iDreamPost

అతనో స్టార్‌ క్రికెటర్‌.. 140 కోట్ల మందిలో ఇంతకంటే దురదృష్టవంతుడు ఇంకోడు ఉండడు!

అతడొక స్టార్ క్రికెటర్.. పైగా ప్రస్తుత ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు. కానీ టీ20 వరల్డ్ కప్ 2024లో చోటు దక్కేలా లేదు. దీంతో 140 కోట్ల మందిలో అతడి కంటే దురదృష్టవంతుడు ఇంకోడు లేడని అంటున్నారు క్రికెట్ అభిమానులు. అతడి తలరాత ఎప్పటికీ మారదని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే?

అతడొక స్టార్ క్రికెటర్.. పైగా ప్రస్తుత ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు. కానీ టీ20 వరల్డ్ కప్ 2024లో చోటు దక్కేలా లేదు. దీంతో 140 కోట్ల మందిలో అతడి కంటే దురదృష్టవంతుడు ఇంకోడు లేడని అంటున్నారు క్రికెట్ అభిమానులు. అతడి తలరాత ఎప్పటికీ మారదని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే?

అతనో స్టార్‌ క్రికెటర్‌.. 140 కోట్ల మందిలో ఇంతకంటే దురదృష్టవంతుడు ఇంకోడు ఉండడు!

ఎంత టాలెంట్ ఉన్నా గానీ ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు పెద్దలు. ఆ అదృష్టమే లేకపోతే.. ఎక్కడికో ఎదగాల్సిన వ్యక్తులు ఇంకా అదే ప్లేస్ లో బతుకీడుస్తూ ఉంటారు. ప్రస్తుతం టీమిండియాలో ఓ క్రికెట్ పరిస్థితి ఇలాగే ఉంది. భారత జట్టులో అతడో గొప్ప క్రికెటర్. కానీ అవకాశాలే సరిగ్గా రావు. వచ్చినా వాటిని టైమ్ కి సరిగ్గా వినియోగించుకోడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు. బ్యాటింగ్ లో అదరగొట్టడమే కాకుండా.. కెప్టెన్ గా కూడా జట్టుకు తిరుగులేని విజయాలను అందిస్తున్నాడు. ఇంతకీ 140 కోట్లలో ఉన్న ఆ దుదృష్టవంతుడు ఎవరు? టీ20 వరల్డ్ కప్ టీమ్ లో అయినా ప్లేస్ దక్కుతుందా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా తయ్యారైంది టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ పరిస్థితి. సంజూ ఆటను శంకించడానికి ఏం లేదు. కీపర్ గా, బ్యాటర్ గా తనకంటూ టీమిండియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ టీమ్ లో మాత్రం సుస్థిర స్థానాన్ని మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు. అద్బుతంగా ఆడుతున్నాడని ఛాన్స్ లు ఇస్తే.. వచ్చిన ఒకటి, అర అవకాశాలను సద్వినియోగం చేసుకోడు. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత ఆడిన ఇతర టోర్నీల్లో దుమ్మురేపుతూ ఉంటాడు. అతడి కెరీర్ మెుత్తం ఇలాగే కొనసాగోతోంది. ఇక అతడిని జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ ధర్నాలు కూడా చేశారంటే.. అతడు ఎలాంటి ప్లేయరో అర్ధం చేసుకోవచ్చు.

ఇదంతా కాసేపు పక్కన పెడితే.. జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో సంజూ శాంసన్ కు ప్లేస్ దక్కుతుందా? లేదా? అన్నదే ఇప్పుడు అతడి ముందున్న పెద్ద సమస్య. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు శాంసన్. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో 62 సగటుతో 314 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధసెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 82*. ప్రస్తుతం సంజూ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కానీ అతడికి టీ20 వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కడం కష్టంగానే ఉంది. అదేంటి? బాగా ఆడుతున్నాడు, కెప్టెన్ గా జట్టుకు విజయాలు కూడా అందిస్తున్నాడు మరెందుకు అతడికి జట్టులో చోటు దక్కదంటున్నారు? అని మీకు అనుమానం రావొచ్చు.

దానికీ ఓ రీజన్ ఉంది. టీ20 వరల్డ్ కప్ జట్టులో వికెట్ కీపర్ ప్లేస్ లో సంజూకు చోటు దక్కాలంటే? రిషబ్ పంత్ ను దాటుకుని ముందుకు వెళ్లాలి. లేదంటే కష్టమే. ఎందుకంటే? పంత్ సైతం ఈ సీజన్ లో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో 48 సగటుతో 342 రన్స్ చేశాడు. అందులో 3 ఫిఫ్టీలు కూడా ఉన్నాయి. పంత్ నుంచే సంజూ శాంసన్ కు సమస్య ఎదురుకానుంది. అదీకాక కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ లు సీనియర్ల ఆప్షన్లలో ఉండనే ఉన్నారు. దీంతో మరోసారి సంజూకు మెుండిచేయి ఎదురౌతుందా? అని నెటిజన్లు భావిస్తున్నారు.

కాగా.. రాజస్తాన్ టీమ్ ను అద్భుతంగా ముందుకు నడిపిస్తూ.. ఐపీఎల్ టైటిల్ దిశగా దూసుకెళ్తున్న సంజూకు.. ఇది పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో 140 కోట్ల భారతీయుల్లో సంజూ కంటే దురదృష్టవంతుడు ఇంకోడు లేడని, ఇతడి తలరాత మారదని అభిమానులు బాధతో కామెంట్స్ చేస్తున్నారు. ఇక శాంసన్ కెరీర్ విషయానికి వస్తే.. టీమిండియా తరఫున 16 వన్డేల్లో 510, 25 టీ20ల్లో 374, 160 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 4202 పరుగులు చేశాడు. ఓపెనర్ గానే కాకుండా టాపార్డర్ లో విలువైన ఆటగాడు శాంసన్. చూడాలి మరి ఈ వరల్డ్ కప్ జట్టులోనైనా ప్లేస్ దక్కించుకుంటాడో లేదో. ఇక శాంసన్ దురదృష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి