పూర్తిగా మారిన SRH.. ఏది బలహీనతో అదే ఇప్పుడు బలంగా మారింది!

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మునుపటి సీజన్లలో ఎంతో బలహీనంగా కనిపించిన ఎస్ఆర్​హెచ్​లో ఇప్పుడు క్లియర్ ఛేంజ్ కనిపిస్తోంది.

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మునుపటి సీజన్లలో ఎంతో బలహీనంగా కనిపించిన ఎస్ఆర్​హెచ్​లో ఇప్పుడు క్లియర్ ఛేంజ్ కనిపిస్తోంది.

ఐపీఎల్-2024లో సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. గత మ్యాచ్​లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్​ను చిత్తు చేసిన కమిన్స్ సేన.. నిన్నటి మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​ మీద థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో 2 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్​హెచ్.. 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. ఈ టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. ఓవర్లన్నీ ఆడి 180 పరుగులే చేయగలిగింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్​లో సన్​రైజర్స్ 5వ స్థానానికి ఎగబాకింది. ఇదే జోరును మున్ముందు కూడా కొనసాగిస్తే టీమ్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక, ఈ సీజన్​లో ఎస్​ఆర్​హెచ్​లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒక విషయంలో మాత్రం జట్టు పూర్తిగా మారిపోయింది.

సన్​రైజర్స్ ముందు నుంచి బౌలింగ్​లో తోపుగా ఉంది. పేసర్లతో పాటు క్వాలిటీ స్పిన్నర్లు ఉండటంతో జట్టు చిన్న టార్గెట్లను కూడా కాపాడుకుంటూ సంచలన విజయాలు అందుకుంటూ వచ్చింది. ఫీల్డింగ్​లో కూడా టీమ్ బాగుంది. కానీ గత కొన్ని సీజన్లుగా బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఫ్రాంచైజీని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వస్తోంది. బౌలర్లు ఎంత కష్టపడినా బ్యాటింగ్ యూనిట్ వైఫల్యం కారణంగా చేతి దాకా వచ్చిన మ్యాచ్​లు మిస్సయ్యేవి. బ్యాటర్ల ఫెయిల్యూర్ కారణంగా మెజారిటీ మ్యాచుల్లో ఎస్​ఆర్​హెచ్ ఓడిపోయింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. గత సీజన్​కు ఈ సీజన్​కు టీమ్​లో క్లియర్ ఛేంజ్ కనిపిస్తోంది. ఒకప్పుడు బలహీనంగా ఉన్న బ్యాటింగ్ ఇప్పుడు జట్టుకు అతిపెద్ద బలంగా మారింది. ఇప్పటిదాకా ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ బ్యాటర్లు రాణించారు.

ఈ సీజన్​లో ఆడిన ప్రతి మ్యాచ్​లోనూ కనీసం 180 పరుగుల మార్క్​ను రీచ్ అయింది ఎస్ఆర్​హెచ్. ఒక్క గుజరాత్ మీదే యావరేజ్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఆ మ్యాచ్​లో 162 పరుగులు చేసింది. కేకేఆర్​తో మ్యాచ్​లో 204, పంజాబ్​తో మ్యాచ్​లో 182 పరుగులు చేసింది. సీఎస్​కేతో మ్యాచ్​లో 166 పరుగుల టార్గెట్​ను 18.1 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది. ముంబై ఇండియన్స్​ మీదనైతే చరిత్రను తిరగరాస్తూ 277 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. బ్యాటర్ల సక్సెస్​కు ఇదే బిగ్ ఎగ్జాంపుల్. ఆరెంజ్ క్యాప్ లిస్ట్​లో టాప్-10లో ఇద్దరు ఎస్ఆర్​హెచ్ ప్లేయర్లు ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్ 186 పరుగులతో 3వ స్థానంలో, 177 పరుగులతో అభిషేక్ శర్మ 8వ ప్లేస్​లో ఉన్నారు. దీన్ని బట్టే మన బ్యాటర్ల డామినేషన్ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. హెడ్, మార్క్రమ్, నితీష్​ కుమార్ రెడ్డి కూడా అవసరం వచ్చినప్పుడల్లా బ్యాట్లతో దుమ్మురేపుతున్నారు. ఇదే తీరులో ఆడితే ఇక ఎస్​ఆర్​హెచ్​కు తిరుగుండదని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. బ్యాటింగ్ బలహీనతను బలంగా చేసుకొని సన్​రైజర్స్ చెలరేగుతుండటం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments