iDreamPost
android-app
ios-app

IPL 2024: ఎమర్జెన్సీ సాకుతో ఐపీఎల్ మ్యాచ్ కు.. బాస్ కు తెలిసి..!

  • Published Apr 09, 2024 | 12:59 PM Updated Updated Apr 09, 2024 | 12:59 PM

ఓ లేడీ ఆర్సీబీ ఫ్యాన్ మెడికల్ ఎమర్జెన్సీ సాకుతో లీవ్ తీసుకుని ఐపీఎల్ మ్యాచ్ కు వచ్చింది. అయితే మ్యాచ్ చూడ్డానికి వెళ్లినట్లు బాస్ కు తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఓ లేడీ ఆర్సీబీ ఫ్యాన్ మెడికల్ ఎమర్జెన్సీ సాకుతో లీవ్ తీసుకుని ఐపీఎల్ మ్యాచ్ కు వచ్చింది. అయితే మ్యాచ్ చూడ్డానికి వెళ్లినట్లు బాస్ కు తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • Published Apr 09, 2024 | 12:59 PMUpdated Apr 09, 2024 | 12:59 PM
IPL 2024: ఎమర్జెన్సీ సాకుతో ఐపీఎల్ మ్యాచ్ కు.. బాస్ కు తెలిసి..!

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. దీంతో తమ దగ్గర్లో మ్యాచ్ జరుగుతుందంటే చాలు అభిమానులు సంతోషంతో స్టేడియాలకు పరుగులు పెడుతున్నారు. అయితే కొంత మంది ఫ్యాన్స్ కు మ్యాచ్ చూడాలని ఉన్నాగానీ.. సెలవులు లేకపోవడంతో, ఇవ్వకపోవడంతో మ్యాచ్ చూడాలన్న కోరికను మనసులోనే చంపుకుంటున్నారు. కానీ ఓ లేడీ ఆర్సీబీ ఫ్యాన్ మాత్రం మాస్టర్ ప్లాన్ తో బాస్ ను బురిడీ కొట్టించి ఐపీఎల్ మ్యాచ్ కు వచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ సాకుతో లీవ్ తీసుకున్న ఆ లేడీ.. మ్యాచ్ చూడ్డానికి వెళ్లినట్లు బాస్ కు తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో టీమ్ 28 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఎప్పుడో జరిగిన మ్యాచ్ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అనేగా మీ డౌట్? అక్కడే వస్తున్నా.. ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే? మెడికల్ ఎమర్జెన్సీ ఉందని లీవ్ తీసుకుంది ఓ లేడీ ఉద్యోగి. కానీ ఆమె ఇంట్లో ఎమర్జెన్సీ లేదు. ఆ లీవ్ తీసుకుంది ఆర్సీబీ-లక్నో మ్యాచ్ చూడ్డానికి. ఆర్సీబీ వీరాభిమాని ఆ లేడీ. ఇక తాను కోరుకున్నట్లుగానే మ్యాచ్ కు హాజరై.. తెగ ఎంజాయ్ చేసింది సదరు యువతి.

కానీ కెమెరామెన్ చేసిన పని ఆమెను బాస్ కు పట్టించింది. సాధారణంగానే కెమెరామెన్ లు అందమైన అమ్మాయిలను పదే పదే చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ లేడీని కూడా ఓసారి బిగ్ స్క్రీన్ పై చూపించాడు కెమెరామెన్. ఇక ఇదే టైమ్ కు ఇంట్లో మ్యాచ్ చూస్తున్న బాస్ కు ఈ దృశ్యం కంటపడింది. ఇంకేముందు నెక్ట్స్ డేనే ఆమెను ఉద్యోగం లోంచి తీసేశారు అనుకుంటున్నారా? లేదు ఇక్కడ జరిగింది వేరు. మ్యాచ్ ముగిసిన మురుసటి రోజు ఆమెకు బాస్ నుంచి టెక్ట్స్ మెసేజ్ లు వచ్చాయి. ఆమెను రియాక్షన్స్ టీవీలో చూశానని బాస్ నుంచి మెసేజ్ లు వచ్చాయి. ఇక తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను సదరు లేడీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీరి చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆర్సీబీ వీరాభిమాని చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Neha Dwivedi (@mishraji_ki_bitiya)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet