iDreamPost
android-app
ios-app

నటరాజన్ ఈజ్ బ్యాక్.. KKR బ్యాటర్లకు ఓ రేంజ్​లో పోయించాడు!

  • Published Mar 23, 2024 | 9:59 PM Updated Updated Mar 23, 2024 | 9:59 PM

సన్​రైజర్స్ సీనియర్ పేసర్ నటరాజన్ తనలో ఇంకా పస తగ్గలేదని ప్రూవ్ చేశాడు. కేకేఆర్​తో జరుగుతున్న మ్యాచ్​లో బ్యాటర్లకు ఓ రేంజ్​లో పోయించాడు.

సన్​రైజర్స్ సీనియర్ పేసర్ నటరాజన్ తనలో ఇంకా పస తగ్గలేదని ప్రూవ్ చేశాడు. కేకేఆర్​తో జరుగుతున్న మ్యాచ్​లో బ్యాటర్లకు ఓ రేంజ్​లో పోయించాడు.

  • Published Mar 23, 2024 | 9:59 PMUpdated Mar 23, 2024 | 9:59 PM
నటరాజన్ ఈజ్ బ్యాక్.. KKR బ్యాటర్లకు ఓ రేంజ్​లో పోయించాడు!

ఒకప్పుడు అతడో అనామకుడు. అయితే అద్భుతమైన బౌలింగ్​తో తక్కువ టైమ్​లోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. యార్కర్ల స్పెషలిస్ట్​గా పేరు తెచ్చుకున్నాడు. యార్కర్లతో పాటు స్లో డెలివరీస్ వేయడంలోనూ ఆరితేరాడు. ఐపీఎల్​లో అదరగొట్టడంతో టీమిండియాలో ఆడే ఛాన్స్​నూ దక్కించుకున్నాడు. అయితే భారత జట్టు తరఫున అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్​లోనూ మళ్లీ ఆ రేంజ్​లో రాణించలేదు. కానీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని కసి మీద ఉన్న ఆ పేసర్.. ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. అతడే టీ నటరాజన్. కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో సూపర్బ్ బౌలింగ్​తో మెస్మరైజ్ చేశాడు నటరాజన్.

కోల్​కతాతో జరుగుతున్న మ్యాచ్​లో ఫస్ట్ స్పెల్​లో నటరాజన్ చెలరేగిపోయాడు. ఒకే ఓవర్​లో 2 వికెట్లు తీసుకున్నాడు. లాస్ట్ స్పెల్​లో కూడా ఇంకో వికెట్ తీశాడు. వెంకటేష్ అయ్యర్ (7)తో పాటు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0)ను ఒక్క బాల్ గ్యాప్​లో ఔట్ చేశాడు. స్లో బాల్స్, యార్కర్స్, బౌన్సర్స్ లాంటి వేరియేషన్స్​ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. పిచ్ నుంచి మద్దతు లభిస్తుండటం, లెంగ్త్​లో వేస్తే బాల్ బౌన్స్ కూడా అవుతుండటంతో కేకేఆర్ బ్యాటర్లతో నటరాజన్ ఆడుకున్నాడు. అతడి బౌలింగ్​లో రన్స్ రాకపోవడం, వికెట్లు కూడా పడుతుండటంతో బాల్​ను టచ్ చేసేందుకు కూడా బ్యాటర్లు భయపడ్డారు.

కేకేఆర్​తో మ్యాచ్​లో ఫస్ట్ స్పెల్​లో నటరాజన్​తో పాటు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అదరగొట్టారు. పిచ్ నుంచి సపోర్ట్ దొరకడంతో చెలరేగి బౌలింగ్ చేశారు. అయితే చివరి ఓవర్లలో ఆండ్రీ రస్సెల్ (25 బంతుల్లో 64 నాటౌట్) ఉప్పెనలా విరుచుకుపడటంతో ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు. భువీతో పాటు మార్కండేయను టార్గెట్ చేసుకొని భారీ సిక్సులు బాదాడు రస్సెల్. అలాంటోడు కూడా నటరాజన్ బౌలింగ్​లో జాగ్రత్తగా ఆడాడు. పదునైన యార్కర్లు, ఫాస్ట్ బౌన్సర్లతో పరుగులు కట్టడి చేశాడతను. మొత్తంగా ఈ మ్యాచ్​లో 4 ఓవర్లు వేసిన నటరాజన్.. 32 పరుగులు ఇచ్చి, 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో నటరాజన్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక, తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఛేజింగ్​కు దిగిన ఎస్​ఆర్​హెచ్ ప్రస్తుతం 12/0తో ఉంది. ఛేదించాల్సిన స్కోరు భారీగా ఉంది కాబట్టి సన్​రైజర్స్ బ్యాటర్లు పట్టుదలతో ఆడాల్సి ఉంటుంది. మరి.. నటరాజన్ బౌలింగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.