Nidhan
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ తోపే అనేది తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌తో ఇది మరోమారు ప్రూవ్ అయింది. అతడి త్రోకు ప్రత్యర్థి బ్యాటర్‌తో పాటు సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ తోపే అనేది తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌తో ఇది మరోమారు ప్రూవ్ అయింది. అతడి త్రోకు ప్రత్యర్థి బ్యాటర్‌తో పాటు సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు.
Nidhan
విరాట్ కోహ్లీ అనగానే అందరికీ గ్రేట్ బ్యాటర్ అనే తెలుసు. కోహ్లీ పేరు చెబితే ఎవరైనా అతడి బ్యాటింగ్‌ను గుర్తుచేసుకుంటారు. ఫెంటాస్టిక్ బ్యాటింగ్‌తో అతడు క్రికెట్ ప్రపంచం మీద వేసిన ముద్ర అలాంటిది. అయితే బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ విరాట్ తోపే అనేది తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో ఇది మరోమారు ప్రూవ్ అయింది. అతడి త్రోకు ప్రత్యర్థి బ్యాటర్‌తో పాటు సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాక్ అయ్యారు. జీటీ బ్యాట్స్‌మన్ షారుఖ్ ఖాన్‌ను ఓ అద్భుతమైన త్రోతో వెనక్కి పంపాడు కింగ్. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ తక్కువ స్కోరుకే 3 వికెట్లు కోల్పోయింది. 19 పరుగులకే ఓపెనర్లు సాహా, గిల్‌తో పాటు వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
పించ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (30)తో జతకట్టిన షారుఖ్ (37) నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. అయితే అతడు మరింత ప్రమాదకరంగా మారుతున్న టైమ్‌లో కోహ్లీ బుల్లెట్ త్రోతో అతడ్ని ఔట్ చేశాడు. విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్‌లో గుండ్ లెంగ్త్‌లో పడిన బంతిని రాహుల్ తెవాటియా షార్ట్ కవర్ వైపు కొట్టాడు. దీంతో నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న షారుఖ్ పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే తెవాటియా రన్ వద్దనడంతో మళ్లీ క్రీజులోకి చేరుకునేందుకు పరిగెత్తాడు. కానీ బంతిని అందుకున్న కోహ్లీ వికెట్లను గురి చూసి కొట్టాడు. క్రీజుకు కొద్ది దూరంలో ఉండగానే స్టంప్స్‌ను బాల్ హిట్ అవడంతో షారుఖ్ నిరాశతో క్రీజును వీడాడు. విరాట్ త్రోకు బ్యాటర్ షారుఖ్‌తో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు కూడా షాకయ్యారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ రేంజ్ ఫీల్డింగ్ అంటే అది కింగ్‌కే సాధ్యమని అంటున్నారు. మరి.. కోహ్లీ ఫీల్డింగ్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KING KOHLI EXCELLENCE IN THE FIELD. 🥶pic.twitter.com/FUQUBsHP9L
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 4, 2024