Nidhan
సన్‌రైజర్స్ సీనియర్ పేసర్ నటరాజన్ తనలో ఇంకా పస తగ్గలేదని ప్రూవ్ చేశాడు. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటర్లకు ఓ రేంజ్లో పోయించాడు.
సన్‌రైజర్స్ సీనియర్ పేసర్ నటరాజన్ తనలో ఇంకా పస తగ్గలేదని ప్రూవ్ చేశాడు. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటర్లకు ఓ రేంజ్లో పోయించాడు.
Nidhan
ఒకప్పుడు అతడో అనామకుడు. అయితే అద్భుతమైన బౌలింగ్‌తో తక్కువ టైమ్‌లోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. యార్కర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. యార్కర్లతో పాటు స్లో డెలివరీస్ వేయడంలోనూ ఆరితేరాడు. ఐపీఎల్లో అదరగొట్టడంతో టీమిండియాలో ఆడే ఛాన్స్‌నూ దక్కించుకున్నాడు. అయితే భారత జట్టు తరఫున అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్‌లోనూ మళ్లీ ఆ రేంజ్లో రాణించలేదు. కానీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని కసి మీద ఉన్న ఆ పేసర్.. ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. అతడే టీ నటరాజన్. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూపర్బ్ బౌలింగ్‌తో మెస్మరైజ్ చేశాడు నటరాజన్.
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ స్పెల్‌లో నటరాజన్ చెలరేగిపోయాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. లాస్ట్ స్పెల్‌లో కూడా ఇంకో వికెట్ తీశాడు. వెంకటేష్ అయ్యర్ (7)తో పాటు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0)ను ఒక్క బాల్ గ్యాప్‌లో ఔట్ చేశాడు. స్లో బాల్స్, యార్కర్స్, బౌన్సర్స్ లాంటి వేరియేషన్స్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. పిచ్ నుంచి మద్దతు లభిస్తుండటం, లెంగ్త్‌లో వేస్తే బాల్ బౌన్స్ కూడా అవుతుండటంతో కేకేఆర్ బ్యాటర్లతో నటరాజన్ ఆడుకున్నాడు. అతడి బౌలింగ్‌లో రన్స్ రాకపోవడం, వికెట్లు కూడా పడుతుండటంతో బాల్‌ను టచ్ చేసేందుకు కూడా బ్యాటర్లు భయపడ్డారు.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఫస్ట్ స్పెల్‌లో నటరాజన్‌తో పాటు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అదరగొట్టారు. పిచ్ నుంచి సపోర్ట్ దొరకడంతో చెలరేగి బౌలింగ్ చేశారు. అయితే చివరి ఓవర్లలో ఆండ్రీ రస్సెల్ (25 బంతుల్లో 64 నాటౌట్) ఉప్పెనలా విరుచుకుపడటంతో ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు. భువీతో పాటు మార్కండేయను టార్గెట్ చేసుకొని భారీ సిక్సులు బాదాడు రస్సెల్. అలాంటోడు కూడా నటరాజన్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాడు. పదునైన యార్కర్లు, ఫాస్ట్ బౌన్సర్లతో పరుగులు కట్టడి చేశాడతను. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన నటరాజన్.. 32 పరుగులు ఇచ్చి, 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో నటరాజన్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక, తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం 12/0తో ఉంది. ఛేదించాల్సిన స్కోరు భారీగా ఉంది కాబట్టి సన్‌రైజర్స్ బ్యాటర్లు పట్టుదలతో ఆడాల్సి ఉంటుంది. మరి.. నటరాజన్ బౌలింగ్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
T Natarajan has been the standout bowler for Sunrisers Hyderabad against KKR. pic.twitter.com/K6JflWdyWM
— CricTracker (@Cricketracker) March 23, 2024