iDreamPost
android-app
ios-app

RR vs DC: రియాన్ పరాగ్ మాస్ హిట్టింగ్.. ఓవరాక్షన్ స్టార్ ఆటే మారిపోయింది!

  • Published Mar 28, 2024 | 9:41 PM Updated Updated Mar 28, 2024 | 9:41 PM

ఓవరాక్షన్​ స్టార్​ రియాన్ పరాగ్ మాస్ హిట్టింగ్​తో చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను ఓ రేంజ్​లో ఆడుకున్నాడు.

ఓవరాక్షన్​ స్టార్​ రియాన్ పరాగ్ మాస్ హిట్టింగ్​తో చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను ఓ రేంజ్​లో ఆడుకున్నాడు.

  • Published Mar 28, 2024 | 9:41 PMUpdated Mar 28, 2024 | 9:41 PM
RR vs DC: రియాన్ పరాగ్ మాస్ హిట్టింగ్.. ఓవరాక్షన్ స్టార్ ఆటే మారిపోయింది!

ఐపీఎల్​లో ఓవరాక్షన్​ స్టార్​గా పేరు తెచ్చుకున్నాడతను. బ్యాటర్​గా టీమ్​లో ఉన్నా ఏనాడు భారీ స్కోర్లు బాదింది లేదు. ఒక్క సిక్స్ కొట్టినా లేదా ఓ క్యాచ్ పట్టినా బాగా బిల్డప్ ఇస్తాడు. అతడి వింత చేష్టలు చూసి ఫ్యాన్స్ ఓవరాక్షన్ స్టార్ అని పేరు పెట్టారు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ట్రోల్ చేసేవారు. అయితే మొత్తానికి అతడిలో మార్పు వచ్చింది. తాను ఓవరాక్షన్ స్టార్ కాదు.. సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసే పనిలో పడ్డాడా బ్యాటర్. అతడే రియాన్ పరాగ్. ఈ ఏడాది డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపిన అతడు.. రంజీ ట్రోఫీలో చెలరేగి బ్యాటింగ్ చేశాడు. దీంతో ఐపీఎల్​లోనూ రాణిస్తాడని అంతా అనుకున్నారు. ఆడియెన్స్ అంచనాలను అతడు నిలబెట్టాడు. ఈ సీజన్​లో తొలి మ్యాచ్​లో 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్​తో సెకండ్ మ్యాచ్​లో రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకున్నాడతను. మొత్తంగా 45 బంతులు ఫేస్ చేసిన ఈ రాజస్థాన్ బ్యాటర్.. 84 పరుగులు చేశాడు. 7 బౌండరీలు బాదిన పరాగ్.. 6 భారీ సిక్సులు కొట్టాడు. అతడి ఐపీఎల్​ కెరీర్​లో ఇదే హయ్యెస్ట్ స్కోరు కావడం విశేషం. స్టార్ పేసర్ నార్త్​జే వేసిన లాస్ట్ ఓవర్​లో విధ్వంసం సృష్టించాడు పరాగ్. ఆ ఓవర్​లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. అందులో 3 ఫోర్లు, 2 సిక్సలు ఉన్నాయి. 4 వికెట్లకు 90 పరుగులతో కష్టాల్లో ఉన్న రాజస్థాన్ 20 ఓవర్లు ముగిసేసరికి 185 పరుగుల భారీ స్కోరు చేసింది. దీనికి పరాగ్ ఆడిన సూపర్బ్ ఇన్నింగ్స్​ కారణమని చెప్పొచ్చు. మరి.. పరాగ్ మెరుపు ఇన్నింగ్స్​ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: MS Dhoni: ధోని ముసలోడే కదా.. సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!