iDreamPost
android-app
ios-app

DC vs SRH: ఒకే మ్యాచ్​లో 4 వరల్డ్ రికార్డులు.. ఇది సార్ సన్​రైజర్స్ సత్తా!

  • Published Apr 21, 2024 | 10:55 AM Updated Updated Apr 21, 2024 | 11:34 AM

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు పాత రికార్డులకు పాతర వేసింది. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో ఏకంగా నాలుగు వరల్డ్ రికార్డులు క్రియేట్ చేసింది.

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు పాత రికార్డులకు పాతర వేసింది. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో ఏకంగా నాలుగు వరల్డ్ రికార్డులు క్రియేట్ చేసింది.

  • Published Apr 21, 2024 | 10:55 AMUpdated Apr 21, 2024 | 11:34 AM
DC vs SRH: ఒకే మ్యాచ్​లో 4 వరల్డ్ రికార్డులు.. ఇది సార్ సన్​రైజర్స్ సత్తా!

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్-2024లో జూలు విదిల్చి ఆడుతోంది. హిట్టింగ్​కు కొత్త డెఫినిషన్ చెబుతూ ఆ టీమ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. క్రికెట్ అంటే ఇలా ఆడాలి? బ్యాటింగ్ ఇలా చేయాలి? అంటూ టీ20 ఫార్మాట్​ స్టైల్​ను మార్చేస్తూ ఆ జట్టు దూకుడుగా ఆడుతోంది. పొట్టి ఫార్మాట్​లో 250 ప్లస్ స్కోరు కొడితే చాలా గొప్పగా భావిస్తుంటారు. అలాంటిది ఒకే సీజన్​లో మూడు సార్లు ఆ స్కోరును చేసి ఔరా అనిపించింది. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ లాంటి టాప్ టీమ్స్​నే వణికించిన ఆరెంజ్ ఆర్మీ.. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్​ను ఓ ఆటాడుకుంది. హైస్కోరింగ్ మ్యాచ్​లో కమిన్స్ సేన 67 పరుగుల భారీ తేడాతో విజయం నమోదు చేసింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్​లో సెకండ్ ప్లేస్​కు చేరుకుంది. డీసీతో మ్యాచ్​తో పలు ప్రపంచ రికార్డులను సృష్టించింది ఎస్​ఆర్​హెచ్.

సన్​రైజర్స్ జట్టు పాత రికార్డులకు పాతర వేసింది. ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో ఏకంగా నాలుగు వరల్డ్ రికార్డులు క్రియేట్ చేసింది. పవర్​ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఎస్​ఆర్​హెచ్​ నిలిచింది. డీసీతో మ్యాచ్​లో 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. పవర్​ప్లేలో అత్యధిక బౌండరీలు (24) కొట్టిన టీమ్​గా కమిన్స్ సేన నిలిచింది. అలాగే పవర్​ప్లేలో అత్యధిక సిక్సర్లు (11) కొట్టిన జట్టుగానూ ఆరెంజ్ ఆర్మీ అరుదైన ఘనతను అందుకుంది. ఈ క్రమంలో శ్రీలంక జట్టు 2014లో సస్సెక్స్​ మీద బాదిన 20 బౌండరీల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అత్యంత వేగంగా (8.4 ఓవర్లు) 150 పరుగుల మార్క్​ను చేరుకున్న టీమ్​గానూ సన్​రైజర్స్ రికార్డు క్రియేట్ చేసింది. అలాగే ఐపీఎల్ హిస్టరీలో తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు (158) చేసిన టీమ్​గానూ ఎస్​ఆర్​హెచ్​ ఘనత సాధించింది.

4 world record in one match!

సన్​రైజర్స్ ఇన్ని వరల్డ్ రికార్డులు సృష్టించిందంటే దానికి ఆ టీమ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. హెడ్ 32 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. ఇందులో 11 బౌండరీలతో పాటు 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ 2 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 12 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా వీళ్లు కోసిన ఊచకోత వల్లే పవర్​ప్లేలో అన్ని పరుగులు స్కోరు బోర్డు మీదకు చేరుకున్నాయి. గెలుపోటములు కాదు.. ప్రత్యర్థిని భయపెట్టడమే టార్గెట్​గా పెట్టుకొని అటాకింగ్ అప్రోచ్​తో ఓపెనర్లు చేసిన విధ్వంసమే సన్​రైజర్స్​కు పలు రికార్డులతో పాటు భారీ విజయాన్ని అందించింది. మరి.. డీసీతో మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్​ ఆట మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.