iDreamPost
android-app
ios-app

వీడియో: చావు నుంచి బయటపడ్డాక.. పంత్ రీఎంట్రీ! అంతా లేచి నిలబడి..!

  • Published Mar 23, 2024 | 5:03 PM Updated Updated Mar 23, 2024 | 5:11 PM

మరణాన్ని దాటిన మృత్యుంజయుడు గ్రౌండ్​లోకి అడుగుపెట్టాడు. అతడి రీఎంట్రీకి స్టేడియం దద్దరిల్లింది. మనం మాట్లాడుకుంటోంది మరెవరి గురించో కాదు.. చావు నుంచి బయటపడి కమ్​బ్యాక్ ఇస్తున్న స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గురించే.

మరణాన్ని దాటిన మృత్యుంజయుడు గ్రౌండ్​లోకి అడుగుపెట్టాడు. అతడి రీఎంట్రీకి స్టేడియం దద్దరిల్లింది. మనం మాట్లాడుకుంటోంది మరెవరి గురించో కాదు.. చావు నుంచి బయటపడి కమ్​బ్యాక్ ఇస్తున్న స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గురించే.

  • Published Mar 23, 2024 | 5:03 PMUpdated Mar 23, 2024 | 5:11 PM
వీడియో: చావు నుంచి బయటపడ్డాక.. పంత్ రీఎంట్రీ! అంతా లేచి నిలబడి..!

మరణాన్ని దాటిన మృత్యుంజయుడు మళ్లీ గ్రౌండ్​లోకి అడుగుపెట్టాడు. 454 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగి అదరగొట్టాడు. అతడి రీఎంట్రీకి స్టేడియం మొత్తం దద్దరిల్లింది. మనం మాట్లాడుకుంటోంది మరెవరి గురించో కాదు.. స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గురించే. టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ పంత్ క్రికెట్​లోకి కమ్​బ్యాక్ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఉన్న రిషబ్.. ఐపీఎల్-2024లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. చండీగఢ్​లో కొత్తగా నిర్మించిన మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్​తో జరుగుతున్న మ్యాచ్​తో పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. అతడు గ్రౌండ్​లోకి అడుగు పెట్టగానే స్టేడియం మొత్తం అభిమానుల హోరుతో దద్దరిల్లింది.

పంజాబ్​తో మ్యాచ్​లో షై హోప్ (33) ఔట్ అవడంతో సెకండ్ డౌన్​లో ఆడేందుకు వచ్చాడు పంత్. అతడు గ్రౌండ్​లోకి రాగానే డీసీ డగౌట్​లోని ప్లేయర్లు అంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. అలాగే స్టేడియంలో ఫ్యాన్స్ అంతా చప్పట్లు, విజిల్స్​తో పంత్​ను ఎంకరేజ్ చేశారు. ‘పంత్.. పంత్’ అంటూ గట్టిగా అరిచారు. ఆ టైమ్​లో ఆకాశం వైపు చూస్తూ కళ్లు మూసుకొని ఎవర్నో తలచుకున్నాడు రిషబ్. అతడు కాస్త ఎమోషనల్​గా కనిపించాడు. ఇన్నింగ్స్​ను బాగా స్టార్ట్ చేశాడు. క్రీజులో ఉన్నది తక్కువ సేపే అయినా క్లీన్ హిట్టింగ్​తో ఆకట్టుకున్నాడు.

Pant Re Entry

13 బంతుల్లో 18 పరుగులు చేసిన పంత్.. 2 బౌండరీలు బాదాడు. అయితే అతడు ఇచ్చిన క్యాచ్​ను వదిలేసిన హర్షల్ పటేల్.. మళ్లీ బౌలింగ్​కు వచ్చి ఓ స్లో బౌన్సర్​తో పంత్​ను ఔట్ చేశాడు. రిషబ్ క్రీజును వీడి వెళ్తున్న టైమ్​లో కూడా అతడ్ని అందరూ మెచ్చుకున్నారు. పంత్ గ్రౌండ్​లోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత పలు షాట్లతో అలరించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు.. పంత్ రియల్ ఫైటర్ అంటున్నారు. లైఫ్​లో ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, మళ్లీ కమ్​బ్యాక్ ఇవ్వడం, గోడకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ అవ్వడం ఎలాగో అతడ్ని చూసి నేర్చుకోవాలని అంటున్నారు. మరి.. పంత్ రీఎంట్రీ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IPL 2024: పృథ్వీ షా.. ఇక ఐపీఎల్‌లో కూడా కనిపించడా?