Nidhan
ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్‌కు నిన్న వర్షం అంతరాయం కలిగించింది. భారీ వాన రావడంతో మ్యాచ్ సాధ్యం కాదని అంతా భావించారు. కానీ వర్షం ఆగిన కొద్దిసేపట్లోనే తిరిగి గ్రౌండ్‌ను సిద్ధం చేశారు.
ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్‌కు నిన్న వర్షం అంతరాయం కలిగించింది. భారీ వాన రావడంతో మ్యాచ్ సాధ్యం కాదని అంతా భావించారు. కానీ వర్షం ఆగిన కొద్దిసేపట్లోనే తిరిగి గ్రౌండ్‌ను సిద్ధం చేశారు.
Nidhan
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మ్యాచ్ అది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పనిసరిగా నెగాల్సిన పరిస్థితి. బలాబలాల్లో రెండు జట్లూ సమానంగా కనిపించాయి. దీంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని సిచ్యువేషన్. మ్యాచ్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఆఖరి బంతి వరకు చాలా ఉత్కంఠగా సాగింది. ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. అయితే ప్రెజర్‌ను బాగా డీల్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది డుప్లెసిస్ సేన. అయితే మ్యాచ్‌కు నిన్న వర్షం అంతరాయం కలిగించింది. భారీ వాన రావడంతో మ్యాచ్ సాధ్యం కాదని అంతా భావించారు. కానీ వర్షం ఆగిన కొద్దిసేపట్లోనే తిరిగి గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. దీని వెనుక ఓ సాంకేతికత ఉంది.
ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 3 ఓవర్లు ముగిసిన తర్వాత భారీ వర్షం పడింది. వాన దెబ్బకు గ్రౌండ్ తడిసి ముద్దయింది. కవర్లు కప్పినా ప్రాక్టీస్ పిచ్‌ల మీద నీళ్లు చేరాయి. ఔట్ ఫీల్డ్ కూడా చిత్తడిగా మారింది. కాసేపటి తర్వాత వాన ఆగినా మ్యాచ్ జరగడం కష్టమని అంతా అనుకున్నారు. పిచ్, గ్రౌండ్ ఆరడానికి చాలా టైమ్ పడుతుంది కాబట్టి ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహిస్తారని భావించారు. కానీ చిన్నస్వామి స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ అద్భుతం చేసి చూపించారు. వర్షం నిలిచిన కొన్ని నిమిషాల్లోనే మైదానాన్ని ఆటకు సిద్ధం చేశారు. అంత వాన పడినా కొద్ది సేపట్లోనే గ్రౌండ్ అంతా తిరిగి నార్మల్ స్టేజ్‌కు చేరడానికి, నీళ్లు ఆరడానికి వెనుక ఓ టెక్నాలజీ పని చేసింది. అదే సబ్ ఎయిర్ డ్రైనేజ్ సిస్టమ్. ఈ సాంకేతికత కారణంగానే అంత భారీ వర్షం వచ్చినా గ్రౌండ్‌ను త్వరగా రెడీ చేశారు.
వర్షాల కారణంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగే చాలా మ్యాచులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొన్నేళ్ల కింద ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్‌ను పూర్తిగా మార్చేశారు. కొత్తగా సబ్ ఎయిర్ అనే డ్రైనేజ్ వ్యవస్థను ఇన్స్టాల్ చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉపయోగిస్తున్న అత్యాధునిక, అద్భుతమైన డ్రైనేజ్ సిస్టమ్స్‌లో ఇది మొదటి వరుసలో ఉంది. ఈ సిస్టమ్ వల్ల గ్రౌండ్లో ఎంత వర్షం పడినా కొన్ని నిమిషాల్లోనే నీరంతా బయటకు వెళ్లిపోతుంది. సబ్ ఎయిర్ డ్రైనేజ్‌లో భాగమైన 200 హార్స్ పవర్ మెషీన్లు నిమిషానికి 10 వేల లీటర్ల నీళ్లను బయటకు పంపిస్తాయి. ఈ కారణంగానే చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు ఎంత వాన పడినా రద్దవ్వవు. మరి.. ఇలాంటి డ్రైనేజ్ సిస్టమ్స్‌ను అన్ని స్టేడియాల్లోనూ తీసుకురావాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.