iDreamPost

వీడియో: టాస్ రిగ్గింగ్ పై ఓపెన్ అయిన డుప్లెసిస్.. రిఫరీ ఇలా చేశాడంటూ కమ్మిన్స్ కి వివరిస్తూ..

Toss Rigging In IPL?- Duplessis Explained Cummins: ముంబయి ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. తాజాగా హైదరాబాద్ తో మ్యాచ్ లో డుప్లెసిస్ ఆ అనుమానాలు మరింత బలపడేలా ప్రవర్తించాడు.

Toss Rigging In IPL?- Duplessis Explained Cummins: ముంబయి ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. తాజాగా హైదరాబాద్ తో మ్యాచ్ లో డుప్లెసిస్ ఆ అనుమానాలు మరింత బలపడేలా ప్రవర్తించాడు.

వీడియో: టాస్ రిగ్గింగ్ పై ఓపెన్ అయిన డుప్లెసిస్.. రిఫరీ ఇలా చేశాడంటూ కమ్మిన్స్ కి వివరిస్తూ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో అద్భుతమైన మ్యాచులు చూసి ఐపీఎల్ ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన టీమ్స్ విజయాలు, పోరాటాలు చూసి ముచ్చట పడిపోతున్నారు. అయితే ఈ సీజన్ మీద కొన్ని మచ్చలు కూడా పడుతున్నాయి. వాటిలో ప్రధానంగా ఇటీవల జరిగిన ముంబయి ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించే మాట్లాడుతున్నారు. ఆ మ్యాచ్ లో ఎన్నో నిర్ణయాలు ముంబయి జట్టుకు అనుకూలంగా తీసుకున్నారని ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా టాస్ కూడా రిగ్గింగి జరిగిందంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈ విషయంపై ఓపెన్ అయినట్లు కనిపించింది.

సోమవారం బెంగళూరు వేదికగా ఆర్సీబీ- హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ వేసే సమయంలో ఒక ఆసక్తికర ఘటన కెమెరా కంటికి చిక్కింది. అదేంటంటే.. టాస్ కి వచ్చిన సమయంలో పాట్ కమ్మిన్స్, ఫాఫ్ డుప్లెసిస్ మధ్య ఒక సంభాషణ జరిగింది. అది టాస్ కి సంబంధించే జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఫాఫ్ డుప్లెసిస్ టాస్ జరిగిన విధానం గురించి కమ్మిన్స్ కి వివరిస్తూ కనిపించాడు. ఫాఫ్ డుప్లెసిస్ కాయిన్ తీసి టాస్ చేయడం.. అది దూరంగా వెళ్లిపడటం చూపించాడు. అంతేకాకుండా కాయిన్ ని కింద నుంచి తీస్తూ.. దానిని రిఫరీ ఫ్లిప్ చేసి చూపించాడు అన్నట్లుగా డుప్లెసిస్ బాడీ లాంగ్వేజ్ ఉంది. అది చూస్తూ కమ్మిన్స్ నవ్వుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముంబయి- బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో రిగ్గింగ్ జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైగా అక్కడే ఉండి చూసిన ఫాఫ్ డుప్లెసిస్ కూడా అలాంటి సైగలు చేస్తూ ఒకింత అసహనం వ్యక్తం చేయడం కనిపిస్తోంది. మొన్నటి వరకు ఈ టాస్ రిగ్గింగ్ వివాదం గురించే నెట్టింట తెగ డిస్కషన్స్ జరిగాయి. ఇప్పుడు ఏకంగా ఆర్సీబీ కెప్టెన్ కూడా అలాంటి ఆరోపణలు చేస్తూ కనిపించడంతో మరోసారి ఈ టాస్ రిగ్గింగ్ ఆరోపణలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిజంగానే ముంబయి మ్యాచ్ లో ఫిక్సింగ్ కు పాల్పడ్డారు అంటూ బెంగళూరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాము గెలవాల్సిన మ్యాచ్ లో అంపైర్ల సాయంతో ముంబయి జట్టు గెలిచిందంటూ ఆరోపణలు చేస్తున్నారు.

ఇంక హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ జట్టులో మరోసారి బౌలింగ్ యూనిట్ డొల్లతనం బయట పడింది. జట్టు బ్యాటింగ్ పరంగా ఎంత పటిష్టంగా ఉందో.. బౌలింగ్ పరంగా మాత్రం తేలపోతోంది అంటూ రుజువైంది. హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్(102) అద్భుతమైన శతకం నమోదు చేశాడు. కేవలం 39 బంతుల్లోనే శతకం బాదేశాడు. అలాగే క్లాసెన్ కాకా సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కేవలం 31 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. 7 సిక్సర్లు, 2 ఫోర్లతో ఆర్సీబీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. మరి.. ముంబయి- ఆర్సీబీ మ్యాచ్ లో టాస్ రిగ్గింగ్ జరిగిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి