఆర్సీబీ ఫ్యామిలీలో ఫ్యాన్స్ కూడా ఒక భాగమేనని చెప్పాడు. తమ మీద వాళ్ల అభిమానం చెక్కుచెదరలేదని తెలిపాడు. ఆర్సీబీ టీమ్​పై ఫ్యాన్స్ చూపిస్తున్న లవ్, లాయల్టీకి పడిపోయానని.. వాళ్లు తమ కుటుంబంలో భాగమని చెబుతూ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.

ఇక, సన్​రైజర్స్​తో మ్యాచ్​లో ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గాలని ఆర్సీబీ చూస్తోంది. ఇక మీదట ఆడే అన్ని మ్యాచుల్లో గెలిచినా ఆ జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్స్ కష్టమే. అయినా అభిమానుల మనసు దోచుకోవాలంటే మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది. అలాగే ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఇతర టీమ్స్​కు షాక్ ఇవ్వాలని కూడా చూస్తోంది. ముఖ్యంగా భారీ స్కోర్లు బాదుతూ అందర్నీ భయపెడుతున్న ఆరెంజ్ ఆర్మీకి ఝలక్ ఇవ్వాలని అనుకుంటోంది. కానీ హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, నితీష్ రెడ్డి, సమద్ లాంటి పించ్ హిట్టర్లు ఉన్న జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. ఇంతకుముందు వరకు ఆర్సీబీ మ్యాచ్ అంటే హైదరాబాద్​లోనూ ఫుల్ సపోర్ట్ దొరికేది. కానీ సన్​రైజర్స్ టీమ్ పీక్ ఫామ్​లో ఉంది కాబట్టి లోకల్ టీమ్​కు ఎక్కువ మద్దతు దొరగడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మరి.. ఎస్​ఆర్​హెచ్-ఆర్సీబీ ఫైట్​లో ఎవరు నెగ్గుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.