iDreamPost
android-app
ios-app

ప్లేఆఫ్సే కాదు, RCB ఫైనల్స్​కు వెళ్లడం కూడా పక్కా.. ఈ సెంటిమెంటే ప్రూఫ్!

  • Published May 13, 2024 | 12:16 PMUpdated May 13, 2024 | 12:16 PM

వరుసగా 5 విజయాలతో ఐపీఎల్-2024లో దుమ్మురేపింది ఆర్సీబీ. ఎదురొచ్చిన ప్రతి జట్టును చిత్తు చేస్తూ బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకుపోతోంది బెంగళూరు.

వరుసగా 5 విజయాలతో ఐపీఎల్-2024లో దుమ్మురేపింది ఆర్సీబీ. ఎదురొచ్చిన ప్రతి జట్టును చిత్తు చేస్తూ బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకుపోతోంది బెంగళూరు.

  • Published May 13, 2024 | 12:16 PMUpdated May 13, 2024 | 12:16 PM
ప్లేఆఫ్సే కాదు, RCB ఫైనల్స్​కు వెళ్లడం కూడా పక్కా.. ఈ సెంటిమెంటే ప్రూఫ్!

వరుసగా 5 విజయాలతో ఐపీఎల్-2024లో దుమ్మురేపింది ఆర్సీబీ. ఎదురొచ్చిన జట్టును చిత్తు చేస్తూ బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకుపోతోంది బెంగళూరు. సీజన్ మొదట్లో వరుస పరాజయాలతో అభిమానుల్ని తీవ్రంగా నిరాశపర్చిన డుప్లెసిస్ సేన.. సెకండాఫ్​లో గాడిలో పడింది. ప్లేఆఫ్స్​కు ముందు జూలు విదిల్చి.. తన అసలైన గేమ్​ను బయటపెట్టింది. ఆ టీమ్, ఈ టీమ్ అని చూడకుండా.. అందర్నీ ఓడిస్తూ పోతోంది. చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగే ఆఖరి మ్యాచ్​లోనూ నెగ్గితే ఆ టీమ్ ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అవుతుంది. అయితే జోరు మీదున్న సీఎస్​కేను ఓడించి ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అలా డౌట్ పడాల్సిన అవసరం లేదు.

ప్లేఆఫ్సే కాదు.. ఈ సీజన్​లో ఫైనల్​కు కూడా ఆర్సీబీ వెళ్లడం పక్కాగా కనిపిస్తోంది. అదేంటి ఇంకా ప్లేఆఫ్స్​కే క్వాలిఫై కాలేదు, అప్పుడే ఫైనల్ మ్యాచ్ గురించి ఎందుకు చెబుతున్నారనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం.. బెంగళూరుకు ఓ సెంటిమెంట్​ భరోసాను ఇస్తోంది. ఈసారి ఫైనల్ వరకు వెళ్లగలమనే ధీమాను కల్పిస్తోంది. 2009, 2011, 2016 ఐపీఎల్ సీజన్లలో ఆర్సీబీ వరుసగా 5 మ్యాచుల్లో విజయాలు సాధించింది. ఈ మూడు సీజన్లలోనూ ఏదో ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ ఫైవ్ విక్టరీస్ కొట్టింది. అలా గెలుపొందిన మూడు సీజన్లలోనూ బెంగళూరు ఫైనల్స్​కు క్వాలిఫై అయింది. తుదిపోరులో గెలవలేదనేది వేరే విషయం. కానీ ఈ సెంటిమెంట్ ఈసారి కూడా రిపీట్ అవుతున్నట్లే కనిపిస్తోంది.

ఐపీఎల్-2024 ఫస్టాఫ్​లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి పాయింట్స్ టేబుల్​లో లాస్ట్ ప్లేస్​కు పడిపోయింది ఆర్సీబీ. అయితే పరువు కాపాడుకునే క్రమంలో తన అసలైన సత్తాను చూపిస్తూ గత 5 మ్యాచుల్లోనూ విజయాలు సాధించింది. ఈ లెక్కన 2009, 2011, 2016 సెంటిమెంట్ రిపీట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ప్లేఆఫ్సే కాదు.. ఏకంగా ఫైనల్​కు కూడా కోహ్లీ టీమ్ చేరడం ఖాయం. ఆ జట్టు అభిమానులు ఈ సెంటిమెంట్​ తమకు వర్కౌట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. మరి.. ఈ సెంటిమెంట్ రిపీటై ఆర్సీబీ ఫైనల్స్​కు చేరుతుందని మీరు భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి