Rohit Sharma: రోహిత్ కోసం నా ఆస్తులు అమ్మడానికీ రెడీ.. ప్రీతి జింటా సంచలన వ్యాఖ్యలు!

పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతి జింటా సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కోసం తన ఆస్తులు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హిట్​మ్యాన్​ను ఉద్దేశించి ఆమె ఇంకా ఏమన్నారంటే..!

పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతి జింటా సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కోసం తన ఆస్తులు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హిట్​మ్యాన్​ను ఉద్దేశించి ఆమె ఇంకా ఏమన్నారంటే..!

ముంబై ఇండియన్స్ కథ మళ్లీ మొదటికొచ్చింది. వరుసగా రెండు విజయాలతో గాడిన పడిందనుకున్న టీమ్ మరో ఓటమిని మూటగట్టుకుంది. చెన్నై సూపర్ కింగ్స్​తో ఆదివారం వాంఖడేలో జరిగిన మ్యాచ్​లో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది హార్దిక్ సేన. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్​కే ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఫ్లాట్ వికెట్​ మీద ఈ టార్గెట్​ను ముంబై ఈజీగా ఛేజ్ చేస్తుందని అంతా భావించారు. బ్యాటింగ్ యూనిట్​లో డెప్త్ ఉండటం, జట్టు నిండా స్టార్లు ఉండటంతో ఎంఐ గెలుపు పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఆ టీమ్​కు ఓటమి తప్పలేదు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్) సెంచరీ వృథా అయింది. అతడు ఆఖరి వరకు పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఈ తరుణంలో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతి జింటా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్​కు సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను మినీ వేలంలో ట్రేడ్ చేసుకొని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ డెసిషన్ మీద రోహిత్ ఫ్యాన్స్ సీరియస్​గా ఉన్నారు. ముంబై మ్యాచ్​లు ఎక్కడ జరిగినా పాండ్యాను టార్గెట్ చేసుకొని హేళన చేస్తున్నారు. ఎంఐ ఓనర్స్ నిర్ణయంపై హిట్​మ్యాన్​ కూడా అసంతృప్తిగా ఉన్నాడని.. వచ్చే ఏడాది అతడు ఆ టీమ్​ను వీడటం పక్కా అని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడ్ని తీసుకునేందుకు చాలా జట్లు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ విషయం మీద తాజాగా పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతి జింటా రియాక్ట్ అయ్యారు. రోహిత్ శర్మ కోసం తన ఆస్తులు అమ్మేందుకైనా రెడీ అని ఆమె అన్నారు. వేలంలోకి వస్తే హిట్​మ్యాన్​ను సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

వచ్చే ఏడాది ఆక్షన్​లోకి భారత కెప్టెన్​ రోహిత్ శర్మ వస్తే అతడ్ని దక్కించుకునేందుకు తన దగ్గర ఉన్నదంతా బిడ్ వేస్తానని ప్రీతి జింటా తెలిపారు. పంజాబ్ టీమ్​లో స్టెబిలిటీ లేదన్నారు. జట్టుకు ఛాంపియన్ మైండ్​సెట్ కలిగిన కెప్టెన్ అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకే హిట్​మ్యాన్​ను దక్కించుకునేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని ప్రీతి జింటా స్పష్టం చేశారు. ప్రీతి కామెంట్స్​ మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ రోహిత్ గనుక ఆ టీమ్​లోకి వస్తే కప్పు కల నెరవేరడం పక్కా అని అంటున్నారు. అయితే పంజాబే కాదు.. చాలా జట్లు హిట్​మ్యాన్​ మీద కన్నేశాయని, అతడ్ని సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదని చెబుతున్నారు. రోహిత్ కోసం తీవ్ర పోటీ తప్పదని.. వేలంలో పాత రికార్డులు బద్దలవుతాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రోహిత్​పై ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యల మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments