Travis Head: ట్రావిస్ హెడ్​ సెలబ్రేషన్స్​కు అర్థం తెలుసా.. అలా ఎందుకు చేశాడంటే?

సన్​రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. బౌండరీలు, సిక్సులతో చిన్నస్వామి స్టేడియంలో పెను విధ్వంసం సృష్టించాడు.

సన్​రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. బౌండరీలు, సిక్సులతో చిన్నస్వామి స్టేడియంలో పెను విధ్వంసం సృష్టించాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ తుఫానులో చిన్నస్వామి స్టేడియం మునిగిపోయింది. క్రీజులోకి వచ్చిందే తడవు బౌండరీలు, సిక్సులతో ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్లు సృష్టించిన సునామీలో ఆర్సీబీ బౌలర్లు కొట్టుకుపోయారు. మునుపెన్నడూ చూడని పెను విధ్వంసం ఇది. ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ వరకు మాస్ హిట్టింగ్​తో సన్​రైజర్స్ బ్యాటర్లు శివతాండవం చేశారు. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన ఎస్​ఆర్​హెచ్ 20 ఓవర్లకు ఏకంగా 287 పరుగులు చేసింది. తద్వారా లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. టీమ్ ఇన్నింగ్స్​లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీ హైలైట్​గా నిలిచింది.

41 బంతులు ఎదుర్కొన్న హెడ్ 102 పరుగులు చేశాడు. 39 బంతుల్లోనే సెంచరీ మార్క్​ను రీచ్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్​లో 9 బౌండరీలతో పాటు 8 భారీ సిక్సులు ఉన్నాయి. ఏ బౌలర్ అనేది లెక్క చేయకుండా బాల్​ను బౌండరీ లైన్ దాటించడమే టార్గెట్ అన్నట్లు హెడ్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో సెంచరీ తర్వాత అతడు వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. హెల్మెట్​ను తీసి ఎడమ చేతితో పట్టుకున్న బ్యాట్​ కొసకు తగిలించాడు. దీంతో ఇదేం వింత సెలబ్రేషన్ అని అంతా అనుకుంటున్నారు. దీనికి అర్థం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది హెడ్ సెలబ్రేషన్ కాదు.. దీనికి యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆద్యుడని చెప్పాలి.

సెంచరీ చేశాక గేల్ ఇలాగే సెలబ్రేట్ చేసుకునేవాడు. దాన్నే ఇప్పుడు హెడ్ రిపీట్ చేశాడు. దీని వెనుక ఓ కారణం ఉంది. ఆర్సీబీకి అప్పట్లో ఆడాడు హెడ్. కానీ అతడికి ఎక్కువ ఛాన్సులు ఇవ్వలేదు. తర్వాతి సీజన్​లో జట్టులో నుంచి తొలగించారు. దీంతో తాజాగా రివేంజ్ తీర్చుకున్నాడు. అది కూడా బెంగళూరు హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో. అందుకే సెంచరీ తర్వాత ఆ జట్టు మాజీ బ్యాటర్ అయిన గేల్​ను ఇమిటేట్ చేస్తూ బ్యాట్, హెల్మెట్​తో సెలబ్రేట్ చేసుకున్నాడు. మరి.. హెడ్ సెలబ్రేషన్​ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments