iDreamPost

RR vs PBKS: బుమ్రాను దాటేసిన హర్షల్ పటేల్.. తిట్టిన నోళ్లు మూయించాడు!

  • Published May 15, 2024 | 9:54 PMUpdated May 15, 2024 | 9:54 PM

పంజాబ్ కింగ్స్ స్పీడ్​స్టర్ హర్షల్ పటేల్ సత్తా చాటాడు. ఇన్నాళ్లూ తనను తిట్టిపోసిన నోళ్లను బౌలింగ్​తోనే మూయించాడు.

పంజాబ్ కింగ్స్ స్పీడ్​స్టర్ హర్షల్ పటేల్ సత్తా చాటాడు. ఇన్నాళ్లూ తనను తిట్టిపోసిన నోళ్లను బౌలింగ్​తోనే మూయించాడు.

  • Published May 15, 2024 | 9:54 PMUpdated May 15, 2024 | 9:54 PM
RR vs PBKS: బుమ్రాను దాటేసిన హర్షల్ పటేల్.. తిట్టిన నోళ్లు మూయించాడు!

చెత్త బౌలర్ అని విమర్శించారు. ఇంతకంటే దరిద్రమైన ప్లేయర్ ఇంకొకడు లేడని తిట్టిపోశారు. ఇతడ్ని టీమ్​లో నుంచి తీసేయాలంటూ డిమాండ్లు చేశారు. కానీ అతడే ఇప్పుడు జట్టుకు దిక్కయ్యాడు. అద్భుతమైన బౌలింగ్​తో సత్తా చాటాడు. అతడే పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. పరువు దక్కించుకోవడం కోసం ఆడుతున్న ఆ జట్టు కోసం తాను ఉన్నానని నిలబడ్డాడు హర్షల్. రాజస్థాన్​ రాయల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. జస్​ప్రీత్ బుమ్రాను దాటేశాడతను.

పరువు కోసం పోరాడుతున్న పంజాబ్​.. రాజస్థాన్​ను వణికించింది. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన సంజూ సేన 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీనియర్ పేసర్ హర్షల్ నిప్పులు చెరిగే బంతులతో రాజస్థాన్ బ్యాటర్లను భయపెట్టాడు. 2 వికెట్లు తీసిన అతడు పర్పుల్ క్యాప్​ను సొంతం చేసుకున్నాడు. ఆ లిస్ట్​లో తన కంటే ముందున్న బుమ్రా (20 వికెట్లు)ను దాటేశాడు. ఈ మ్యాచ్​లో తీసిన రెండు వికెట్లతో ఈ సీజన్​లో హర్షల్ వికెట్ల సంఖ్య 22కు చేరింది. అతడి పెర్ఫార్మెన్స్​పై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెత్త బౌలర్ అన్నారు.. ఇప్పుడు చూడండి బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీశాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. హర్షల్ బౌలింగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి