Nidhan
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై బీసీసీఐ వేటు వేసింది. బోర్డు అనూహ్య నిర్ణయంతో అంతా షాక్ అవుతున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై బీసీసీఐ వేటు వేసింది. బోర్డు అనూహ్య నిర్ణయంతో అంతా షాక్ అవుతున్నారు.
Nidhan
యాక్సిడెంట్ కారణంగా రెండేళ్ల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు రిషబ్ పంత్. ఎంతో టాలెంట్ ఉన్నోడు, టీమిండియా ఫ్యూచర్‌గా పేరు తెచ్చుకున్న క్రికెటర్ ఇలా ప్రమాదానికి గురవ్వడం, క్రికెట్‌కు దూరమవడంతో అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. అయితే ఆస్పత్రి బెడ్ మీద నుంచి లేస్తాడో లేవడో తెలియని సిచ్యువేషన్ నుంచి రెండేళ్లు గడిచేసరికి తిరిగి క్రికెట్ ఫీల్డ్‌లో అదరగొట్టే స్థాయికి చేరుకున్నాడు పంత్. కమ్‌బ్యాక్ కోసం నెలల పాటు కఠోరంగా శ్రమించి తన బ్యాటింగ్ టెక్నిక్, ఫిట్నెస్ను మెరుగుపర్చుకున్నాడు. రీఎంట్రీలో ఐపీఎల్-2024లో అదరగొడుతున్నాడు. ఇప్పటిదాకా 12 మ్యాచుల్లో 413 పరుగులు చేశాడు. అలాంటోడి మీద బీసీసీఐ వేటు వేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మీద బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందున అతడిపై ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. బ్యాన్ వేయడమే గాక పంత్‌కు రూ.30 లక్షల జరిమానాను కూడా విధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో మే 7వ తేదీన జరిగిన మ్యాచ్‌లో డీసీ టీమ్ ఓవర్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్‌పై వేటు పడింది. పంత్‌తో పాటు మిగతా టీమ్మేట్స్ మీద కూడా చర్యలు తీసుకున్నారు ఐపీఎల్ ఆర్గనైజర్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం లేదా రూ.12 లక్షలు ఫైన్ కట్టాలని ఆదేశించారు.
స్లో ఓవర్ రేట్ మెయింటెయిన్ చేశారన్న మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఛాలెంజ్ చేసింది. అయితే ఈ రివ్యూను పున: సమీక్షించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్.. మ్యాచ్ రిఫరీ డిసిషన్ ఫైనల్ అని స్పష్టం చేశారు. దీంతో పంత్‌తో పాటు ఇతర ఆటగాళ్లకు కూడా మ్యాచ్ ఫీజులో కోత పడింది. రిషబ్కైతే ఏకంగా మ్యాచ్ బ్యాన్ కూడా వేశారు. ఇది డీసీకి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఎందుకంటే, ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ తర్వాతి రెండు మ్యాచుల్లోనూ నెగ్గి తీరాలి. ఆర్సీబీతో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టైమ్‌లో మ్యాచ్‌కు కెప్టెన్, గెలుపు గుర్రమైన పంత్ దూరం కానుండటంతో ఆ టీమ్ ఎలా ఆడుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరి.. పంత్ లేకున్నా డీసీ గెలుస్తుందని భావిస్తే కామెంట్ చేయండి.
🚨 Rishabh Pant suspended for a match and fined 30 Lakhs for maintaining slow overrate. 🚨 pic.twitter.com/wpbUXd48nc
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 11, 2024